Multifunction Steamer: బిర్యానీ, నూడుల్స్, బార్బెక్యూ ఐటమ్స్‌ చేసుకోవచ్చు.. ధర 29 వేలు! | Multifunction Steamer: Can Cook Biryani And Barbeque Items | Sakshi
Sakshi News home page

Multifunction Steamer: ఇందులో ఎంచక్కా.. బిర్యానీ, నూడుల్స్, బార్బెక్యూ ఐటమ్స్‌ చేసుకోవచ్చు.. ధర 29 వేలు!

Published Fri, Feb 25 2022 10:03 AM | Last Updated on Fri, Feb 25 2022 10:27 AM

Multifunction Steamer: Can Cook Biryani And Barbeque Items - Sakshi

హైక్వాలిటీ హీట్‌ రెసిస్టెంట్‌ గ్లాస్‌ కవర్‌ కలిగిన ఈ ఎలక్ట్రిక్‌ హీట్‌ పాట్‌.. ట్రెండీ లుక్స్‌లోనూ.. పనితనంలోనూ సూపర్బ్‌. ఇరువైపులా ఇన్సులేటెడ్‌ హ్యాండిల్స్‌ కలిగిన ఈ డివైజ్‌ని వినియోగించడం చాలా సులభం. 5.5 లీటర్ల సామర్థ్యమున్న ఈ పాత్రలో చాలా వంటకాలను రుచికరంగా, ఎక్కువ పరిమాణంలో తయారు చేసుకోవచ్చు. దీన్ని కుకర్‌లా, స్టీమర్‌లా, గ్రిల్‌లా అన్ని రకాలుగానూ వినియోగించొచ్చు.

స్నేహితులు, బంధువులు వచ్చినప్పుడు ఇలాంటి పరికరం ఇంట్లో ఉంటే.. ఎంత పనైనా చకచకా అయిపోతుంది. 2100 వాట్స్‌ కలిగిన ఈ ఎలక్ట్రిక్‌ వోక్‌లో బిర్యానీ వంటి పలు రైస్‌ ఐటమ్స్‌తో పాటు.. నూడుల్స్, కర్రీస్, బార్బెక్యూ ఐటమ్స్‌ ఇలా అన్నీ రకాలనూ తయారుచేసుకోవచ్చు. చికెన్, మటన్‌ వంటివి ఇందులో.. చాలా క్రిస్పీగా గ్రిల్‌ అవుతాయి. దీనికి ట్రాన్స్‌పరెంట్‌ మూత కూడా ఉంటుంది. టెంపరేచర్‌ ఎక్కువ అవుతుంటే ఆటోమేటిక్‌గా ఆఫ్‌ అవుతుంది.
-ధర - 392 డాలర్లు  (రూ.29,323) 

చదవండి: పొటాటోతో ఫ్యాటీ బాడీకి చెక్‌ చెప్పొచ్చా? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement