
అర్వపల్లి : లారీపై తరలిస్తున్న స్టీమర్
అర్వపల్లి (తుంగతుర్తి) : ఎప్పుడూ నీటిలో తిరిగే స్టీమర్ రోడ్డుపై కనిపిస్తే ఆశ్చర్యమే కదా.. అయితే సోమవారం అర్వపల్లిలో రోడ్డుపై ఈ దృశ్యం కనిపించింది. గుజరాత్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సముద్ర తీరానికి ఓ స్టీమర్‌ను లారీపై తరలిస్తున్నారు.
సూర్యాపేట–జనగామ 365బీ జాతీయ రహదారిపై ఉన్న అర్వపల్లి మీదుగా ఆ లారీ వెళ్లింది. సముద్రంలో తిరిగే స్టీమర్ రోడ్డుమార్గంలో లారీపై కనిపించడంతో స్థానిక ప్రజలు, రోడ్డుపై వెళ్లే వివిధ వాహనదారులు ఆసక్తిగా తిలకించారు.
Comments
Please login to add a commentAdd a comment