
ప్రమాదంలో నుజ్జనుజ్జు అయిన కారు
సాక్షి, సూర్యాపేట: జిల్లాలోని కోదాడ మండలం కోమరబండలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోమరబండ బైపాస్ వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది.
హైదరాబాద్ నుంచి రావులపాలెం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వారు సత్యనారాయణ(35), మాధురి(21)గా గుర్తించారు. సత్యనారాయణకు రావులపాలెంలో ఉంటున్న వాళ్ల అమ్మకు సీరియస్‌గా ఉందని కబురు వచ్చింది. దీంతో ఆయన ఓలా క్యాబ్ మాట్లాడుకొని హిమయత్‌నగర్ నుంచి తన భార్య సౌజన్య, మరదలు మాధురితో కలిసి రావులపాలెం బయలుదేరారు.
Comments
Please login to add a commentAdd a comment