Eyelashes
-
విల్లులా.. ఒంపులు తిరిగిన కనుబొమ్మలకై ఈ డివైస్..!
విల్లులా.. ఒంపులు తిరిగిన కనుబొమ్మలు, నిండైన కనురెప్పలే కళ్లకు అందం. కనురెప్పలు పెద్దగా అందంగా ఉంటే ముఖం కళగా కనిపిస్తుంది. అందుకే చాలామంది కనురెప్పలకు త్రీడీ ఐలాష్లను అతికించుకుంటారు. అయితే చిత్రంలోని ఈ ఎలక్ట్రిక్ డివైస్ ఇంట్లో ఉంటే, ప్రత్యేకంగా ఐలాష్‌లు కొని అతికించుకోవాల్సిన అవసరం లేదు. దీంతో సహజంగా ఉన్న కనురెప్పలనే మరింత అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.ఈ ఎలక్ట్రిక్ ఐలాష్ కర్లర్ మెషిన్ చార్జింగ్‌తో నడుస్తుంది. దీన్ని ముందే ఆన్ చేసి, హీట్ చేయాలి. అనంతరం కనురెప్పలకు అమర్చి ఉంచితే, అదే ఆ వెంట్రుకలను స్టైటెనింగ్ చేసి, కర్లింగ్ చేస్తుంది. దీంతో కనురెప్పలపై వెంట్రుకలు ఒంపులు తిరిగి పొడవుగా, అందంగా కనిపిస్తాయి. ఈ మెషిన్‌ను 10 సెకన్లలో ప్రీ హీట్ చేసుకోవచ్చు. దీనిలో రెండు రకాల మోడ్స్ ఉంటాయి. సెన్సింగ్ సిలికాన్ ప్యాడ్‌తో రూపొందిన ఈ డివైస్ చర్మానికి, కళ్లకు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. వేడి ఎక్కువ కావడం, చర్మం కాలడంలాంటి సమస్యలు ఉండవు.దీనిలోని ఒక మోడ్ 65 డిగ్రీల ఫారెన్ హీట్ నుంచి 149 డిగ్రీల ఫారెన్ హీట్ వరకూ గ్రీన్ కలర్ లైట్‌ను చూపిస్తూ పని చేస్తుంది. అలాగే మరో మోడ్ 85 డిగ్రీల ఫారెన్ హీట్ నుంచి 185 డిగ్రీల ఫారెన్ హీట్‌తో బ్లూ కలర్ లైట్‌ను చూపిస్తూ పని చేస్తుంది. ఈ సెకండ్ మోడ్ ఆప్షన్ బిరుసైన వెంట్రుకలకు అనుకూలంగా ఉంటుంది. మోడ్‌లను మార్చడానికి డివైస్ పైభాగంలో సింగిల్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇనొవేటివ్ హీటింగ్ ఫంక్షన్ తో కూడిన ఈ ఎర్గోనామిక్ డిజైన్.. వినియోగానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే ఇది పోర్టబుల్, కాంపాక్ట్ కూడా. ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్లవచ్చు. ఇది మీ బ్యూటీ కిట్, కాస్మెటిక్ బాక్స్ లేదా ట్రావెల్ కేస్‌లో సులభంగా అమరిపోతుంది. ఈ డివైస్‌తో కనురెప్పలను కర్ల్ చేసుకుని, అనంతరం మస్కారా, ఐలైనర్ వంటివి వేసుకుంటే సరిపోతుంది.ఇవి చదవండి: Health: ఎటువంటి మందులు వాడకుండానే ఇలా జరిగింది.. అసలు కారణాలేంటి? -
'మైండ్ బ్లోయింగ్ ఆర్ట్'! ఏకంగా సూది రంధ్రంలోని బబుల్‌పై కళాఖండం!
ఎన్నో ఆర్ట్‌లు చూసి ఉంటాం. ఇలాంటి నెవ్వర్ బీఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఆర్ట్‌ని చూసి ఉండటం అసాధ్యం. ఎందుకంటే..? ఇంతలా సూక్షంగా వేయడం ఒక ఎత్తైతే..పైగా బబుల్ పగిలిపోకుండా సూక్ష్మాతి సూక్ష్మంగా వేయడం అనితర సాధ్యం. సుసాధ్యమైన దాన్ని సాధ్యం చేసి చూపించాడు ఓ అసాధారణ వ్యక్తి. ఇతనేం అందరిలాంటి వ్యక్తి కాదు కూడా. ఎందుకంటే? ఇతను చిన్నతనంలో ఆటిజంతో బాధపడిన వ్యక్తి. తస ఆర్ట్‌తో అందర్నీ విస్మయపరచడమే కాదు శభాష్ అని ప్రసంశలు అందుకున్నాడు. ఆ వ్యక్తి ఆర్ట్ జర్నీ ఎలా సాగింది? అనితర సాధ్యమైన ఆర్ట్ ఎందుకు వేశాడో అతని మాటాల్లో తెలుసుకుందామా! విల్లార్డ్ విగాన్ ఇంగ్లాండ్‌లోని వెడ్నెస్ఫీల్డ్లోని అష్మోర్ పార్క్ ఎస్టేట్‌కు చెందిన బ్రిటిష్ శిల్పి. అతడు సూక్ష్మ శిల్పాలను రూపొందిస్తాడు. చాలామంది ఇలాంటి సూక్ష్మాతి సూక్ష్మ శిల్పలు రూపొందిస్తారు కానీ అతడు కేవడం సూదీ తల భాగంలో లేదా రంధ్రంలో వేస్తాడు. ఈసారి సూదీ రంధ్రంలో ఓ బబుల్‌పై ముగ్గురు వ్యక్తులు ఒంటెలపై ప్రయాణిస్తున్నట్లు వేశాడు. బబుల్ పగలకుంటా అత్యంత జాగ్రత్తగా వేయాలి. అందుకోసం అతడు రోజూకు 16 గంటలకు పైగా శ్రమను ఓర్చీ మరీ ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దాడు. దీన్ని వేసేందుకు కంటి రెప్ప వెంట్రుకలతో తయారు చేసిన పెయింట్ బ్రెష్‌ని వినియోగించడం విశేషం. నిజం చెప్పాలంటే ప్రతి నిమిషం ఉత్కంఠంగా ఊపిరి బిగబెట్టి గుండె లయలను వింటూ వేయాల్సింది. ఎందుకంట? ఆ ఆర్ట్ వేస్తున్నప్పుడూ ఏ క్షణమైన బబుల్ పగిలిందే మొత్తం నాశనమైపోతుంది. పడిన శ్రమ వృధా అయిపోతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఆర్ట్ అనితరసాధ్యమైన ఫీట్ అనే చెప్పాలి. ఆ ఆర్ట్‌లో ఒంటెలను నైలాన్‌తో రూపొందించగా, వాటిపై రాజుల్లా ఉన్న వ్యక్తుల కిరిటీలను 24 క్యారెట్ల బంగారంతో మెరిసేట్లు రూపొందించాడు. సూదీ రంధ్రంలో బుడగ పగిలిపోకుండా ఆధ్యంతం అత్యంత ఓపికతో శ్రమతో వేశాడు. చూసిన వాళ్లు సైతం ఇది సాధ్యమాఝ అని నోరెళ్లబెట్టేలా వేశాడు విల్లార్డ్ విగాన్. ఈ అసాధారణ కళా నైపుణ్యానికి గాను విల్లార్డ్ని 2007లో ఆర్డర్ ఆఫ్ బ్రిటీష్ ఎంపైర్ సభ్యుడిగా నియమించింది ఇంగ్లాండ్ ప్రభుత్వం. విల్లార్డ్ సుమారు 5 ఏళ్ల ప్రాయంలోనే చీమలకు ఇళ్లను కట్టే మైక్రో శిల్పాన్ని వేసి ఆశ్చర్యపరిచాడు. ఈ ఆర్ట్ వైపుకి ఎలా వచ్చాడంటే.. విల్లార్డ్ ఆటిజం కారణంగా చిన్నతనంలో అన్నింటిలోనూ వెనుకబడి ఉండేవాడు. దీంతో స్నేహితులు, టీచర్లు పదేపదే ఎగతాళి చేసేవారు. ఈ అవమానాల కారణంగా అతడి చదువు సరిగా కొనసాగలేదు. ఈ వ్యాధితో బాధపడే చిన్నారులు చదవడం, రాయడంలో చాలా వెనబడి ఉంటారు. ఈ రకమైన పిల్లలకు బోధించడం టీచర్లకు కూడా ఓ పరీక్ష లేదా సవాలుగానే ఉంటుంది. ఇక్కడ విల్లార్డ్ ఈ అవమానాలకు చెక్‌పెట్టేలా ఏదో ఒక టాలెంట్‌తో తానెంటో చూపించాలి. తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని బలంగా అనుకునేవాడు. ఆ జిజ్ఞాశే విల్లార్డ్ని మైక్రో ఆర్ట్ వైపుకి నడిపించింది. చిన్న వయసు నుంచే ఈ మైక్రో ఆర్ట్‌లు వేసి టీచర్లను తోటి విద్యార్థులను ఆశ్చర్యపరిచేవాడు. దీంతో క్రమంగా వారు కూడా అతడిని అవమానించటం, ఎగతాళి చేయటం మానేశారు. ఈ కళ అతడికి మంచి పేరునేగాక అందరీ ముందు విలక్షణమైన వ్యక్తిగా నిలిచేలా చేసింది. మనకు కొన్ని విషయాల్లో రోల్ మోడల్స్ ఉండాలి గానీ నాలాంటి వాళ్లకు రోల్‌మోడల్స్ ఉండరు. అందుకుని వారికీ తాను స్ఫూర్తినిచ్చే వ్యక్తిలా ఉండాలనుకున్నాను. అని చెబుతున్నాడు విల్లార్డ్. మనం నిత్యం ఎన్నో సమస్యలు, బాధలతో సతమతమవుతాం. దాన్ని మనలో దాగున్న ఏదో నైపుణ్యంతో వాటిని పారద్రోలాలి. ఆ స్కిల్ తెయకుండానే.. మీకు ఎదురైన చేదు అనుభవాలను సమస్యలకు చెక్ పెడుతుంది. అందుకు తానే ప్రేరణ అని విల్లార్డ్ చెబుతుంటాడు. అంతేగాదు ప్రపంచానికి సరికొత్త వెలుగునిచ్చేందుకు తాను ఈ కష్టతరమైన మైక్రో ఆర్ట్ వైపుకి వచ్చానంటున్నాడు. ఈ ఆర్ట్ ప్రతి ఒక్కరిలో ఆశ అనే ఒక మ్యాజికల్ కాంతిని, శాంతిని అందజేస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు విల్లార్డ్. దీని అర్థం చిన్న చిన్న సమస్య లేదా పర్వతం లాంటి సమస్య అయినా నువ్వు తల్చుకుంటే సాధ్యమే! అని విల్లార్డ్ తన ఆర్ట్‌తో చెప్పకనే చెబుతున్నాడు కదా!. (చదవండి: కలవరపెడుతున్న 'జాంబీ డీర్ వ్యాధి'! మనుషులకు కూడా వస్తుందా?) -
వాలు కనుల కోసం ఎలక్ట్రిక్ ఐలాష్ కర్లర్.. ఎలా పనిచేస్తుందంటే!
కళైన ముఖానికి.. వాలు కనులు తెచ్చిపెట్టే అందమే వేరు. అందుకే కొంతమంది అమ్మాయిలు.. తమ కనురెప్పలకు మస్కారా అప్లై చేస్తూ.. ఐలాష్ స్టిక్కర్స్ అతికించుకుంటూ తమ కన్నుల సోయగాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి బ్యూటీ లవర్స్ కోసం వచ్చిందే ఈ ఎలక్ట్రిక్ ఐలాష్ కర్లర్! ఇందులో చాలా మోడల్స్.. చాలా ఆప్షన్స్‌తో అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం. 1. ఈ మోడల్ టూల్.. త్రీ టెంపరేచర్ మోడ్స్‌తో పనిచేస్తుంది. మొదటి మోడ్ షార్ట్ ఐలాషెస్‌కి బ్లూ లైట్‌తో లో – టెంపరేచర్ని, రెండవ మోడ్.. స్టాండర్డ్ ఐలాషెస్‌కి ఎల్లో కలర్‌తో మీడియం టెంపరేచర్ని అందించగా.. మూడవ మోడ్ హార్డ్ ఐలాషెస్‌కి రెడ్ కలర్‌తో హై టెంపరేచర్ని అందిస్తుంది. 10 సెకండ్స్లో ఫాస్ట్ హీటింగ్, 40 సెకండ్స్లో రాపిడ్ కర్లింగ్ సెట్ చేస్తుంది. పైగా ఈ ట్రీట్మెంట్ తీసుకున్న 24 గంటల పాటు కనురెప్పలు అలానే బ్యూటీపుల్ లుక్‌తో ఉంటాయి. ఈ టూల్‌కి ఉండే మినీ హీటర్.. డబుల్ లేయర్ కోంబ్‌తో సౌకర్యవంతంగా ఉంటుంది. దీనికి ఒక్కసారి చార్జింగ్ పెడితే చాలా కాలం నడుస్తుంది. 2. ఈ టూల్ కూడా మల్టీ ఫంక్షనల్ డివైజే. ఒకే ఒక్క నిమిషంలో త్రీ టెంపరేచర్ సెట్టింగ్స్‌తో పనిచేస్తుంది. దీనికి సుమారు 2 గంటలు చార్జింగ్ పెడితే... కొన్ని రోజుల పాటు చక్కగా పనిచేస్తుంది. ఈ టూల్ అచ్చం హెయిర్ కర్లర్లా.. మినీ హీటర్ విచ్చుకుని.. రెండు భాగాలుగా విడిపోయి.. కనురెప్పలను అందంగా మెలి తిప్పుతుంది. అందుకు ఈ టూల్ ముందున్న చిన్న బటన్ యూజ్ అవుతుంది. 3.ఈ టూల్.. పైవాటిలానే పని చేస్తుంది. అయితే ఆప్షన్స్, టెంపరేచర్ వంటివి డివైజ్‌కి ఉన్న డిస్ప్లేలో స్పష్టంగా కనిపిస్తాయి. దాంతో వినియోగదారులకు మరింత ఈజీగా ఉంటుంది. భలే ఉన్నాయి కదూ? వీటిని ఒక పెన్ మాదిరి సులభంగా హ్యాండ్ బ్యాగ్‌లోనో లేదా మేకప్ కిట్లోనో వేసుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. మరింకెందుకు ఆలస్యం? క్వాలిటీపై వినియోగదారుల రివ్యూస్‌ని గమనించి.. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేయండి. -
viral video: మేకప్ టిప్స్ చెప్పు.. ఫాలో అవుతా!
పెంపుడు కుక్కల అల్లరి మామూలుగా ఉండదు! మనం చేస్తున్న పనులను అవి పక్కనే ఉండి తీక్షణంగా చూస్తాయి. అంతే కాదు మనం చేసే రోజువారీ పనుల్లో భాగమైపోతాయి. తాజాగా ఓ పెంపుడు శునకం చేసిన పనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ముకుల్ రిచర్డ్స్ అనే ఓ మేకప్ ఆర్టిస్ట్.. మేకప్ టిప్స్‌కు చెబుతూ వీడియోలు చేస్తుంటారు. ఆమె తాజాగా చూడచక్కగా ఐలాష్ ఏలా పెట్టుకోవాలో వివరిస్తూ వీడియో వివరిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఐలాష్ కంటికి ఎలా అతికించుకోవాలో చూపుతుంది. అయితే పక్కనే ఉన్న ఆమె పెంపుడు శునకం.. ఐలాష్ ఎలా పెట్టుకుంటుందో చూపించాలన్నట్లు ఆత్రంగా ప్రవర్తిస్తూ అడ్డు తగులుంది. దీంతో వెంటనే ఆమె ఐలాష్ కంటికి అతికుంచునే ప్రక్రియను తన కుక్క చెబుతుంది. ఆమె చెబుతున్నంతసేపు ఆ శునకం తీక్షణంగా చూడటాన్ని ముకుల్ రిచర్డ్స్ ఎంజాయ్ చేస్తారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఇది చాలా అద్భుతమైన వీడియో’.. ‘మీకు చాలా ఓపిక ఉంది’.. ‘నాకు చూపించూ నేను కూడా మేకప్ టిప్స్ ఫాలో అవుతా.. అని కుక్క అడుగుతోంది’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Mukul Richards (@mukulrichards_makeupartist) -
ఈ చిన్నారి కష్టం తెలిస్తే కడుపు తరుక్కుపోతుంది
ఇంగ్లండ్/ బ్రిస్టల్: కరోనా మహమ్మారి ఏ నిమిషాన ఈ ప్రపంచంలో అడుగుపెట్టిందో తెలియదు కానీ... మనుషులెవరిని ప్రశాంతంగా బతకనీయడం లేదు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఏదో ఒక రకంగా బాధిస్తోంది. ప్రతి ఒక్కరి మీద ప్రభావాన్ని చూపుతోంది. మరీ ముఖ్యంగా కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ చాలా మందిపై ఆర్థిక, మానసిక ప్రభావం చూపింది. పాఠశాలలు మూసివేయడం.. బయటకు వెళ్లే అవకాశం లేకుండా ఇంటికే పరిమితం కావడంతో పిల్లలు కూడా డిప్రెషన్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ ఒత్తిడి భరించలేక ఎనిమిదేళ్ల చిన్నారి చేసుకున్న కొత్త అలవాటు ప్రస్తుతం తన జీవితాన్ని నరకప్రాయం చేసింది. స్నేహితులు, చుట్టుపక్కల వారు గేలి చేస్తూ ఏడిపిస్తున్నారు. ఆ చిన్నారి వ్యధ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆ వివరాలు.. (చదవండి: Stonehenge: ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే!!) ‘ట్రైకోటిల్లోమానియా’ అనే వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అమెలియా ఇంగ్లండ్, బ్రిస్టల్ నగరానికి చెందిన అమెలియా అనే ఎనిమిదేళ్ల చిన్నారి.. మొదటిసారి 2020లో విధించిన లాక్డౌన్ కాలంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యింది. దాన్ని తట్టుకోలేక కనురెప్పలను లాగి పడేయ్యడం ప్రారంభించింది. ఆ అలవాటు అలానే కొనసాగి.. చివరకు తల వెంట్రుకలను కూడా అలానే లాగసాగింది. కొన్ని రోజుల్లోనే బాలిక కనురెప్పలు, తలలో ముందు భాగంలో ఉన్న వెంట్రుకలు పూర్తిగా మాయమయ్యాయి. అమెలియా పరిస్థితి చూసిన ఆమె తల్లి.. స్నేహితులను కలవకుండా ఉండటం, పాఠశాలకు వెళ్లకపోవడం వల్లే.. తన కుమార్తె ఇలా అయ్యిందని భావించింది. ఆస్పత్రికి తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆన్లైన్లో డాక్టర్ని సంప్రదించి కుమార్తె పరిస్థితిని వివరించింది అమెలియా తల్లి. చిన్నారిని పరీక్షించిన వైద్యులు తను ‘ట్రైకోటిల్లోమానియా’ అనే వ్యాధితో బాధపడుతుందని వెల్లడించారు. ‘ట్రైకోటిల్లోమానియా’ అనే వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అమెలియా (చదవండి: వైరల్: బుజ్జగించడానికి మీ పిల్లలకు ఇవి ఇస్తున్నారా..) కొద్ది కాలం తర్వాత లాక్డౌన్ ఎత్తేశారు.. పాఠశాలలు తెరిచారు. కానీ అమెలియా మాత్రం తన అలవాటును మానుకోలేకపోయింది. వైద్యుల ప్రకారం జనాభాలో ప్రతి 50 మందిలో ఒకరు ట్రైకోటిల్లోమానియాతో బాధపడుతుంటారు. దీనికి ప్రధాన కారణం ఒత్తిడి, ఆందోళన, ఏదైన బాధ. ప్రస్తుతం అమెలియా తల మీద.. అది కూడా వెనకభాగంలో మాత్రమే కొన్ని వెంట్రుకలు మిగిలి ఉన్నాయి. విగ్గు, స్కార్ఫ్ లేకుండా అమెలియా బయటకు వెళ్లడం లేదని ఆమె తల్లి తెలిపింది. ఈ వ్యాధి కారణంగా తన కుమార్తె ఎన్నో అవమానాలు ఎదుర్కొందని.. తోటి పిల్లలు తనను ఏడిపించారని.. ఫలితంగా అమెలియా మరింత డిప్రెషన్‌కు గురైందని తెలిపింది. (చదవండి: అయ్యో! వారి బతుకులు కరిగిపోతున్నాయ్) ‘ట్రైకోటిల్లోమానియా’ అనే వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అమెలియా అమెలియా తల్లి మాట్లాడుతూ.. ‘‘తను ప్రారంభంలో కనురెప్పలను లాగుతున్నప్పుడు నేను దాని గురించి పెద్దగా ఆందోళన చెందలేదు. కానీ తన కనురెప్పలు పూర్తిగా పోయాయో అప్పుడు నాకు భయం వేసింది. ఈ అలవాటును మాన్పించాలని ప్రయత్నించాను కానీ సాధ్యం కాలేదు. అలా పెరుగుతూనే ఉంది. చివరకు తల వెంట్రుకలను లాగడం ప్రారంభించింది. ప్రస్తుతం తన తల వెనకభాగంలో మాత్రమే వెంట్రుకలు ఉన్నాయి. ముందు భాగం అంతా గుండయ్యింది’’ అని వాపోయింది. తన కూతురు పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్న అమెలియా తల్లి, ఆమెను వారం వారం స్కూల్ థెరపిస్ట్, ప్రైవేట్ హిప్నోథెరపీ సెషన్లకు తీసుకెళ్తుంది. ఇందుకు ఎంతో డబ్బు ఖర్చు అవుతుందని తెలిపింది. అంతేకాక ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రజలు ట్రైకోటిల్లోమానియాతో బాధపడుతున్నారని కానీ ఇప్పటికీ దాని గురించి పెద్దగా అవగాహన లేదని.. పరిస్థితికి చాలా తక్కువ మద్దతు ఉందని వాపోయింది. చదవండి: ఒక్క కరోనా కేసు.. మూడు రోజులు దేశాన్నే మూసేశారు -
పాపకు పదేపదే దద్దుర్లు..!
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాప వయసు ఐదేళ్లు. ఇటీవల మూడు నాలుగు సార్లు ఒంటి మీద దద్దుర్లలా వచ్చాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మందులు ఇచ్చారు. అవి వాడినప్పుడు తగ్గినట్లే తగ్గి మళ్లీ మళ్లీ వస్తున్నాయి. మా పాపకు ఇలా జరగడానికి కారణం ఏమిటి? మా పాప సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - నాగరాణి, గుంటూరు మీ పాపకు ఉన్న సమస్యను అర్టికేరియా అంటారు. ఈ సమస్యలో చర్మం పైభాగం (సూపర్ఫీషియల్ డర్మిస్) ఎర్రబడి కాస్త ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. ఇది శరీరంలోని ఏ భాగంలోనైనా రావచ్చు. ఇది చిన్న ఎర్రటి మచ్చలా మొదలై శరీరమంతటా అనేక చోట్ల కనిపించవచ్చు. ఆర్టికేరియాలో అక్యూట్ అని, క్రానిక్ అని రెండు రకాలు ఉంటాయి. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాపకు అక్యూట్ అర్టికేరియా అని చెప్పవచ్చు. ఆర్టికేరియాకు చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆహారం వల్ల (అంటే... గుడ్డు, గోధుమ, పల్లీలు, సముద్రపు చేపలు, కొందరిలో స్ట్రాబెర్రీస్); మందులు, ఏదైనా పురుగు కుట్టడం (అంటే... తేనెటీగలు లేదా చీమల వంటివి); ఇన్ఫెక్షన్లు (అంటే బ్యాక్టీరియల్ లేదా వైరల్); కాంటాక్ట్ అలర్జీలు (అంటే లేటెక్స్/రబ్బరు, పుప్పొడి వంటివి); గొంగళిపురుగులు, కొన్ని జంతువుల లాలాజలం తగలడం; రక్తం, రక్తానికి సంబంధించిన ఉత్పాదనల వల్ల...అక్యూట్ అర్టికేరియా రావచ్చు. వీటితో పాటు నట్స్‌తో కూడిన ఆహారం, ఆహారంలో వేసే కృత్రిమ రంగులు, పుప్పొడి, కడుపులో నులిపురుగులు, సింథటిక్ దుస్తులు వంటి వాటిని సాధారణ కారణాలుగా గుర్తించారు. ఇక దీర్ఘకాలికంగా కనిపించే క్రానిక్ అర్టికేరియాలో 80 శాతం కేసుల్లో కారణం ఇదీ అని చెప్పడం కష్టం. కాకపోతే కొన్నిసార్లు చాలా వేడి, చల్లటి వాతావరణం వల్ల, థైరాయిడ్, రక్తానికి సంబంధించిన రుగ్మతల వల్ల కూడా దీర్ఘకాలిక (క్రానిక్) అర్టికేరియా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. పైన పేర్కొన్న అంశాలలో ఏది కారణమో గుర్తించి, మీ పాపను ఆ అంశాల నుంచి దూరంగా ఉంచడం చాలా ముఖ్యం. ఇక మందుల విషయానికి వస్తే యాంటీహిస్టమైన్స్, హెచ్2 బ్లాకర్స్ వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. లక్షణాలు తీవ్రంగా కనిపించే వారిలో ఇమ్యూనో మాడ్యులేషన్ మెడిసిన్స్ కూడా వాడవచ్చు. పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటూ మీ పాపకు యాంటీహిస్టమైన్స్‌లో హైడ్రాక్సిజీన్, సిట్రజీన్ వంటి మందులు వాడాల్సి ఉంటుంది. ఈ సమస్య పదే పదే తిరగబెడుతూ, తీవ్రంగా కనిపిస్తుంటే కొన్ని ఇమ్యూనలాజికల్ పరీక్షలు కూడా చేయించాలి. కాబట్టి తీవ్రతను బట్టి మీరు ఒకసారి మీ చర్మవ్యాధి నిపుణుణ్ణి లేదా మీ పీడియాట్రీషియన్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ హోమియో కౌన్సెలింగ్ మా అమ్మాయి వయసు 25 ఏళ్లు. ఈమధ్య తలలో ఒకేచోట వెంట్రుకలు రాలిపోతున్నాయి. అందరూ పేనుకొరుకుడు అంటున్నారు. హోమియోలో దీనికి పరిష్కారం ఉందా? - శంకుతల, మిర్యాలగూడ మామూలుగా అందరూ పేనుకొరుకుడు అని వ్యవహరించే ఈ సమస్యను వైద్య పరిభాషలో అలోపేషియా అంటారు. ఈ సమస్య ఉన్నవారిలో నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా ఊడిపోయి నున్నగా అవుతుంది. శరీరం తనను తాను రక్షించుకోగలిగే శక్తి కోల్పోయినప్పుడు తలపై ఉండే జుట్టు రాలిపోతుంటుంది. వెంట్రుకలకు వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారై నిర్ణీత ప్రదేశంలో వెంట్రుకలు లేకుండా చేస్తుంది. కాబట్టి దీన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌గా చెప్పవచ్చు. ఆడ, మగ అనే తేడా లేకుండా వయసుతో నిమిత్తం లేకుండా ఈ సమస్య కనిపిస్తుంటుంది. ముఖ్యంగా 20 ఏళ్ల వయసు ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇది తలలోగానీ, గడ్డంలోగానీ, మీసాలలోగానీ... ఇలా ఎక్కడైనా కనిపించవచ్చు. ఇది అంటువ్యాధి కాదు. సాధారణంగా అలోపేషియా తలపై ఒకటి రెండు గుండ్రటి మచ్చలు ఏర్పడతాయి. కారణాలు : మానసిక ఆందోళన థైరాయిడ్, డయాబెటిస్ బీపీ వంటి సమస్యలు ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది వంశపారంపర్యం కవలల్లో ఒకరికి ఉంటే మరొకరికి వచ్చే అవకాశం ఎక్కువ. లక్షణాలు : తలపై ఎక్కువ మొత్తంలో జుట్టు ఊడిపోతుంది తలపై అక్కడక్కడ గుండ్రంగా జుట్టు ఊడిపోతూ బట్టతల ఏర్పడుతుంది. తలలో అక్కడక్కడా అతుకుల్లాగా మచ్చల్లాగా ఏర్పడతాయి సాధారణంగా మచ్చలా ఉండే జుట్టు ఊడిపోయే ప్రదేశాలు గుండ్రగా లేదా అండాకృతితో ఉంటాయి. హోమియో చికిత్స: పేనుకొరుకుడుకు హోమియోపతిలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. సమస్య లక్షణాలను, కారణాలను పరిగణనలోకి తీసుకొని మంచి మందులను వైద్యులు సూచిస్తారు. దీనికి యాసిడ్ ఫ్లోర్, సల్ఫర్, నేట్రమ్ మ్యూరియాటికమ్, ఫాస్ఫరస్, గ్రాఫైటిస్, సెలినియమ్, సోరినమ్, తూజా మొదలైన మందులను నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ స్కిన్ క్యాన్సర్ కౌన్సెలింగ్ నా వయసు 36 ఏళ్లు. నా వృత్తిరీత్యా రోజూ బైక్‌పై ఎక్కువగా తిరుగుతుంటాను. నా చర్మం నల్లబడటంతో పాటు కొన్నాళ్ల నుంచి నా ఒంటిపై తీవ్రమైన దద్దుర్లు, ఎర్రటి గడ్డల్లా వచ్చాయి. స్కిన్ స్పెషలిస్ట్‌ను సంప్రదించి కొన్ని మందులు వాడినా తగ్గకపోగా మరింత పెరిగాయి. ఈసారి ఆయన కొన్ని పరీక్షలు చేసి ‘చర్మక్యాన్సర్’ ఏమోననే అనుమానాన్ని వ్యక్తం చేశారు. నా ఒంటిమీద ఏర్పడ్డ పుండ్ల నమూనాను బయాప్సీకి పంపించారు. క్యాన్సర్‌కు మందులేదంటారు కదా. నాకు ఏదైనా జరిగితే నా కుటుంబం ఏమైపోతుందోనని ఆందోళనగా ఉంది. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - స్వరూప్, హైదరాబాద్ శరీరంలోని అతి పెద్ద అవయవం చర్మం. ఇది ఎన్నో విధాలుగా మనల్ని కాపాడుతుంది. వాతావరణంలో ఏర్పడే మార్పుల నుంచి రక్షిస్తుంది. అలాగే స్పర్శను తెలియజేస్తుంది. ఇలా మనకు ఎన్నో ప్రయోజనాలను చేకూర్చే మన చర్మాన్ని మనం శ్రద్ధగా చూసుకోము. ప్రకృతి మన శరీరానికి ‘మెలనిన్’ అనే రంగు పదార్థాన్ని ఇచ్చింది. ఇక మీరు మీ వృత్తిరీత్యా ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటారని తెలిపారు. ఈసారి ఎప్పుడూ లేనంతగా ఎండలు చాలా తీవ్రంగా ఉండటంతో పాటు మీరు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల తీవ్రమైన, ప్రమాదకరమైన సూర్యుడి ‘అల్ట్రా వయొలెట్ రేడియేషన్’ బారిన పడి ఉంటారని అనిపిస్తోంది. దానివల్లనే మీ శరీరంపై ఇలాంటి మార్పులు చోటు చేసుకుని ఉంటాయి. చర్మంపై ఏర్పడిన దద్దుర్లు, గడ్డలు, వాటి సైజు, రంగు, రక్తం కావడం లాంటి లక్షణాలను బట్టి పరీక్షలు ఉంటాయి. ఒకవేళ మీకు బయాప్సీలో చర్మం సంబంధిత క్యాన్సర్ ఉన్నట్లు తెలిసినా అధైర్యపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీ సమస్య కాస్త తీవ్రమైనదే అయినా ఇప్పుడు అందుబాటులో ఉన్న అధునాతన వైద్య ప్రక్రియలతో, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మీకు మంచి చికిత్సను అందించవచ్చు. సర్జరీ ద్వారా మీ చర్మంపై ఏర్పడిన దద్దుర్లు గడ్డలను సమూలంగా తీసివేయవచ్చు. ఒకవేళ అవి చాలా పెద్దగా ఉండి, చికిత్స సమయంలో మీ చర్మం కమిలిపోవడమో, ఊడిపోవడమో జరిగితే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా కూడా ఆ భాగాన్ని మునుపటిలా సరిచేయవచ్చు. ఇదే సమస్య మీకు భవిష్యత్తులో ఎదురుకాకుండా పుండ్లు, గడ్డలు ఏర్పడ్డ స్పాట్లోనే కాకుండా చుట్టుపక్కల కూడా అలాంటి కణజాలాల (టిష్యూస్)ను పూర్తిగా తీసివేయడం జరుగుతుంది. ఓజోన్ పొర దెబ్బతినడం వల్ల సూర్యకాంతిలోని అల్ట్రా వయొలెట్ కిరణాల తీక్షణత వల్ల ఈమధ్య తీవ్రమైన చర్మవ్యాధులు, క్యాన్సర్లు చాలా ఎక్కువగా వస్తున్నాయి. మీలా ఎక్కువగా ఎండలో తిరిగేవారు తలపై హెల్మెట్‌గానీ, టోపీగాని ధరించాలి. ఫుల్‌షర్ట్ వేసుకోవాలి. ముఖానికి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. వీలైనంత వరకు తీక్షణమైన సూర్యకాంతికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ సచిన్ సుభాష్ మర్దా సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్