Mukul Richards Teaching Her Pet Doggo Tricks of Putting on Eyelashes Video Viral - Sakshi
Sakshi News home page

viral video: మేకప్‌ టిప్స్‌ చెప్పు.. ఫాలో అవుతా!

Published Wed, Dec 1 2021 3:27 PM | Last Updated on Wed, Dec 1 2021 3:46 PM

Mukul Richards Teaching Her Pet Doggo Tricks of Putting on Eyelashes Video  Viral - Sakshi

పెంపుడు కుక్కల అల్లరి మామూలుగా ఉండదు! మనం చేస్తున్న పనులను అవి పక్కనే ఉండి తీక్షణంగా చూస్తాయి. అంతే కాదు మనం చేసే రోజువారీ పనుల్లో భాగమైపోతాయి. తాజాగా ఓ పెంపుడు శునకం చేసిన పనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ముకుల్ రిచర్డ్స్ అనే ఓ మేకప్‌ ఆర్టిస్ట్.. మేకప్‌ టిప్స్‌కు చెబుతూ వీడియోలు చేస్తుంటారు. ఆమె తాజాగా చూడచక్కగా ఐలాష్ ఏలా పెట్టుకోవాలో వివరిస్తూ వీడియో వివరిస్తూ ఉంటారు.

అందులో భాగంగా ఐలాష్‌  కంటికి ఎలా అతికించుకోవాలో చూపుతుంది. అయితే పక్కనే ఉన్న ఆమె పెంపుడు శునకం.. ఐలాష్‌ ఎలా పెట్టుకుంటుందో చూపించాలన్నట్లు ఆత్రంగా ప్రవర్తిస్తూ అడ్డు తగులుంది. దీంతో వెంటనే ఆమె ఐలాష్‌ కంటికి అతికుంచునే ప్రక్రియను తన కుక్క చెబుతుంది. ఆమె చెబుతున్నంతసేపు ఆ శునకం తీక్షణంగా చూడటాన్ని ముకుల్ రిచర్డ్స్ ఎంజాయ్‌ చేస్తారు.

అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఇది చాలా అద్భుతమైన వీడియో’.. ‘మీకు చాలా ఓపిక ఉంది’.. ‘నాకు చూపించూ నేను కూడా మేకప్‌ టిప్స్‌ ఫాలో అవుతా.. అని కుక్క అడుగుతోంది’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement