నాణ్యతపై మూడో కన్ను
Published Fri, Aug 5 2016 12:35 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
థర్డ్‌పార్టీకి చేరిన కోల్ క్వాలిటీ టెస్టింగ్
ౖయెటింక్లయిన్‌కాలనీ(కరీంనగర్) : సింగరేణి సంస్థ బొగ్గు నాణ్యత విషయంలో మరింత కఠిన పరీక్షలకు నిలబడాల్సి సమయం ఆసన్నమైంది. వినియోగదారులకు క్వాలిటీ బొగ్గు అందిస్తూ వారి మరింత దగ్గరకావడానికి యాజమాన్యం చర్యలు చేపట్టింది. సింగరేణి నుంచి ఎన్టీపీసీకి అందజేసే బొగ్గు నాణ్యతను పరీక్షించే పనిని మూడో సంస్థకు అప్పగించారు. గతంలో అమ్మకం దారుడు, కొనుగోదారు మధ్య నాణ్యత పరీక్షలు కొనసాగేవి. నెల రోజుల నుంచి సిమ్‌ఫర్(సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ ఫ్యూయల్ రిసెర్చ్) సంస్థ ఈ బాధ్యతను చేపట్టింది.
క్వాలిటీ పరీక్షలు ఇలా..
ప్రతీ 45 నిమిషాలకు ఒకసారి సీహెచ్‌పీ (కోల్‌హ్యాం డ్లింగ్ ప్లాంట్) కన్వేయర్‌పై వెళ్తున్న బొగ్గు పెళ్లల నుంచి కొన్ని తీసి ఒకచోట చేర్చుతారు. ఇలా రోజంతా తీసిన బొగ్గును ప్రత్యేక యంత్రాలతో డస్ట్‌గా చేసి అరకిలో చొప్పున ప్యాకింగ్ చేస్తారు. సీల్ వేసిన అనంతరం నాగ్‌పూర్‌లోని టెస్టింగ్ ల్యాబ్‌కు పంపిస్తారు. ఇందులో నుంచే సింగరేణి, ఎన్టీపీసీ సంస్తలకు ఒక్కో శాంపిల్ అందజేస్తారు. ఏదైనా క్వాలిటీ విషయంలో వివాదం తలెత్తితే తిరిగి పరిశీలించేందుకు మరో శాంపిల్ నిల్వ ఉంచుతారు.
ఇద్దరి నుంచి మూడో వ్యక్తికి..
గతంలో బొగ్గు నాణ్యత పరీక్షలు ఎన్టీపీసీ, సింగరేణి యాజమాన్యాల మధ్య కొనసాగేవి. ఏమైనా తేడాలుంటే ఇరువర్గాలు పరిశీలించుకునేవి. ఈ విధాన ఒప్పందం 1997–98లో జరిగింది. అయితే కోలిండియాలో ఎన్టీపీసీకి బొగ్గు సంస్థల మధ్య నాణ్యత విషయమై వివాదం ఏర్పడింది. దీన్ని పరిష్కరించేందుకు ఎన్టీపీసీ కేంద్రప్రభుత్వాన్ని ఆశ్రయించిచడంతో థర్డ్‌పార్టీ షాప్లింగ్‌పై అన్ని బొగ్గు సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలో ధన్‌బాద్‌కు చెందిన సిమ్‌ఫర్ సంస్థ సింగరేణి బొగ్గు నాణ్యత పరీక్షలు చేసేలా ఒప్పందం జరిగింది.
నాణ్యత విస్మరిస్తే నమ్మకాన్ని కోల్పోతాం
– డైరెక్టర్(పీఅండ్‌పీ) మనోహర్‌రావు
వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొనేందుకు బొగ్గు నాణ్యత విషయంలో రాజీ లేకుండా పనిచేయాలి. ప్రస్తుత పోటీ మార్కెట్‌లో నాణ్యత ఉంటేనే సంస్థకు భవిష్యత్ ఉంటుంది. «థర్డ్‌పార్టీ చేతుల్లోకి వెళ్లిన్న క్రమంలో నాణ్యతపై మరింత లోతుగా ముందుకు సాగాలి. ఇప్పటివరకు వినియోగదారుల వద్ద ఏలాంటి తేడాలు లేకుండా వ్యవహరిస్తున్నాం. మనం ఇచ్చే క్వాలిటీ ప్రకారమే డబ్బులు వస్తాయి. బజారులో తక్కువ ధరకే నాణ్యమైన బొగ్గు లభిస్తోంది. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండి బొగ్గు కొనుగోలు దారులను కాపాడుకోవాలి.
Advertisement
Advertisement