third
-
ప్రపంచ నగరిగా అయోధ్య
సాక్షి, హైదరాబాద్: అయోధ్య.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు మారుమోగుతోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా రూపొందిన భవ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్టకు ఆ ఆధ్యాత్మిక నగరి ముస్తాబైంది. సోమవారం జరిగే ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని పలు దేశాల్లో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు కూడా. ప్రపంచవ్యాప్తంగా పేరున్న చారిత్రక కూడళ్లలో భారీ తెరలు ఏర్పాటు చేసి మరీ ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. ఈ ఘనత ఇక్కడికే పరిమితం కాకుండా.. అయోధ్యను ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, యూపీ రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ప్రాజెక్టులు చేపడుతున్నాయి. రూ.85 వేల కోట్లతో అభివృద్ధి పనులు కొత్త రామాలయ నిర్మాణ ప్రారంభానికి ముందు అయోధ్యకు నిత్యం సగటున 2వేల మంది భక్తులు వచ్చేవారు. పనులు ప్రారంభమయ్యాక ఆ సంఖ్య 50 వేలకు చేరింది. జనవరి ఒకటిన 2 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఆలయంలో దర్శనాలు మొదలయ్యాక నిత్యం లక్ష మంది వరకు వస్తారని.. క్రమంగా 3 లక్షల వరకు పెరగవచ్చని అంచనా. ఇప్పుడు ఇరుకుగా ఉన్న అయోధ్య అంత తాకిడిని తట్టుకోలేదని తేల్చిన ప్రభుత్వ యంత్రాంగం.. 2031 లక్ష్యంగా ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసింది. ఆర్కిటెక్ట్, అర్బన్ ప్లానర్ దీక్షు కుక్రేజా ఆధ్వర్యంలో దీనిపై విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేశారు. ప్రపంచస్థాయి నగరంగా అయోధ్యను రూపొందించటమే తమ లక్ష్యమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు కూడా. నగరాన్ని భారీగా విస్తరించి.. కొత్త మాస్టర్ ప్లాన్‌లో అయోధ్య పట్టణం, దానికి జంటగా ఉన్న ఫైజాబాద్‌తోపాటు సమీపంలోని దాదాపు 26 గ్రామాలను చేర్చి.. 875 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆధునిక అయోధ్యను తీర్చిదిద్దబోతున్నారు. ఇందులో భాగంగా 1,200 ఎకరాల్లో రూ.2,200 కోట్ల వ్యయంతో న్యూఅయోధ్య పేరుతో భారీ టౌన్షిప్ పనులను ఇప్పటికే మొదలుపెట్టారు. ఇది సరయూ నది కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. అందులో ఇటీవల హోటల్ కోసం ఓ ప్లాట్‌ను వేలం వేయగా చదరపు మీటరుకు రూ.1,09,000 చొప్పున ధర పలకడం గమనార్హం. ఇలాంటి మరికొన్ని టౌన్‌షిప్‌లకూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ► అయోధ్య పాత పట్టణంలో ఇప్పటికే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు పనులు ప్రారంభించారు. ప్రధాన రోడ్లను వెడల్పు చేస్తున్నారు. రామాలయానికి దారితీసే మూడు ప్రధాన మార్గాలను ఇప్పటికే విస్తరించారు. రూ.33 కోట్లతో ఓ మల్టీలెవల్ పార్కింగ్‌ను అందుబాటులోకి తెచ్చారు. ► పట్టణంలో డీజిల్ ఆటోలకు బదులు 250 ఎలక్ట్రిక్ ఆటోలు తిప్పుతున్నారు. విమానాశ్రయం నుంచి పట్టణానికి, ఆలయం వద్దకు తిప్పేందుకు 250 ఎలక్ట్రిక్ బస్సులను సిద్ధం చేశారు. వాటి సంఖ్యను 500కు పెంచబోతున్నారు. ► అయోధ్య పట్టణం నుంచి వెలువడే మురికినీరు సరయూ నదిలోకి చేరుతోంది. దాన్ని పూర్తిగా నిరోధించి, మురికి నీటి శుద్ధికోసం ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీల)ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఒక ఎస్టీపీ అందుబాటులోకి రాగా.. మరో రెండింటి పనులు జరుగుతున్నాయి. సోలార్ సిటీగా అయోధ్య అయోధ్యలో సౌర విద్యుత్ వి్రస్తృత వినియోగం కోసం ఐదేళ్ల కాలపరిమితితో ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టారు. ఇళ్లు, వ్యాపార సముదాయాలు, పరిశ్రమల రూఫ్ టాప్‌పై సౌర ఫలకాలను అమరుస్తున్నారు. వీటితో 8.5 మెగావాట్ల విద్యుత్ సమకూరనుంది. ఇక సరయూ నది తీరంలో 40మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను ఎనీ్టపీసీ ఏర్పాటు చేస్తోంది. ఇందులో 10 మెగావాట్ల ప్లాంటు ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ► అయోధ్య శివార్లలో సరయూ తీరం వెంట 12.90 కిలోమీటర్ల పొడవునా జాతీయ రహదారిపై సోలార్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇంత నిడివిలో సోలార్ లైట్లు ఉండటం రికార్డు అని, దీనికి గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కనుందని యూపీ ప్రభుత్వ యంత్రాంగం ప్రకటించింది. ► సౌర ఫలకాలతో కూడిన ‘సోలార్ ట్రీ’లను నగరవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. 1 కేవీ సామర్థ్యం ఉన్నవి 40.. 2.5 కేవీ సామర్థ్యం ఉన్నవి 18 సిద్ధమవుతున్నాయి. తాగునీటి కియోస్‌్కలు, మొబైల్‌ఫోన్ చార్జింగ్ పాయింట్లు ఈ విద్యుత్‌తోనే పనిచేయనున్నాయి. ► సరయూ నదిలో సౌర విద్యుత్‌తో పనిచేసే పవర్ బోట్లను అందుబాటులోకి తెస్తున్నారు. ప్లాస్టిక్ నుంచి ఇంధనం అయోధ్యలో ప్లాస్టిక్ వ్యర్ధాలను వాహనాల ఇంధనంగా మార్చే రీసైక్లింగ్ యూనిట్ త్వరలో అందుబాటులోకి రానుంది. అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్‌తో కుదిరిన ఒప్పందం మేరకు బెంగుళూరుకు చెందిన సంస్థ దీన్ని ఏర్పాటు చేస్తోంది. ఇది ఏటా 7,300 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను ఇంధనంగా మార్చగలదు. ఉత్తర భారతంలో ఈ తరహా అతిపెద్ద ప్లాంటు ఇదే కానుంది. విస్తృతంగా వసతి సౌకర్యాలు అయోధ్యకు భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నందున హోటల్ పరిశ్రమ కూడా విస్తృతమవుతోంది. దేశవ్యాప్తంగా ఫైవ్‌స్టార్ హోటళ్లను నిర్వహిస్తున్న ఓ పెద్ద సంస్థ 120 గదులతో ఒకటి, 100 గదులతో మరోటి చొప్పున రెండు స్టార్ హోటళ్ల నిర్మాణ పనులు ప్రారంభించింది. చిన్న, మధ్యస్థాయి హోటళ్లు, భోజన వసతి ఇళ్లను నిర్వహించే మరో కంపెనీ.. వెయ్యి గదులతో కూడిన 50 హోటళ్లను, భోజన నివాసాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరికొన్ని సంస్థలు 1,100 గదులతో కూడిన హోటళ్లను నిర్మించనున్నాయి. దేశవ్యాప్తంగా ఆకాశహరŠామ్యలు నిర్మిస్తున్న బడా సంస్థ 51 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,500 కోట్లతో లగ్జరీ విల్లాలు, సాధారణ ఇళ్లు, హోటళ్లను నిర్మించేందుకు ఒప్పందాలు చేసుకుంది. -
కళ్లకు గంతలు కట్టుకుని మరీ రంగోలీ ముగ్గు!
అయోధ్యలో భవ్య రామమందిరం జనవరి 22న ప్రారంభవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ దైన శైలిలో తమ భక్తి భావాన్ని చాటుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో పంథాలో అసాధ్యకరమైన పనులతో తమ భక్తి శక్తిని చాటుతూ విస్తుపోయేలే చేస్తున్నారు. ఆ బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఇంకొద్ది రోజుల్లో జరగనుండగా ఒక వైపు నుంచి అయోధ్యకు ఎంతో విలువైన కానుకలు వస్తున్నాయి. దీంతోపాటు రామ అన్న పేరుకి శక్తి ఏంటో తెలిసేలా ఒక్కో విశేషం రోజుకొకటి చొప్పున వెలుగులోకి వస్తోంది. ఇలాంటి వింతలు, విచిత్రాలు చేస్తుంటే ఆ లీలా స్వరూపుడే ఇలా తన భక్తులచే అసాధ్యమైన వాటిని చేయించుకుంటున్నాడా అన్నంత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అలాంటి అనితర సాధ్యకరమైన ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. అదేంటో వింటే మాత్రం ఆశ్చర్యపోవడం ఖాయం. బీహార్‌లోని దర్భంగాకు చెందిన మోనికా గుప్తా అనే అమ్మాయి కళ్లకు గంతలు కట్టుకుని మరీ రంగోలీ వేసింది. అదికూడా రామ మందిరాన్ని ముగ్గు రూపంలో వేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. రామ భక్తితో ఎంతటి అసాధ్యమైన కార్యాన్ని అయినా సాధించొచ్చు అని నిరూపించింది మోనికా. ఆమె కళ్లకు గంతలు కట్టుకుని ఏ మాత్రం తడబడకుండా చాలా చాకచక్యంగా పెట్టింది. మాములుగా గీసినా.. ఎన్నో సార్లు చెరిపి.. చెరిపి..గీస్తాం అలాంటిది. చూడకుండా ముగ్గు వేయడం అంటే మాటలు కాదు. కానీ జనవరి 22న అయెధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ఆమె బిహార్ నుంచి అయోధ్యకు వచ్చి మరీ ఇలా అసాధ్యకరమైన రీతీలో ముగ్గు వేయడం విశేషం. ఈ మేరకు మౌనిక మాట్లాడుతూ.. తాను ఎంఎస్సీ చదువుతున్నట్లు పేర్కొంది. తనకున్న ధ్యానం చేసే అలవాటు కారణంగానే ఇంతలా సునాయాసంగా చూడకుండా ముగ్గు వేయగలిగానని చెప్పుకొచ్చింది. ఈ ఘనత సాధించగలిగేందుకు కారణం తాను తల్లి వద్ద విన్నా మహాభారత గాథేనని చెబుతోంది. ఆ ఇతిహాసంలో దృతరాష్ట్రుడికి కళ్లకు కనిపించేలా సంజయుడు వివరించిన కౌరవులు పాండవుల యుద్ధ ఘట్టం. అలాగే మత్సయంత్రాన్ని చేధించటంలో అర్జునుడు కనబర్చిన ప్రతిభ పాటవలు తనను ఇలాంటి ఘనత సాధించేందుకు ప్రేరణ ఇచ్చాయని చెప్పుకొచ్చింది. ఇలా కళ్లకు గంతలు కట్టుకుని రంగోలీలు వేయడాన్ని నాలుగేళ్ల ప్రాయం నుంచే ప్రారంభించానని, ఏడేళ్లు వచ్చేటప్పటికీ ధ్యాన సాధనతో దానిపై పూర్తిగా పట్టు సాధించగలిగానని చెప్పింది. ఇలా చూడకుండా మనోనేత్రంతో గీయ గలిగే సామర్థ్యాన్ని సిక్త్స్ సెన్స్ యాక్టివేషన్ లేదా థర్డ్ ఐ యాక్టివేషన్‌గా అభివర్ణించింది మౌనిక. కాగా ఈ రామమందిర ప్రారంభోత్సవానికి ఎంతో మంది ప్రముఖులు, సెలబ్రెటీలు హాజరుకానున్నారు. (చదవండి: శని దోషాలు పోయి, సకల శుభాలు కలగాలంటే ఇలా చేయండి! ) -
పంటనష్టంలో తెలంగాణది మూడోస్థానం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా సుమారు 12 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలోని విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. వరదలు, పిడుగుపాట్లు వంటి కారణాలతో 2,044 మంది మరణించినట్లు తెలిపింది. వరదలతో అత్యధికంగా హరియాణాలో 5,40,975 ఎకరాల్లో పంటనష్టం జరగ్గా, హిమాచల్‌ప్రదేశ్‌లో 1,89,400 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నివేదించింది. అత్యధికంగా పంటనష్టం జరిగిన రాష్ట్రాల్లో తెలంగాణ మూడోస్థానంలో ఉందని, మొత్తం 1,51,970 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొంది. తెలంగాణలో 18 మంది మరణించారని, ఇతరత్రా కారణాలతో మరొకరు మృతి చెందారని నివేదికలో వెల్లడించింది. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు రెండు విపత్తు నిర్వహణ బృందాలను రాష్ట్రంలో సిద్ధంగా ఉంచినట్లు తెలిపింది. ఏపీలో 22,537 ఎకరాల్లో పంట నష్టం ఏపీలోని ఐదు జిల్లాల పరిధిలో భారీవర్షాలు, వరదల ప్రభావం ఉందని, వాటి కారణంగా మొత్తంగా 39 మంది మృతి చెందినట్లు విపత్తు నిర్వహణ విభాగం నివేదించింది. మొత్తం 22,537 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు తెలిపింది. విపత్తు నిర్వహణ కోసం రెండు బృందాలను ఏపీలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. -
పోటెత్తుతున్న గోదావరి.. భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 53 అడుగులు దాటింది. దీంతో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 14లక్షల 50వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి గోదావరి ప్రవహిస్తోంది. రాత్రికి 58 నుంచి 60 అడుగుల వరకు నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ అన్నారు. ఇప్పటివరకు 4,900 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. గోదావరి నీటిమట్టం పెరగడంతో స్నానఘట్టాలు వరదనీటిలో మునిగిపోయాయి. భద్రాచలం నుంచి సమీప మండలాలైన దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం, ముంపు మండలాలైన కోనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక, భద్రాచలం వద్ద ఉగ్రగోదావరిలో వరద ఉధృతి కొనసాగుతున్నది. తగ్గినట్లే తగ్గిన నీటిమట్టం మళ్లీ పెరుగుతున్నది. చదవండి: వానలు మిగిల్చిన విషాదం ముంపునకు గురయ్యే ప్రాంత ప్రజలు జాప్యం చేయక యంత్రాంగానికి సహకరించి పునరావాస కేంద్రాలకు రావాలని కలెక్టర్ సూచించారు. అలాగే వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దు. అత్యవసరమైతే కంట్రోల్ రూమ్‌లకు కాల్ చేయాలి. ఏమైనా ప్రమాదాలు ఏర్పడినప్పుడు వెంటనే అధికారులకు తెలియజేయాలి. జలాశయాల వద్దకు ప్రజలు రావద్దు. వరద నిలిచిన రహదారులల్లో రవాణా నియంత్రణకు ట్రాక్టర్లు అడ్డు పెట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. -
Womens Premier League 2023:ప్లేఆఫ్‌కు యూపీ వారియర్స్
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్లో చివరిదైన మూడో ప్లేఆఫ్ బెర్త్ కూడా ఖరారైంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ దశకు అర్హత పొందగా... ఈ రెండు జట్ల సరసన యూపీ వారియర్స్ చేరింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ మూడు వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. యూపీ గెలుపుతో గుజరాత్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు సాధించింది. హేమలత (33 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), యాష్లే గార్డ్నర్ (39 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీలు చేశారు. యూపీ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్, పార్శవి చోప్రా రెండు వికెట్ల చొప్పున తీశారు. అనంతరం యూపీ వారియర్స్ 19.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 181 పరుగులు సాధించి విజయం సాధించింది. 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన యూపీ వారియర్స్‌ను తాలియా (38 బంతుల్లో 57; 11 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్రేస్ హారిస్ (41 బంతుల్లో 72; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 78 పరుగులు జోడించారు. తాలియా అవుటయ్యాక గ్రేస్ హారిస్ యూపీని విజయం దిశగా నడిపించింది. ఏడు బంతులు మిగిలి ఉండగా హారిస్ పెవిలియన్ చేరగా... సోఫీ ఎకిల్‌స్టోన్ (13 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు) యూపీ విజయాన్ని ఖాయం చేసింది. ముంబై ఇండియన్స్‌కు ఢిల్లీ షాక్ సోమవారం రాత్రి జరిగిన రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టుకు షాక్ ఇచ్చింది. ఈ టోర్నీలో ఆడిన తొలి ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి అందరికంటే ముందుగా ప్లేఆఫ్ బెర్త్ ఖరారు చేసుకున్న ముంబై ఆ తర్వాత ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం గమనార్హం. ముందుగా ముంబై జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 109 పరుగులు చేసింది. పూజ వస్త్రకర్ (19 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్), హర్మన్‌ప్రీత్ కౌర్ (26 బంతుల్లో 23; 3 ఫోర్లు), ఇసీ వాంగ్ (24 బంతుల్లో 23; 1 సిక్స్), అమన్‌జ్యోత్ కౌర్ (16 బంతుల్లో 19; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మరిజాన్ కప్ (2/13), శిఖా పాండే (2/21), జెస్ జొనాసెన్ (2/25) ముంబైని కట్టడి చేశారు. అనంతరం ఢిల్లీ దూకుడుగా ఆడి 9 ఓవర్లలో వికెట్ నష్టపోయి 110 పరుగులు చేసి గెలిచింది. షఫాలీ వర్మ (15 బంతుల్లో 33; 6 ఫోర్లు, 1 సిక్స్) అవుటవ్వగా.. మెగ్ లానింగ్ (22 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), అలైస్ క్యాప్సీ (17 బంతుల్లో 38 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్స్‌లు) ఢిల్లీ విజయాన్ని ఖాయం చేశారు. ‘ఫైనల్ బెర్త్’ రేసులో ముంబై, ఢిల్లీ ప్రస్తుతం ఢిల్లీ, ముంబై 10 పాయింట్లతో సమంగా ఉన్నా... మెరుగైన రన్‌రేట్ ఆధారంగా ఢిల్లీ టాప్ ర్యాంక్‌లో, ముంబై రెండో ర్యాంక్‌లో నిలిచాయి. నేడు జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో బెంగళూరుతో ముంబై (మధ్యాహ్నం గం. 3:30 నుంచి)... యూపీతో ఢిల్లీ (రాత్రి గం. 7:30 నుంచి) ఆడతాయి. ముంబై, ఢిల్లీ జట్లలో భారీ తేడాతో నెగ్గిన జట్టు ‘టాప్’ ర్యాంక్‌తో నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. మూడో స్థానంలో నిలిచిన యూపీ వారియర్స్‌తో రెండో స్థానంలో నిలిచిన జట్టు ఫైనల్ బెర్త్ కోసం ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది. -
ఏపీ: థర్డ్‌వేవ్‌కు 462 ప్రైవేటు ఆస్పత్రులు సిద్ధం
సాక్షి, అమరావతి: కరోనా థర్డ్‌వేవ్ వచ్చినా ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలతోపాటు 462 ప్రైవేటు ఆస్పత్రులను కూడా సిద్ధం చేస్తోంది. ప్రైవేటులో చాలావరకు 50 నుంచి 100 పడకలలోపు ఆస్పత్రులున్నాయి. 100 పడకలకంటే ఎక్కువ ఉన్న ఆస్పత్రులు 65 ఉన్నాయి. కరోనా సేవల్లో భాగంగా ఈ ప్రైవేటు ఆస్పత్రులు 33,793 డీటైప్ ఆక్సిజన్ సిలిండర్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే 17,841 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. సాధారణ పడకలతోపాటు ఆక్సిజన్ పడకలు కూడా సిద్ధం చేసి ఉంచాలని ఆదేశించింది. ఎలాంటి సమయంలో రోగులు వచ్చినా సేవలు అందించాలని కోరింది. ఈ నెల చివరి నాటికి అన్ని ఆస్పత్రుల్లో సౌకర్యాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటోంది. కాగా, అత్యధికంగా గుంటూరు జిల్లాలో 63, కృష్ణా జిల్లాలో 60 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నట్టు తేలింది. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 11 మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చదువుతున్న నర్సింగ్, పారామెడికల్, ఫార్మసీ, ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులను సైతం కోవిడ్ సేవల్లో వినియోగించుకోనుంది. -
థర్డ్ వేవ్ ముప్పుతో నోయిడా ఆటో ఎక్స్ పో వాయిదా
-
థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధం
సాక్షి, హైదరాబాద్: కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నామని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పిల్లల కోసం జిల్లా ఆస్పత్రుల్లో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు ఆస్పత్రులు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకోవాలని, నెల రోజుల్లో ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టుకొకపొతే అనుమతి రద్దు చేస్తామని హెచ్చరించారు. దేశంలోని 50 శాతం కేసులు కేరళలోనే నమోదవుతున్నాయన్నారు. తెలంగాణలో డెల్టా ప్లస్‌కి సంబంధించి 2 కేసులు నమోదయ్యాయని తెలిపారు. రెండు డెల్టా ప్లస్ కేసులు హైదరాబాద్‌లోనే వచ్చాయన్నారు. డెల్టా వేరియంట్ ప్రమాదకరమని.. ఇంటా బయటా మాస్క్ ధరించాలని తెలిపారు. వచ్చే రెండు వారాలు రెండో డోస్‌కి ప్రాధాన్యత ఇస్తామని డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడించారు. -
థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఏపీ సర్కార్ సన్నద్ధం
సాక్షి, అమరావతి: కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 50వేల ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి రానున్నాయి. సెకండ్ వేవ్‌తో పోలిస్తే అదనంగా 10 వేల ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేయనున్నారు. చిన్నారులకు వైద్యం కోసం ప్రత్యేకంగా 3,900 బెడ్స్ అందుబాటులోకి రానున్నాయి. థర్డ్‌వేవ్‌కి వెయ్యి మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌తో ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పీఎస్ఏ ప్లాంట్ల నిర్మాణం చేపట్టనున్నారు. కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా వైరస్ నివారణ చర్యలపై బుధవారం నిర్వహించిన సమీక్షలో పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేయడంతో పాటు థర్డ్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ‘‘కాన్సన్ట్రేటర్లు, డీటైప్‌సిలెండర్లు, ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణపై శ్రద్ధవహించాలన్నారు. దీని కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని పీహెచ్‌సీల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఉంచాలని తెలిపారు. జిల్లాల వారీగా వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించడంతో పాటు, ఏపీఎంఎస్ఐడీసీలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. -
ఆగస్టులోనే థర్డ్ వేవ్.. ఈ నాలుగు అంశాలు కీలకం: ఐసీఎంఆర్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మూడోదశ ప్రభావంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఎపిడెమియాలజీ మరియు అంటువ్యాధుల విభాగాధిపతి డాక్టర్ సమిరన్ పాండా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు చివరిలో కోవిడ్-19 థర్డ్ స్టేజ్ దేశాన్ని తాకేఅవకాశం ఉందని తెలిపారు.అయితే సెకండ్ వేవ్ అంత తీవ్రంగా మూడో దశ ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. సూపర్ స్ప్రెడర్ సంఘటనలను నివారించడం, ఇతర జాగ్రత్త చర్యలతో దీని ఉధృతి ముడిపడి ఉందని తెలిపారు. దీంతో పాటు మరికొన్ని విషయాలను ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా కరోనా మూడవ వేవ్ రానుంది, కానీ కేసుల ఉధృతి మాత్రం రెండో వేవ్ కంటే తక్కువగానే ఉంటుందని డాక్టర్ పాండా ఎన్డీటీవీ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సందర్భంగా నాలుగు ముఖ్యమైన విషయాలను ఆయన ప్రస్తావించారు. మొదటి, రెండో దశలో రక్షించిన రోగనిరోధక శక్తి క్షీణిస్తే అది థర్డ్ వేవ్ విస్తరణకు దారి తీస్తుందన్నారు. ప్రస్తుతం ప్రజల్లో ఉన్న రోగనిరోధక శక్తిని కూడా దాటేసే పుట్టుకొచ్చే కొత్త వేరియంట్ కూడా దీనికి కారణం కావచ్చు. అలాగే కొత్త వేరియంట్‌ను రోగనిరోధక శక్తి నిరోధించినా, వేగంగా విస్తరించే లక్షణంతో లాంటి రెండు కారణాలు థర్డ్‌వేవ్‌కు కారణంగావచ్చు అని పాండా తెలిపారు. ఇక నాలుగవ కారణంగా కరోనా మార్గదర్శకాలను, ఆంక్షలను ముందస్తుగా రాష్ట్రాలు ఎత్తివేస్తే, అది మళ్లీ కేసుల పెరుగుదలకు దారితీస్తుందని డాక్టర్ పాండా చెప్పారు. డెల్టా, డెల్టా ప్లస్ రెండూ ఇప్పటికే దేశాన్ని తాకాయి కనుక డెల్టా వేరియంట్ వలన ముప్పు ఉండకవపోచ్చని అభిప్రాయపడ్డారు. కాగా థర్డ్‌వేవ్ అనివార్యమని ఇప్పటికే దేశంలోని అగ్రశ్రేణి వైద్యులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. అలాగే డెల్టా వేరియంట్ విస్తరణ ద్వారా కోవిడ్ -19 మూడో దశ "ప్రారంభ దశలో" ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ హెచ్చరించారు. సుమారు 111 కి పైగా దేశాలలో దీన్ని గుర్తించినట్టు పేర్కొన్నారు. మరోవైపు కరోనా హెచ్చరికలను ప్రజలు ఖాతరు చేయడం లేదని, వాతావరణ సూచనల తరహాలో తేలిగ్గా తీసుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
ఆగస్టు నెలలోనే కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం: ఎస్బీఐ రిపోర్ట్
-
థర్డ్‌వేవ్ వస్తోంది.. ఎస్బీఐ రిపోర్టులో కీలక విషయాలు
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి థర్డ్‌వేవ్‌పై ఆందోళన నేపథ్యంలో ఎస్బీఐ తాజా సర్వే కీలక విషయాలను వెల్లడించింది. సెకండ్ వేవ్ తీవ్ర ఉధృతి క్రమంగా క్షీణిస్తూ, కరోనా కేసులు, మరణాలు క్రమంగా తగ్గుతున్నాయి. కోలుకుంటున్నవారి సంఖ్య కూడా గణనీయంగా పుంజుంటోంది. సోమవారం నాటి గణాంకాల ప్రకారం కొత్తగా 40వేల లోపు కేసులు నమోదు కావడం కాస్త ఊరటనిస్తోంది. అలాగే మరణాలు వెయ్యి లోపు నమోదైనాయి. దీంతో కేసుల సంఖ్య నాలుగు నెలల కనిష్ఠానికి దిగి వచ్చింది. అయితే మూడో వేవ్ ముప్పుమాత్రం దేశ ప్రజలను వెంటాడుతోంది. ఈ క్రమంలో థర్డ్‌వేవ్ ప్రభావంపై ఎస్బీఐ తాజా సర్వే కీలక అంచనాలు వెలువరించింది. వచ్చే నెలలోనే (ఆగస్ట్) కరోనా థర్డ్‌వేవ్ మొదలయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించింది. అంతేకాదు సెప్టెంబర్ నెలలో కరోనా కేసుల నమోదు శిఖరాన్ని తాకుతుందని కూడా అంచనా వేసింది. ‘కోవిడ్-19: ద రేస్ టు ఫినిషింగ్ లైన్’ పేరుతో ఎస్బీఐ ఒక పరిశోధన నివేదికను విడుదల చేసింది. దేశంలో సెకండ్ వేవ్ పీక్ మే 7వ తేదీన నమోదైందని ఈ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం డేటా ప్రకారం జులై రెండో వారంలో రోజుకు 10 వేల చొప్పున కేసులు నమోదు కావచ్చని, అలాగే ఆగస్ట్ 15 తరువాత కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరగొచ్చని ఎస్బీఐ రిపోర్ట్ అంచనా వేసింది. ఎస్బీఐ రిపోర్ట్‌లోని ముఖ్యాంశాలు గ్లోబల్ డేటా అంచనాల ప్రకారం సెకండ్ వేవ్‌తో పోలిస్తే కరోనా థర్డ్ వేవ్ సగటు ఉధృత కేసులు 1.7 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. చారిత్రక పోకడల ఆధారంగా ఆగస్ట్ 12 తరువాత కేసుల సంఖ్య క్రమంగా పుంజుకుని, నెల తరువాత పీక్ స్టేజీకి వెళ్లేఅవకాశం ఉంది. అలాగే దేశంలో సగటున రోజుకు 40 వ్యాక్సిన్లు ఇస్తుండగా, దేశంలో రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారు 4.6 శాతంగా ఉన్నారు. ఇక తొలి డోసు తీసుకున్వారు 20.8 శాతం మంది మాత్రమే. యుఎస్, యుకె, ఇజ్రాయెల్, స్పెయిన్, ఫ్రాన్స్‌తో సహా ఇతర దేశాల కంటే ఇది ఇప్పటికీ తక్కువే. మరోవైపు కరోనా నిబంధనలు పాటించకపోతే అక్టోబర్-నవంబర్ మధ్య థర్డ్‌వేవ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ప్రభుత్వ ప్యానెల్ శాస్త్రవేత్త హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే రెండో వేవ్‌తో పోలీస్తే రోజువారీ కేసుల సంఖ్య సగానికి తగ్గవచ్చన్నారు. దేశంలో లక్షా, 50 వేలనుంచి 2 లక్షల వరకు కేసులు నమోదు కానున్నాయని ప్యానెల్ సభ్యులు, ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్త అగర్వాల్ హెచ్చరించారు. ఐఐటీ హైదరాబాద్ శాస్త్రవేత్త ఎం విద్యాసాగర్, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్ (మెడికల్) లెఫ్టినెంట్ జనరల్ మాధురి కనిత్కర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. -
థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం : ఆళ్ల నాని
-
Covid Third Wave: అప్రమత్తమైన వైద్యశాఖ, పిల్లల కోసం ప్రత్యేక పడకలు..
కరోనా మహమ్మారి ప్రజలను వణికిస్తోంది. మొదటి దశలో వైరస్ సాధారణంగా ప్రభావం చూపినా రెండో దశలో జిల్లా ప్రజలను వణికించింది. దీంతో ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. వైద్యం కోసం అప్పుసొప్పు చేసి చికిత్స పొందారు. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. రెండో దశ ముగియడంతో మూడో దశ చిన్నారులపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. పిల్లలపై కోవిడ్ వైరస్ ప్రభావం చూపితే వైద్యం అందించేందుకు తగు చర్యలు చేపడుతున్నారు. జిల్లాకు తలమానికంగా ఉన్న రిమ్స్‌లో పిల్లల కోసం ప్రత్యేక పడకలు, ఆక్సిజన్ సిలెండర్లు, వెంటిలెటర్లు, వైద్య సిబ్బందిని నియమించేందుకు ప్రత్యేక చర్యలు ముమ్మరం చేశారు. సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు రిమ్స్ వైద్య కళాశాల ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో, అర్బన్ హెల్త్ సెంటర్లలో పిల్లలకు సంబంధించిన వైద్య నిపుణులు లేరు. పిల్లలకు వైద్యం అందించేందుకు రిమ్స్ ఆస్పత్రే పెద్ద దిక్కుగా ఉంది. కోవిడ్ మహమ్మారి పేద, ధనిక అనే తేడా లేకుండా ఎవరిని వదలడం లేదు. రెండో దశ ఇంకా ముగియకముందే మూడో దశ చిన్నారులపై ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు సూచించారు. దీంతో పిల్లల తల్లిదండ్రుల్లో వణుకు పుడుతోంది. రిమ్స్ ఆస్పత్రిలో మొత్తం 768 పడకలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం పెద్దల కోసం 416 ఐసీయూ, ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. వీటికి తోడుగా పది ప్రైవేట్ ఆస్పత్రుల్లో 175 బెడ్లను ఏర్పాటు చేసి వైద్యసేవలు అందించారు. పిల్లలపై ప్రభావం చూపుతుందనే నేపథ్యంలో పిల్లల వార్డులో 60 ఆక్సిజన్ బెడ్లను రిమ్స్ అధికారులు సిద్ధం చేశారు. 10 ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేయగా, మరో పది బెడ్లను అదనంగా ఏర్పాటు చేయనున్నారు. అన్ని రోగాలకు సంబంధించి రిమ్స్‌లో ప్రస్తుతం 280 మంది చికిత్స పొందుతున్నారు. అప్రమత్తమైన వైద్య శాఖ థర్డ్‌వేవ్‌లో చిన్నారులపై ప్రభావం చూపుతుందన్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ, రిమ్స్ అధికారులు ముందుచూపుతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే బెడ్లను ఏర్పాటు చేయగా, మందులను అందుబాటులో ఉంచేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటివరకు రిమ్స్ ఆస్పత్రిలో కరోనా బారిన పడి 4వేలకు పైగా చికిత్స పొందారు. 80కి పైగా మృత్యువాత పడ్డారు. మొదటి, రెండో విడతలో కలిపి మొత్తం 5శాతం మంది కూడా చిన్నారులు కోవిడ్ బారిన పడలేదని రిమ్స్ డైరెక్టర్ వివరించారు. దాదాపు 50 మంది వరకు కోవిడ్ బారిన పడి కోలుకున్నారని తెలిపారు. మరణాలు కూడా తక్కువగానే ఉంటాయని పేర్కొంటున్నారు. తగ్గుముఖం పట్టిన కోవిడ్ కోవిడ్ మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టింది. గతేడాది మార్చి నెలలో జిల్లాలో మొదటి కేసు నమోదు కాగా, జూలై, ఆగస్టు మాసాల్లో కేసులు పెరిగాయి. ఆ తర్వాత అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు పదుల సంఖ్యలో కేసులు నమోదు కాగా, ఈ ఏడాది మార్చిలో మరోసారి విజృంభించి ఏప్రిల్ నెలలో వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. గత నెలలో లాక్డౌన్ విధించడంతో మళ్లీ కేసులు తగ్గాయి. ప్రస్తుతం 5 నుంచి 10 లోపు కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 3,70,648 పరీక్షలు చేయగా 16,252 మందికి పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది. 3,54,193 మందికి నెగిటివ్ రిపోర్టులు వచ్చాయి. ప్రస్తుతం జిల్లాలో 84 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 16,084 మంది కోవిడ్‌ను జయించారు. దాదాపు 200 మందికి పైగా కోవిడ్ బారిన పడి మృత్యువాత పడ్డారు. కానీ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారుల లెక్కల ప్రకారం 84 మంది మృతిచెందారు. భయపడాల్సిన అవసరం లేదు థర్డ్ వేవ్ నేపథ్యంలో పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. పెద్దవారికి సోకినంతగా వైరస్ చిన్నారులకు సోకదు. వారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది. పిల్లలు కూడా మాస్కులు ధరించేలా చూడాలి. భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలి. తల్లిదండ్రులు చిన్నారులను అనవసరంగా బయటకు తీసుకెళ్లొద్దు. చిరుతిండ్లకు దూరంగా ఉంచాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకునేలా చూడాలి. అనారోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. చిన్నారుల్లో జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విరేచనాలు, కడుపునొప్పి తదితర లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. – బానోత్ బలరాం, రిమ్స్ డైరెక్టర్, ఆదిలాబాద్ చదవండి: ఔను, ఆ యువతులిద్దరూ ఒక్కటయ్యారు.! -
2050 నాటికి యూఎస్, చైనా సరసన భారత్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సంక్షోభంలో మాంద్యంలోకి జారుకున్న భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తాజా అధ్యయనం కీలక విషయాన్ని ప్రచురించింది. 2050 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా తరువాత భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడవ అతిపెద్దదిగా అవతరిస్తుందని లాన్సెట్ పత్రిక ప్రచురించిన ఒక అధ్యయనం తెలిపింది. తద్వారా జపాన్ను వెనక్కు నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడవ స్థానానికి ఎగబాకనుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం, ప్రపంచంలో భారతదేశం ఐదవ స్థానంలో ఉంది. తరువాత ఫ్రాన్స్, యూకే ఉన్నాయి. (ఆర్థికశాస్త్రంలో నోబెల్ విజేతలు వీరే) ప్రపంచంలోని దేశాలలో శ్రామిక జనాభా గురించి ఒక అధ్యయనం జరిగింది. 2017లో భారతదేశం ప్రపంచంలో ఏడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని పేర్కొంది. ఈ ప్రాతిపదికన 2030 నాటికి భారతదేశం నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఈ అధ్యయనం తెలిపింది. 2030 నాటికి చైనా, జపాన్ భారత్ కంటే ముందంజలో ఉంటాయని తెలిపింది. చైనా, భారతదేశంలో శ్రామిక జనాభా బాగా క్షీణించినట్లు లాన్సెట్ వెల్లడించింది ఈ సమయంలో, నైజీరియాలో శ్రామిక జనాభా పెరుగుతుందని తెలిపింది. అయినప్పటికీ, శ్రామిక జనాభా పరంగా భారతదేశం అగ్రస్థానంలో ఉంటుంది. 2100 వరకు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శ్రామిక జనాభాగా ఉంటుందని పేర్కొంది. మరోవైపు 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని నీతీ ఆయోగ్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఇప్పటికే అంచనా వేశారు. కోవిడ్-19 మహమ్మారి చాలా వ్యాపారాలను నష్టాల్లోకి నెట్టివేసింది. దీంతో ఈ సంవత్సరం, ఏప్రిల్-జూన్ కాల త్రైమాసికంలో జీడీపీ 23.9శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. చదవండి: మూడోరోజూ భగ్గుమన్న బంగారం -
పరి‘శ్రమ’ ఫలించింది!
భారీ పరిశ్రమల ఆసక్తిలో.. మూడో స్థానంలో తెలంగాణ - రూ.7,268 కోట్ల పెట్టుబడితో 43 పరిశ్రమల స్థాపనకు ఆసక్తి వ్యక్తీకరణ - 2016-17 వార్షిక నివేదికలో వెల్లడించిన డీఐపీపీ సాక్షి, హైదరాబాద్: భారీ పరిశ్రమల స్థాపన కోసం 2016–17 సంవత్సరానికిగాను పెట్టుబడిదారుల ఆసక్తి వ్యక్తీకరణలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో రూ.7,268 కోట్ల పెట్టుబ డులతో 43 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర పారిశ్రామిక విధానం, ప్రోత్సాహకాల శాఖ (డీఐపీపీ)కి ఇండస్ట్రియల్ ఇంటప్రెన్యూర్ మెమో రాండం(ఐఈఎం), లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ)లు దాఖలు చేశారు. డీఐపీపీ రాష్ట్రాల వారీగా భారీ పరిశ్రమల స్థాపనకు నమోదైన ఆసక్తి వ్యక్తీకరణల వివరాలను వార్షిక నివేదిక రూపంలో తమ వెబ్‌పోర్టల్‌లో పెట్టింది. ఆ నివేదిక ప్రకారం.. 2014–15లో తెలంగాణ రూ.10,209 కోట్ల పెట్టుబడుల ఆసక్తి వ్యక్తీకరణతో జాతీయ స్థాయిలో 10వ స్థానంలో నిలిచింది. 2015–16లో రూ.22,146 కోట్ల ఆసక్తి వ్యక్తీరణతో దేశంలో 6వ స్థానంలో.. గతేడాది రూ.7,268 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. పొరుగు రాష్ట్రం ఏపీ గతేడాది రూ.2,223 కోట్ల పెట్టుబడులతో 33 భారీ పరిశ్రమల స్థాపనకు ఆసక్తి వ్యక్తమై.. ఆరో స్థానంలో నిలిచింది. అగ్రస్థానంలో గుజరాత్ భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తీకరణలో గుజరాత్ మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో రూ.31,367 కోట్ల పెట్టుబడులతో 98 పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తం చేస్తూ దరఖాస్తులు వచ్చాయి. ఇక రెండో స్థానంలో నిలిచిన కర్ణాటకలో రూ.22,868 కోట్ల పెట్టుబడులతో 92 భారీ పరిశ్రమల స్థాపనకు దరఖాస్తులు వచ్చాయి. మూడో స్థానంలో తెలంగాణ నిలవగా.. తర్వాతి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్ర దేశ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ నిలిచాయి. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రూ.10 కోట్లు, ఆపై పెట్టుబడులతో ఏర్పాటు చేసే పరిశ్రమలను భారీ పరిశ్రమల కింద పరిగణిస్తారు. ఈ పరిశ్రమల స్థాపనకు అనుమతుల కోసం ఆసక్తి వ్యక్తీకరిస్తూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు డీఐపీపీకి మెమోరండం/ఎల్ఓఐలు దాఖలు చేస్తారు. ఈ దరఖాస్తుల ఆధారంగానే తాజాగా> డీఐపీపీ వార్షిక నివేదికను విడుదల చేసింది. డీఐపీపీకి ఆసక్తి వ్యక్తీకరణ చేసినవారిలో తర్వాత కొందరు విరమించుకునే అవకాశముందని.. మిగతా వారు పరిశ్రమలు స్థాపిస్తారని రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారవర్గాలు పేర్కొన్నాయి. -
హార్బర్లో మూడో నంబర్ ప్రమాద సూచిక
నిజాంపట్నం : వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో హార్బర్లో మూడో నంబర్ ప్రమాద సూచికను ఎగురవేసినట్లు పోర్టు కన్జర్వేటర్ ఎం.వెంకటేశ్వరావు తెలిపారు. తుఫాన్ హెచ్చరికల కేంద్రం ఆదేశాల మేరకు హార్బర్లో గురువారం మూడో నంబర్ ప్రమాద సూచిక ఎగరవేసినట్లు పేర్కొన్నారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రపు వేటకు వెళ్లొద్దని సూచించారు. -
ఎంసెట్ ‘తీన్’మార్
హాజరైన 1,499 మంది విద్యార్థులు ప్రతి సెంటర్లో పోలీసు బందోబస్తు చివరి నిమిషంలో ఉరకలు పరుగులు ఖమ్మం: ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశం కోసం తెలంగాణ ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన ఎంసెట్–3 జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. నగరంలోని మొత్తం నాలుగు కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 2,172 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 1,499 మంది హాజరయ్యారని, 673 మంది గైర్హాజరయ్యారని జిల్లా కోఆర్డినేటర్ పుష్పలత వివరించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. నిమిషం నిబంధన ఉండటంతో అభ్యర్థులు ఉదయం 9 గంటల వరకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంతో ఎంసెట్–2 రదై్దన నేపథ్యంలో ఎంసెట్–3కి భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖమ్మం డీఎస్పీ సురేష్‌కుమార్ నేతృత్వంలో పోలీసులు బందోబస్తును కఠినతరం చేశారు. పరీక్ష కేంద్రం వద్ద పోలీసు పహారా ఏర్పాటు చేసి ప్రతి వ్యక్తిని తనిఖీ చేసి లోనికి పంపించారు. పరీక్ష నిర్వహణ తీరును జేఎన్టీయూ అధికారులతో పాటు జిల్లా కోఆర్డినేటర్ పర్యవేక్షించారు. – ఖమ్మంలోని ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల–1 సెంటర్‌కు 550 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 386 మంది హాజరయ్యారు. 164 మంది గైర్హాజరయ్యారు. – ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల–2 సెంటర్‌కు 550 మంది గాను 391 మంది హాజరయ్యారు. 159 మంది గైర్హాజరయ్యారు. – ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సెంటర్లో 675 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 452 మంది మాత్రమే రాశారు. 223 మంది పరీక్షకు హాజరుకాలేదు. – యూనివర్సిటీ పీజీ కళాశాల సెంటర్లో 397 మందికి 270 హాజరుకాగా 127 మంది గైర్హాజరయ్యారు. – పలువురు అభ్యర్థులు ఉరకలు పరుగులు తీస్తూ కనిపించారు. పరీక్ష కేంద్రాల విషయంలో కొందరు అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. ఇల్లెందు పట్టణానికి చెందిన లావణ్య అనే అభ్యర్థిని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల అనుకొని, యూనివర్సిటీ కళాశాలకు వెళ్లింది. తీరా హాల్‌టికెట్ చూసే సరికి పొరపాటును గుర్తించింది. తిరిగి తనకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి రాబోయే సరికి అప్పటికే ఆలస్యం కావడంతో అనుమతించలేదు. – హాల్‌టికెట్ల డౌన్లోడింగ్, అటెస్టేషన్ కోసం పలువురు విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. – తల్లిదండ్రులు దగ్గరుండి పిల్లలకు దైర్యంనూరి పోసి పరీక్ష హాల్‌కు పంపించారు. పరీక్ష పూర్తయ్యే వరకు అక్కడే ఉండి తిరిగి వారిని తోడ్కొని వెళ్లారు. -
నాణ్యతపై మూడో కన్ను
థర్డ్‌పార్టీకి చేరిన కోల్ క్వాలిటీ టెస్టింగ్ ౖయెటింక్లయిన్‌కాలనీ(కరీంనగర్) : సింగరేణి సంస్థ బొగ్గు నాణ్యత విషయంలో మరింత కఠిన పరీక్షలకు నిలబడాల్సి సమయం ఆసన్నమైంది. వినియోగదారులకు క్వాలిటీ బొగ్గు అందిస్తూ వారి మరింత దగ్గరకావడానికి యాజమాన్యం చర్యలు చేపట్టింది. సింగరేణి నుంచి ఎన్టీపీసీకి అందజేసే బొగ్గు నాణ్యతను పరీక్షించే పనిని మూడో సంస్థకు అప్పగించారు. గతంలో అమ్మకం దారుడు, కొనుగోదారు మధ్య నాణ్యత పరీక్షలు కొనసాగేవి. నెల రోజుల నుంచి సిమ్ఫర్(సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ ఫ్యూయల్ రిసెర్చ్) సంస్థ ఈ బాధ్యతను చేపట్టింది. క్వాలిటీ పరీక్షలు ఇలా.. ప్రతీ 45 నిమిషాలకు ఒకసారి సీహెచ్‌పీ (కోల్హ్యాం డ్లింగ్ ప్లాంట్) కన్వేయర్‌పై వెళ్తున్న బొగ్గు పెళ్లల నుంచి కొన్ని తీసి ఒకచోట చేర్చుతారు. ఇలా రోజంతా తీసిన బొగ్గును ప్రత్యేక యంత్రాలతో డస్ట్‌గా చేసి అరకిలో చొప్పున ప్యాకింగ్ చేస్తారు. సీల్ వేసిన అనంతరం నాగ్‌పూర్‌లోని టెస్టింగ్ ల్యాబ్‌కు పంపిస్తారు. ఇందులో నుంచే సింగరేణి, ఎన్టీపీసీ సంస్తలకు ఒక్కో శాంపిల్ అందజేస్తారు. ఏదైనా క్వాలిటీ విషయంలో వివాదం తలెత్తితే తిరిగి పరిశీలించేందుకు మరో శాంపిల్ నిల్వ ఉంచుతారు. ఇద్దరి నుంచి మూడో వ్యక్తికి.. గతంలో బొగ్గు నాణ్యత పరీక్షలు ఎన్టీపీసీ, సింగరేణి యాజమాన్యాల మధ్య కొనసాగేవి. ఏమైనా తేడాలుంటే ఇరువర్గాలు పరిశీలించుకునేవి. ఈ విధాన ఒప్పందం 1997–98లో జరిగింది. అయితే కోలిండియాలో ఎన్టీపీసీకి బొగ్గు సంస్థల మధ్య నాణ్యత విషయమై వివాదం ఏర్పడింది. దీన్ని పరిష్కరించేందుకు ఎన్టీపీసీ కేంద్రప్రభుత్వాన్ని ఆశ్రయించిచడంతో థర్డ్‌పార్టీ షాప్లింగ్పై అన్ని బొగ్గు సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలో ధన్‌బాద్‌కు చెందిన సిమ్ఫర్ సంస్థ సింగరేణి బొగ్గు నాణ్యత పరీక్షలు చేసేలా ఒప్పందం జరిగింది. నాణ్యత విస్మరిస్తే నమ్మకాన్ని కోల్పోతాం – డైరెక్టర్(పీఅండ్‌పీ) మనోహర్‌రావు వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొనేందుకు బొగ్గు నాణ్యత విషయంలో రాజీ లేకుండా పనిచేయాలి. ప్రస్తుత పోటీ మార్కెట్లో నాణ్యత ఉంటేనే సంస్థకు భవిష్యత్ ఉంటుంది. «థర్డ్‌పార్టీ చేతుల్లోకి వెళ్లిన్న క్రమంలో నాణ్యతపై మరింత లోతుగా ముందుకు సాగాలి. ఇప్పటివరకు వినియోగదారుల వద్ద ఏలాంటి తేడాలు లేకుండా వ్యవహరిస్తున్నాం. మనం ఇచ్చే క్వాలిటీ ప్రకారమే డబ్బులు వస్తాయి. బజారులో తక్కువ ధరకే నాణ్యమైన బొగ్గు లభిస్తోంది. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండి బొగ్గు కొనుగోలు దారులను కాపాడుకోవాలి. -
మూడవ మృతదేహం స్వాధీనం
పారిస్ : పారిస్ ఉగ్రదాడి ఘటనలో మూడవ ఉగ్రవాది మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తీవ్ర అలజడి రేపిన ఈ కాల్పులకు ఘటనకు పాల్పడిన మహిళా జిహాదీ మృతదేహాన్ని గుర్తించినట్టు పోలీసులు ప్రకటించారు. బుధవారం సెయింట్ డేనిస్ అపార్ట్ మెంట్ పై జరిగిన దాడిలో కీలకమైన ఉగ్రవాది హతమైన ప్రదేశంలో ఈ మూడో మృతదేహాన్ని కనుగొన్నామని విచారణ అధికారులు ప్రకటించారు. అయితే ఆ ఉగ్రవాదికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి చేయలేదు. సంఘటనా స్థలంలో హ్యాండ్ బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా కీలక సూత్రధారితోపాటు చనిపోయిన మహిళా ఉగ్రవాది.. అతడి (కజిన్) బంధువేనని, ఆమె పేరు హస్నా ఐతబౌలాచ్న్ అని పోలీసు వర్గాలు తెలిపాయి. సంఘటనా స్థలంలో దొరికిన పాస్ పోర్ట్ ఆ మహిళ పేరుతో ఉండటం ఈ అనుమానాలకు తావిస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. -
మూడో ఘాట్ రోడ్డు నిర్మించే యోచనలో టీటీడి ?
-
లండన్ చదువుల్లో మనోళ్లు..
లండన్: బ్రిటన్‌లో చదువుకుంటున్న మొత్తం విదేశీ విద్యార్థుల సంఖ్యలో భారత విద్యార్థులు మూడవ స్థానంలో ఉన్నారని 'ద ఎకనమిక్ ఇంపాక్ట్ ఆఫ్ లండన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రిపోర్టు' తెలిపింది. మొదటి రెండు స్థానాలను చైనా, అమెరికాలు ఆక్రమించాయి. 'లండన్ అండ్ పార్ట్నర్స్' ఆధ్వర్యంలో వెలువరించిన ఈ సర్వే రిపోర్టులో.. లండన్‌లోని విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విదేశీ విద్యార్థుల ద్వారా ఏటా బ్రిటన్‌కు 3 బిలియన్ పౌండ్ల ఆదాయం చేకూరుతుండగా, 37 వేల మంది విద్యార్థులు తమ ఉద్యోగ సేవలను అందిస్తున్నారు. 2013-14 సంవత్సరానికిగాను బ్రిటన్‌లో విద్య కోసం భారత విద్యార్థులు 130 మిలియన్ పౌండ్లను ఖర్చుచేయగా, చైనీయులు 407 మిలియన్ పౌండ్లు, అమెరికన్లు 217 మిలియన్ పౌండ్లు వెచ్చిస్తున్నారు. 2009- 10 సంవత్సరం నుండి లండన్‌లో విద్యనభ్యసిస్తున్న భారతీయుల సంఖ్య 9 శాతం తగ్గగా, చైనీయుల సంఖ్య మాత్రం ఇదే కాలానికి 44 శాతం పెరగడం విశేషం.