లండన్ చదువుల్లో మనోళ్లు.. | India third-largest student market in London | Sakshi
Sakshi News home page

లండన్ చదువుల్లో మనోళ్లు..

Published Sat, Oct 24 2015 12:03 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

వివిధ దేశాల నుండి వెళ్లి.. బ్రిటన్లో చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్యలో భారత్కు చెందిన విద్యార్థులు మూడవ స్థానంలో ఉన్నారని 'ద ఎకనమిక్ ఇంపాక్ట్ ఆఫ్ లండన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రిపోర్టు' తెలిపింది.

లండన్: బ్రిటన్లో చదువుకుంటున్న మొత్తం విదేశీ విద్యార్థుల సంఖ్యలో భారత విద్యార్థులు మూడవ స్థానంలో ఉన్నారని 'ద ఎకనమిక్ ఇంపాక్ట్ ఆఫ్ లండన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రిపోర్టు' తెలిపింది. మొదటి రెండు స్థానాలను చైనా, అమెరికాలు ఆక్రమించాయి. 'లండన్ అండ్ పార్ట్నర్స్' ఆధ్వర్యంలో వెలువరించిన ఈ సర్వే రిపోర్టులో.. లండన్లోని విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విదేశీ విద్యార్థుల ద్వారా ఏటా బ్రిటన్కు 3 బిలియన్ పౌండ్ల ఆదాయం చేకూరుతుండగా, 37 వేల మంది విద్యార్థులు తమ ఉద్యోగ సేవలను అందిస్తున్నారు.


  2013-14 సంవత్సరానికిగాను బ్రిటన్లో విద్య కోసం  భారత విద్యార్థులు 130 మిలియన్ పౌండ్లను ఖర్చుచేయగా, చైనీయులు 407 మిలియన్ పౌండ్లు, అమెరికన్లు 217 మిలియన్ పౌండ్లు వెచ్చిస్తున్నారు. 2009- 10 సంవత్సరం నుండి లండన్లో విద్యనభ్యసిస్తున్న భారతీయుల సంఖ్య 9 శాతం తగ్గగా, చైనీయుల సంఖ్య మాత్రం ఇదే కాలానికి 44 శాతం పెరగడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement