హార్బర్‌లో మూడో నంబర్ ప్రమాద సూచిక
నిజాంపట్నం : వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో హార్బర్‌లో మూడో నంబర్ ప్రమాద సూచికను ఎగురవేసినట్లు పోర్టు కన్జర్వేటర్ ఎం.వెంకటేశ్వరావు తెలిపారు. తుఫాన్ హెచ్చరికల కేంద్రం ఆదేశాల మేరకు హార్బర్‌లో గురువారం మూడో నంబర్ ప్రమాద సూచిక ఎగరవేసినట్లు పేర్కొన్నారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రపు వేటకు వెళ్లొద్దని సూచించారు.