Danger signal
-
సుంకేసుల రిజర్వాయర్‌కు పొంచి ఉన్న ప్రమాదం
కర్నూలు జిల్లా: సుంకేసుల రిజర్వాయర్‌కు ప్రమాదం పొంచి ఉంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సుమారు 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఇన్‌ఫ్లోగా వస్తుండగా అధికారులు అంతే మొత్తంలో నీటిని కిందికి వదులుతున్నారు. డ్యాంకు ఉన్న మొత్తం 30 గేట్లలలో 11 గేట్లు పనిచేయడం లేదు. అత్యవసర సమయాలలో తెరిచే స్కావేర్ గేట్లు 3 తెరిచి నీటిని శ్రీశైలానికి వదిలారు. సుంకేసులకు వరద ఉద్రిక్తత పెరగడం..డ్యాంకు సంబంధించిన 11 గేట్లు పనిచేయకపోవడంతో పరిసర గ్రామ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. -
హార్బర్లో మూడో నంబర్ ప్రమాద సూచిక
నిజాంపట్నం : వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో హార్బర్లో మూడో నంబర్ ప్రమాద సూచికను ఎగురవేసినట్లు పోర్టు కన్జర్వేటర్ ఎం.వెంకటేశ్వరావు తెలిపారు. తుఫాన్ హెచ్చరికల కేంద్రం ఆదేశాల మేరకు హార్బర్లో గురువారం మూడో నంబర్ ప్రమాద సూచిక ఎగరవేసినట్లు పేర్కొన్నారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రపు వేటకు వెళ్లొద్దని సూచించారు. -
నవ్వొద్దు... బతకద్దు
అసహనం చిక్కగా ఆవరించుకుంటోంది. మనిషి మీద మనిషికి అసహనం, ద్వేషం. ఒకప్పుడు లేవని కాదు. ఇప్పుడది ముదిరింది. అప్పుడు తెల్లవాళ్ళు ఆఫ్రికా, ఆసియాల కొచ్చి మనం నల్లగా ఉన్నందుకు అసహ్యం, అసహనం ఫీలయ్యారు. మనల్ని బానిసలని చేసి హింసించి వ్యాపారం చేశారు. పేరాశ, ఆధిపత్యం పేరిట రెండు ప్రపంచ యుద్ధాలూ జరిగాయి. కోట్ల మంది నెత్తురోడారు. అసహనం అలాగే మిగిలింది. మతం పేరిట మరింత కరడు కడుతోంది. కాశ్మీర్ మీదా, రామ జన్మభూమి మీదా ఎవరైనా డాక్యుమెంటరీలు తీస్తే ప్రదర్శన మూసే వరకూ నిరసనలూ హింసా ఆగవు. పీకే అనే సినిమా వస్తే చూడకుండానే నిరసనలు. నెహ్రూ ప్రభుత్వకాలంలో ‘శంకర్స్ వీక్లీ’’ కార్టూన్ పత్రికలో ఆయన మీద విమర్శల కార్టూన్లు వస్తే నవ్వుతూ రిసీవ్ చేసుకునే వాడు నెహ్రూ. పైగా ‘డోంట్ స్పేర్ మీ... శంకర్’’ అని చెప్పేవాడు. ఇప్పుడలాలేదు. సరదాలూ వెటకారాలకు రోజులు కాదు. నవ్వినా నవ్వించినా బతకడానికి సందు లేదని హిందు ముస్లిం ఫండమెంటలిస్టులు కలిసి లెవెన్త్ కమాండ్ రాసి పెట్టారు. ఇది మనుషుల మధ్య ప్రేమకీ, ఆనందానికీ, గుండె నిండా నవ్వుకోవడానికీ డేంజర్ సిగ్నల్. భూతాపంతో పోటీ పడి పెరుగుతోంది అసహనం. మనమిక నవ్వొద్దు మనమిక బతకొద్దు. - మోహన్, కార్టూనిస్ట్