కనురెప్పల సోయగానికై.. ఇలా చేయండి! | With Artificial Eye Lashes To Keep The Eyes Like you Do This | Sakshi
Sakshi News home page

Beauty Tips: కనురెప్పల సోయగానికై.. ఇలా చేయండి!

Published Thu, May 9 2024 11:59 AM | Last Updated on Thu, May 9 2024 12:03 PM

కనురెప్పల సోయగానికై..

కనురెప్పల సోయగానికై..

ఆర్టిఫీషియల్‌ ఐ లాషెస్‌తో కళ్లను మీనాల్లా మెరిపించవచ్చని తెలిసినాకూడా వాటిని ఎలా అమర్చుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడుతుంటే... ఒకసారి ఇలా ట్రై చేయండి.

  • ఆర్టిఫీషియల్‌ ఐ లాషెస్‌ (సౌందర్య సాధనాల మార్కెట్‌లో దొరుకుతాయి) ఒక సెట్, వాటిని అమర్చడానికి ఐలాష్‌ గ్లూ తీసుకోవాలి.

  • వీటితోపాటు కత్తెర, ట్వీజర్, ఐ లాష్‌ కర్లర్, ఐ లైనర్, మస్కారా తీసుకోవాలి.

  • ఆర్టిఫీషియల్‌ ఐ లాషెస్‌ మరీ పొడవుగా ఉన్నట్లనిపిస్తే తగినంత మేరట్రిమ్‌ చేయాలి.

  • ట్వీజర్‌ సహాయంతో లాషెస్‌కు గ్లూ పట్టించాలి. ఇప్పుడు వాటిని జాగ్రత్తగా కనురెప్ప మీద అమర్చాలి. గ్లూ ఆరి లాషెస్‌ సెట్‌ అయ్యే వరకు ఆగాలి. స్కిన్‌కు అంటుకోకుండా గ్లూవిడిగా ఆరిపోతున్నట్లు అనిపించినా, ఆరాక ఊడి వచ్చేటట్లు అనిపించినా కనురెప్పల మీద ఆర్టిఫీషియల్‌ లాషెస్‌ కరెక్ట్‌గా సెట్‌ అయ్యేటట్లు మెల్లగా నొక్కాలి.

  • గ్లూ ఆరిన తర్వాత లాషెస్‌కు డార్క్‌షేడ్‌ ఐ లైనర్‌ అప్లయ్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల అసలు కనురెప్పలకు, ఆర్టిఫీషియల్‌ లాషెస్‌కు మధ్య తేడా కనిపించకుండా అంతా ఒకేలా ఉంటాయి.

  • చివరగా ఐలాష్‌ కర్లర్‌తో వంపు తిప్పాలి. అవసరమనిపిస్తే (మరింతడార్క్‌గా కనిపించాలనుకుంటే) మస్కారా అప్లయ్‌ చేయాలి.

ఇవి చదవండి: మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకోండి!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement