'ఐ మాస్క్‌ మసాజర్‌..' కళ్లను అందంగానే కాదు ఆరోగ్యంగా కూడా.. | Eye Mask Massager To Protect Your Eyes | Sakshi
Sakshi News home page

'ఐ మాస్క్‌ మసాజర్‌..' కళ్లను అందంగానే కాదు ఆరోగ్యంగా కూడా..

Published Sun, Mar 3 2024 2:27 PM | Last Updated on Sun, Mar 3 2024 2:27 PM

Eye Mask Massager To Protect Your Eyes - Sakshi

చందమామ లాంటి మొహం.. అంటూ క్రెడిట్‌ అంతా మొహానికి పూస్తారు కానీ అసలు అందం కళ్లది. చారడేసి ఉన్నా.. కోలగా కదిలినా.. చిన్నగా మెరిసినా కళ్లతోనే మొహానికి కళ! వాటి మీద శ్రద్ధ పెట్టి.. మరింత ఆకర్షణీయంగా మార్చుకోవాలంటే ఇదిగో..  ఈ ఐ మాస్క్‌ మసాజర్‌ సాయం తీసుకోవచ్చు.

దీన్ని వినియోగించుకోవడానికి బ్యాటరీలను వాడొచ్చు. అలాగే చార్జింగ్‌ పెట్టుకుని కూడా వినియోగించుకోవచ్చు. ఇది మొత్తం ట్రిపుల్‌ ఎయిర్‌ ప్రెజర్, రిథమిక్‌ వైబ్రేషన్, హీట్‌ థెరపీ అనే 3 మోడ్స్‌లో పని చేస్తుంది. చిత్రంలో చూపించిన విధంగా దీన్ని తలకు ధరించాలి. ఈ థెరపీ కారణంగా కళ్ల చుట్టూ ఉండే స్కిన్‌  టోన్‌  మారుతుంది. ఈ మోడల్‌లో పింక్, సిల్వర్‌ .. కలర్స్‌ అందుబాటులో ఉన్నాయి.

రెసిన్, పాలీకార్బోనేట్, పాలీయూరితేన్‌ మెటీరియల్స్‌తో తయారైన ఈ ఐ మసాజర్‌.. కళ్లను అందంగానే కాదు ఆరోగ్యంగానూ మారుస్తుంది. దీనికి మాస్క్‌ కంట్రోలర్‌ రిమోట్‌ లభిస్తుంది. అలాగే చార్జింగ్‌ పెట్టుకోవడానికి వీలుగా.. అడాప్టర్‌ వాడుకోవచ్చు. ఈ మసాజర్‌ను ఇంట్లో ఖాళీ సమయాల్లోనే కాదు.. ప్రయాణాల్లో రిలాక్స్‌డ్‌గా పడుకోవడానికీ వినియోగించుకోవచ్చు.

ఇవి చదవండి: కొన్ని వ్యాధులకు మద్యమే మందట.. తాగితే తగ్గుతుందట!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement