Eye Makeup
-
'ఐ మాస్క్ మసాజర్..' కళ్లను అందంగానే కాదు ఆరోగ్యంగా కూడా..
చందమామ లాంటి మొహం.. అంటూ క్రెడిట్ అంతా మొహానికి పూస్తారు కానీ అసలు అందం కళ్లది. చారడేసి ఉన్నా.. కోలగా కదిలినా.. చిన్నగా మెరిసినా కళ్లతోనే మొహానికి కళ! వాటి మీద శ్రద్ధ పెట్టి.. మరింత ఆకర్షణీయంగా మార్చుకోవాలంటే ఇదిగో.. ఈ ఐ మాస్క్ మసాజర్ సాయం తీసుకోవచ్చు. దీన్ని వినియోగించుకోవడానికి బ్యాటరీలను వాడొచ్చు. అలాగే చార్జింగ్ పెట్టుకుని కూడా వినియోగించుకోవచ్చు. ఇది మొత్తం ట్రిపుల్ ఎయిర్ ప్రెజర్, రిథమిక్ వైబ్రేషన్, హీట్ థెరపీ అనే 3 మోడ్స్‌లో పని చేస్తుంది. చిత్రంలో చూపించిన విధంగా దీన్ని తలకు ధరించాలి. ఈ థెరపీ కారణంగా కళ్ల చుట్టూ ఉండే స్కిన్ టోన్ మారుతుంది. ఈ మోడల్లో పింక్, సిల్వర్ .. కలర్స్ అందుబాటులో ఉన్నాయి. రెసిన్, పాలీకార్బోనేట్, పాలీయూరితేన్ మెటీరియల్స్‌తో తయారైన ఈ ఐ మసాజర్.. కళ్లను అందంగానే కాదు ఆరోగ్యంగానూ మారుస్తుంది. దీనికి మాస్క్ కంట్రోలర్ రిమోట్ లభిస్తుంది. అలాగే చార్జింగ్ పెట్టుకోవడానికి వీలుగా.. అడాప్టర్ వాడుకోవచ్చు. ఈ మసాజర్‌ను ఇంట్లో ఖాళీ సమయాల్లోనే కాదు.. ప్రయాణాల్లో రిలాక్స్డ్గా పడుకోవడానికీ వినియోగించుకోవచ్చు. ఇవి చదవండి: కొన్ని వ్యాధులకు మద్యమే మందట.. తాగితే తగ్గుతుందట! -
నులిమితే వలయాలు
తరచూ కళ్లను నులుముతున్నారా? అయితే వెంటనే ఆపేయండి. ఎందుకంటే నల్లటి వలయాలు ఏర్పడటానికి కళ్లను నులమడమూ ఓ కారణం అవుతుంది. ఇలాంటప్పుడే ఏం చేయాలో తెలుసుకుంటే ఈ సమస్యను సులువుగా అధిగమించవచ్చు. కంటి చుట్టూ నలుపుదనం ఏర్పడకుండానూ చూసుకోవచ్చు. ఉంగరపు వేలితో మాత్రమే! ఐ మేకప్‌ను తొలగించడానికి ఏ వేళ అయినా ఉంగరపు వేలిని మాత్రమే ఉపయోగించడం మేలు. సాధారణంగా ఉంగరపు వేలు బలహీనంగా ఉంటుంది. కన్ను చాలా సున్నితమైనది కాబట్టి, ఉంగరపు వేలిని అంతే మృదువుగా ఉపయోగించడానికి వీలు ఎక్కువ. చల్లని టీ బ్యాగ్స్! కప్పు వేడి నీటిలో టీ బ్యాగ్ వేసుకొని సేవించండి. తర్వాత వాడిన ఆ టీ బ్యాగ్‌ను ఫ్రిజ్‌లో పది నిమిషాలు ఉంచండి. చల్లగా అయిన ఆ టీ బ్యాగ్‌ను కళ్లు మూసుకొని కనురెప్పల మీద పెట్టి, 15 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి. ఆ టీ బ్యాగ్ ద్వారా లభించే చల్లదనంతో కంటిచుట్టూ చర్మమూ విశ్రాంతి పొందుతుంది. చర్మకణాలు చురుగ్గా మారి, కంటిచుట్టూ నలుపుదనమూ తగ్గుతుంది. ఫ్రీజ్ చేసిన స్పూన్‌తో గుడ్మాణింగ్! ఉదయం లేవగానే (రాత్రి ఫ్రీజర్‌లో ఉంచుకున్న) స్పూన్‌తో కళ్ల మీదుగా సున్నాలు చుట్టినట్టు మృదువుగా రాయండి. ఐదు నిమిషాలు ఇలా చేస్తే కళ్ల చుట్టూ చర్మం రిలాక్స్ అవుతుంది. కళ్లు చురుగ్గా అవుతాయి. కళ్ల చుట్టూ ఉండే ఉబ్బు తగ్గుతుంది. మేకప్‌కు ముందు కూడా ఇలా చేయవచ్చు. రెటినాయిడ్ క్రీమ్ రెటినాయిడ్ క్రీమ్ మేని చర్మానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఈ క్రీమ్‌లో ఉండే కొల్లాజెన్ కంటి చుట్టూ ఏర్పడే నల్లని వలయాలను తగ్గిస్తుంది. రోజూ వాడితే చర్మం మృదువుగా, కాంతిమంతంగా అవుతుంది.