నులిమితే వలయాలు | Nulimite networks | Sakshi
Sakshi News home page

నులిమితే వలయాలు

Published Thu, Oct 24 2013 12:21 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM

నులిమితే వలయాలు

నులిమితే వలయాలు

తరచూ కళ్లను నులుముతున్నారా? అయితే వెంటనే ఆపేయండి. ఎందుకంటే నల్లటి వలయాలు ఏర్పడటానికి కళ్లను నులమడమూ ఓ కారణం అవుతుంది. ఇలాంటప్పుడే ఏం చేయాలో తెలుసుకుంటే ఈ సమస్యను సులువుగా అధిగమించవచ్చు. కంటి చుట్టూ నలుపుదనం ఏర్పడకుండానూ చూసుకోవచ్చు.
 
 ఉంగరపు వేలితో మాత్రమే!

 ఐ మేకప్‌ను తొలగించడానికి ఏ వేళ అయినా ఉంగరపు వేలిని మాత్రమే ఉపయోగించడం మేలు. సాధారణంగా ఉంగరపు వేలు బలహీనంగా ఉంటుంది. కన్ను చాలా సున్నితమైనది కాబట్టి, ఉంగరపు వేలిని అంతే మృదువుగా ఉపయోగించడానికి వీలు ఎక్కువ.
 
 చల్లని టీ బ్యాగ్స్!
 
 కప్పు వేడి నీటిలో టీ బ్యాగ్ వేసుకొని సేవించండి. తర్వాత వాడిన ఆ టీ బ్యాగ్‌ను ఫ్రిజ్‌లో పది నిమిషాలు ఉంచండి. చల్లగా అయిన ఆ టీ బ్యాగ్‌ను కళ్లు మూసుకొని కనురెప్పల మీద పెట్టి, 15 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి. ఆ టీ బ్యాగ్ ద్వారా లభించే చల్లదనంతో కంటిచుట్టూ చర్మమూ విశ్రాంతి పొందుతుంది. చర్మకణాలు చురుగ్గా మారి, కంటిచుట్టూ నలుపుదనమూ తగ్గుతుంది.
 
  ఫ్రీజ్ చేసిన స్పూన్‌తో గుడ్మాణింగ్!
 
 ఉదయం లేవగానే (రాత్రి ఫ్రీజర్‌లో ఉంచుకున్న) స్పూన్‌తో కళ్ల మీదుగా సున్నాలు చుట్టినట్టు మృదువుగా రాయండి. ఐదు నిమిషాలు ఇలా చేస్తే కళ్ల చుట్టూ చర్మం రిలాక్స్ అవుతుంది. కళ్లు చురుగ్గా అవుతాయి. కళ్ల చుట్టూ ఉండే ఉబ్బు తగ్గుతుంది. మేకప్‌కు ముందు కూడా ఇలా చేయవచ్చు.
 
 రెటినాయిడ్ క్రీమ్

 
 రెటినాయిడ్ క్రీమ్ మేని చర్మానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఈ క్రీమ్‌లో ఉండే కొల్లాజెన్ కంటి చుట్టూ ఏర్పడే నల్లని వలయాలను తగ్గిస్తుంది. రోజూ వాడితే చర్మం మృదువుగా, కాంతిమంతంగా అవుతుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement