'మోదీజీ డాక్టర్ల బృందాన్ని పంపండి'
జమ్మూకశ్మీర్: కశ్మీర్ లోయలో కొనసాగుతున్న అల్లర్లలో తీవ్రంగా గాయపడిన కొందరు యువకులు తమ కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉందని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. బుధవారం కశ్మీర్ అశాంతిపై.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీలను లక్ష్యంగా చేసుకొని ఆయన వరుస ట్వీట్లు చేశారు.
గాయపడిన యువకులకు వైద్య సేవలు అందించడానికి మోదీ డాక్టర్ల బృందాన్ని పంపించాలని ఆయన కోరారు. కేరళ కొల్లాం ఆలయంలో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు.. మోదీ డాక్టర్ల బృందాన్ని వెంట తీసుకెళ్లిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పుడు కూడా ప్రధాని కంటి డాక్టర్ల బృందాన్ని కశ్మీర్ లోయకు పంపాలని ఆయన కోరారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 1200 మందికి పైగా యువత తీవ్రంగా గాయపడ్డారని వారికి సరైన వైద్యం అందటంలేదని ఒమర్ పేర్కొన్నారు.
Hon @narendramodi ji. After Kerala fire you carried a plane load of burn specialists with you. Please send eye/trauma specialists to Kashmir
— Omar Abdullah (@abdullah_omar) 13 July 2016