కళ్లకు విశ్రాంతినిచ్చే ఐ మసాజర్‌ మాస్క్‌.. ధర ఎంతంటే? | Eye massager mask that relaxes the eyes | Sakshi
Sakshi News home page

కళ్లకు విశ్రాంతినిచ్చే ఐ మసాజర్‌ మాస్క్‌.. ధర ఎంతంటే?

Jul 30 2023 10:05 AM | Updated on Jul 30 2023 10:06 AM

Eye massager mask that relaxes the eyes - Sakshi

గాగుల్స్‌లా ఈ పరికరాన్ని కళ్లకు తొడుక్కుంటే చాలు, అలసిన కళ్లకు విశ్రాంతినిస్తుంది. కనురెప్పలు, కళ్ల చుట్టూ ఉండే కండరాలకు సున్నితంగా మర్దన చేస్తుంది. అమెరికన్‌ కంపెనీ పాట్రియాట్‌ హెల్త్‌ అలయన్స్‌ ఇటీవల ‘ఐ స్పా’ పేరుతో ఈ ఐ మసాజర్‌ మాస్క్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. 

ఇది రీచార్జబుల్‌ బ్యాటరీతో పనిచేస్తుంది. కోరుకున్న విధంగా దీని ఉష్ణోగ్రతలను అడ్జస్ట్‌ చేసుకోవచ్చు. కళ్లకు వెచ్చదనం కావాలనుకుంటే, 43.3 డిగ్రీల నుంచి 45.5 డిగ్రీల సెల్సియస్‌ వరకు, చల్లదనం కావాలనుకుంటే 15 డిగ్రీల నుంచి 18.3 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలను ఎంపిక చేసుకోవచ్చు.

ఇందులో మిస్ట్‌ మసాజ్‌ ఆప్షన్‌ కూడా ఉంది. దీనిని సెట్‌ చేసుకుంటే, కళ్లకు తగినంతగా చల్లని తేమను విడుదల చేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ ద్వారా ఇది పనిచేస్తుంది. దీని ఖరీదు 34.98 డాలర్లు (రూ.2,869) మాత్రమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement