
బాల్యంలో ఒత్తిడి.. మహిళలకు మరింత ముప్పు
న్యూయార్క్: ఒత్తిడి వల్ల వచ్చే అనర్థాల గురించి మనం తరచూ పేపర్లలో చదువుతూనే ఉంటాం. ఇప్పుడు దీనికి సంబంధించిన మరో కొత్త విషయం న్యూయార్క్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. పెద్దయ్యాక ఎదురయ్యే ఒత్తిడి సమస్యల కంటే బాల్యంలో ఎదుర్కొనే ఒత్తిడే మహిళలకు ఎక్కువ హాని చేస్తుందని ఈ పరిశోధనలో రుజువైంది. బాల్యంలో ఒత్తిడికి లోనవడం వల్ల మహిళల్లో బరువు పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు.
ఈ అధ్యయనంలో భాగంగా 2,259 మంది పురుషులు, 1,358 మంది మహిళలపై వారు పరిశోధనలు చేశారు. తల్లిదండ్రుల మధ్య సక్యత, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలకు, బాల్యంలో ఎదురయ్యే ఒత్తిడికి సంబంధం ఉంటుందన్నారు. ఉద్యోగం పోవడం, కావాల్సిన వాళ్లను కోల్పోవడం వంటి కారణాలు పెద్ద వయసు వారిలో ఒత్తిడికి కారణమవుతున్నాయని తెలిపారు.