డెస్క్‌ను డైనింగ్ టేబుల్‌గా మార్చకండి | Change the desk to the dining table | Sakshi
Sakshi News home page

డెస్క్‌ను డైనింగ్ టేబుల్‌గా మార్చకండి

Published Thu, Jan 28 2016 10:56 PM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM

డెస్క్‌ను డైనింగ్ టేబుల్‌గా మార్చకండి

డెస్క్‌ను డైనింగ్ టేబుల్‌గా మార్చకండి

డ్యూటిప్స్

ఉద్యోగ జీవితంలో సమయపాలన ప్రాధాన్యాన్ని గుర్తించండి. పై అధికారులు అప్పగించిన విధులను చిత్తశుద్ధితో పూర్తి చేయండి. పనికి సంబంధించి ఎలాంటి సందేహాలు తలెత్తినా, సీనియర్లను అడగటానికి మొహమాట పడకండి. వీలైనంతగా గడువుకు ముందే పని ముగించడానికి ప్రయత్నించండి.

చేస్తున్న పనిలో మెరుగుదల కోసం, మెలకువలను ఆకళింపు చేసుకోవడం అధ్యయనాన్ని కొనసాగించండి. పని చేస్తున్న చోట ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడటం వంటి చర్యల ద్వారా అనవసరంగా ఇతరుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు చేయకండి. పని ఒత్తిడిలో ఉండి బాగా ఆకలేసినప్పుడు పండో, కాయో... ఏ బిస్కట్లో తింటే పర్లేదు గానీ, అలాగని డెస్క్‌ను డైనింగ్ టేబుల్‌గా మార్చేయకండి.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement