Dining table
-
అగ్గిపెట్టెలో.. డైనింగ్ టేబుల్!
సాక్షి, కోనసీమ జిల్లా: అతను వృత్తిరీత్యా కార్పెంటర్.. తను నేర్చుకున్న కళకు మరింత పదును పెట్టి సూక్ష్మ వస్తువులను తయారు చేస్తున్నాడు. గతంలో అగ్గిపెట్టెలో పట్టేంత చీరను మన చేనేత కళాకారులు తయారు చేశారని విన్నాం. అయితే కోనసీమ జిల్లా రాయవరం గ్రామానికి చెందిన ఉప్పులూరి శ్రీనివాసరావు మాత్రం అగ్గిపెట్టెలో పట్టేంత సూక్ష్మంగా వస్తువులను తయా రుచేసి.. ఔరా అనిపిస్తున్నాడు. మడత మంచం, మడత కుర్చీ, నాలుగు కుర్చీలతో కూడిన డైనింగ్ టేబుల్‌ను అగ్గిపెట్టెలో పట్టేంతగా తయారు చేశాడు. మడత మంచం, మడత కుర్చీని ఒక్క రోజులో తయారుచేయగా, నాలుగు కుర్చీలతో కూడిన డైనింగ్ టేబుల్‌ను మూడు రోజుల్లో తయారు చేసినట్టు శ్రీనివాసరావు చెప్పాడు. ఐదేళ్లుగా పలు రకాల సూక్ష్మ వస్తువులను తయారు చేస్తున్నానని, భవిష్యత్తులో సూక్ష్మ కళతో మరిన్ని వస్తువులు తయారు చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. చదవండి: లవ్‌చాట్.. మేడ్ ఇన్ ఆంధ్రా -
ఇంటిప్స్
►డైనింగ్ టేబుల్ మీద అందంగా ఫ్లవర్‌వాజ్ పెట్టుకుంటారు. అందులోనే నాలుగైదు కరివేపాకు రెమ్మలు కూడా పెడితే ఈగలు ఆ పరిసరాలకు రావు. ►ఇంట్లో ఇండోర్ ప్లాంట్లు పెడితే చూడడానికి అందంగా ఉంటాయి కాని వాటిలో నీరు నిలువ వుంటే అక్కడ దోమలు వ్యాప్తి చెందుతాయి. ఈ సమస్య ముఖ్యంగా శీతాకాలంలో ఎక్కువ. తరిమినా పోవు సరికదా! ఇల్లంతా చుట్టుకుంటాయి. అలాంటప్పుడు పచ్చిబంగాళాదుంపను చక్రాలుగా కోసి కుండీలో పెడితే దోమలన్నీ ఆ ముక్కల మీదకు చేరతాయి. అప్పుడు ఆ ముక్కలను జాగ్రత్తగా తీసి పారేయాలి. -
ఫలక్‌నుమ ప్యాలెస్‌లో ఆత్మీయ విందు
-
ఇంటిప్స్
మంచినీటిని, వెల్కమ్ డ్రింక్స్‌ని సర్వ్ చేసేటప్పుడు ట్రేలో గ్లాసుల కింద డాలే పేపర్ వేస్తే, అది ఒలికిన ద్రవాలను పీల్చుకుంటుంది. అతిథుల దుస్తుల మీద పడకుండా ఉంటుంది. డైనింగ్ టేబుల్ మీద మంచినీటి గ్లాసును గెస్ట్‌కు కుడివైపుగా ఉంచి నీటిని పోయాలి(తర్వాత అతిథి కావాలంటే తనకు సౌకర్యంగా ఉండడానికి ఎడమవైపుకు మార్చుకుంటారు). నీటిగ్లాసు మూడు వంతుల కంటే నింపకూడదు. భోజనం పూర్తయ్యే వరకు మధ్యలో నీటిగ్లాసును గమనిస్తూ ఖాళీ అయిన వెంటనే నింపుతుండాలి. నీటిని పోసేటప్పుడు వాటర్ జగ్గు కింద నాప్కిన్ ఉంచితే నీళ్లు జగ్గు అంచు నుంచి కిందకు కారవు. ఒకరికి నీటిని సర్వ్ చేసిన తర్వాత మరొకరి కోసం హోస్ట్ వారి కుడి పక్కకు వెళ్లాలి. ముందు ఉన్న చోటనే ఉండి మనిషి మీద నుంచి వంగి సర్వ్ చేయకూడదు. కోక్, కాఫీ, టీ, హార్లిక్స్ వంటి నాన్ఆల్కహాలిక్ బేవరేజ్ అయినా కుడివైపు ఉండి సర్వ్ చేయాలి. ఆల్కహాలిక్ బేవరేజ్‌లను ఎడమవైపు సర్వ్ చేయాలి. -
వంటిల్లు + డైనింగ్ టేబుల్ + రిఫ్రిజిరేటర్ = సేపియన్ స్టోన్!
ఒకే దెబ్బకి రెండు పిట్టలు అని విన్నాం కానీ ఒకే దెబ్బకి మూడు పిట్టలు అంటే! ఊహించడానికి భలే ఉంది కదా.. ఈ ఫొటోలో కనిపిస్తున్న డైనింగ్ టేబుల్ దీనికి చక్కని ఉదాహరణ. ఎందుకంటే ఈ డైనింగ్ టేబుల్ మీదే వంటలు చే యొచ్చు.. ఆహార పదార్థాలను వేడిగానూ, చల్లగానూ ఉండేలా చేయొచ్చు. ఏంటీ నమ్మలేక పోతున్నారా అయితే ఈ ఫొటోలో ఎడమవైపు నిలుచున్న వ్యక్తి ఏం చేస్తున్నాడో ఒకసారి చెప్పండి. ఏముందీ అందరికీ భోజనం వ డ్డిస్తున్నాడు అని అనుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే అతను వంట చేస్తున్నాడు. ఇక భోజనం చేస్తున్న వారి పక్కనే ఓ షాంపెయిన్ బాటిల్ కనిపిస్తోందా? అది ఫ్రిజ్‌లో ఉన్నట్లే చల్లగా ఉంది. ఒకవైపు వేడి, మరోవైపు చల్లదనమా? ఇదెలా సాధ్యం అనుకోకండి. సేపియన్ స్టోన్ స్మార్ట్ స్లాబ్ ప్రత్యేకత అదే మరి. ఈ టేబుల్‌పైన ఉపయోగించిన స్లాబ్‌ను పింగాణి వంటి పదార్థంతో తయారు చేశారు. స్లాబ్ అడుగు భాగంలో నిర్ణీత ప్రదేశాల్లో ఇండక్షన్ కుక్కర్లు ఏర్పాటు చేశారు. వీటితోపాటు అక్కడక్కడా చల్లదనాన్ని ఇచ్చేందుకు, ప్లేట్స్ ఉంచే చోటులో ఆహారాన్ని వెచ్చగా (గరిష్టంగా 42.5 డిగ్రీ సెల్సియస్) ఉంచేందుకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయి. ప్రత్యేకమైన పింగాణీ కాబట్టి ఏ ప్రాంతంలోని ఉష్ణోగ్రత అక్కడే ఉంటుందన్నమాట. స్వీడన్, జర్మనీలకు చెందిన డిజైనర్ సంస్థ క్రామ్/వైస్హార్ దీన్ని అభివృద్ధి చేసింది. -
డెస్క్‌ను డైనింగ్ టేబుల్‌గా మార్చకండి
డ్యూటిప్స్ ఉద్యోగ జీవితంలో సమయపాలన ప్రాధాన్యాన్ని గుర్తించండి. పై అధికారులు అప్పగించిన విధులను చిత్తశుద్ధితో పూర్తి చేయండి. పనికి సంబంధించి ఎలాంటి సందేహాలు తలెత్తినా, సీనియర్లను అడగటానికి మొహమాట పడకండి. వీలైనంతగా గడువుకు ముందే పని ముగించడానికి ప్రయత్నించండి. చేస్తున్న పనిలో మెరుగుదల కోసం, మెలకువలను ఆకళింపు చేసుకోవడం అధ్యయనాన్ని కొనసాగించండి. పని చేస్తున్న చోట ఫోన్లో బిగ్గరగా మాట్లాడటం వంటి చర్యల ద్వారా అనవసరంగా ఇతరుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు చేయకండి. పని ఒత్తిడిలో ఉండి బాగా ఆకలేసినప్పుడు పండో, కాయో... ఏ బిస్కట్లో తింటే పర్లేదు గానీ, అలాగని డెస్క్‌ను డైనింగ్ టేబుల్‌గా మార్చేయకండి. -
ఫ్యాన్ ఎక్కడుంటుందో?
సోఫా ఎక్కడుంది? ‘అదిగో సీలింగ్‌పై’ ‘డైనింగ్ టేబుల్ ఎక్కడ ఉంది?’ ‘అది కూడా సీలింగ్పైనే’ డైనింగ్ టేబుల్, సోఫా సీలింగ్‌పై ఉంటాయా... అదెలా?! ఎలాగో తెలియాలంటే చైనా వెళ్లాల్సిందే. టూరిజానికి కావలసింది ఏమిటి? ఆకర్షణ. అదెక్కడి నుంచి వస్తుంది? భిన్నత్వం నుంచి. అవును. ఆ భిన్నత్వమే చైనాలోని ‘ఫోక్ పెయింటింగ్ విలేజీ’ ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకోవడానికి కారణం. జిన్షాన్ జిల్లాలో ఉన్న ఫెన్‌జియింగ్ నగరాన్ని చూస్తే ప్రాచీన నాగరికతను చూసిన అనుభూతి కలుగుతుంది. చరిత్రాత్మకమైన మూడు రాతి వంతెనలు ఇక్కడ ఉన్నాయి. అందుకే దానికి ‘ప్రాచీన నీటి నగరం’ అని కూడా పేరు. ప్రాచీన జిన్షాన్ చిత్రకళ ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందడం, ప్రముఖ చిత్రకారుడు చెంగ్ షిఫా పుట్టిన ప్రాంతం కావడంతో ఫెన్‌జియింగ్ కళాకారులను ఎంతో ఆకర్షిస్తుంటుంది. ఒకవైపు ప్రఖాత్య చిత్రకళా వెలుగుతో ప్రకాశించే ప్రాంతాలు, మరోవైపు చారిత్రక వైభవాన్ని కళ్లకు కట్టే ప్రాచీన నిర్మాణాలు. ఇలా రెండు రకాల విశేషాలతో ఫెన్‌జియింగ్ అందరినీ అలరిస్తుంది. మరి పర్యాటకులను ఆక ర్షించడానికి ఇది మాత్రమే సరిపోదు అను కున్నారో ఏమో... ఫెన్జియింగ్లో ‘చైనా ఫోక్ ఆర్ట్ విలేజ్’ను నిర్మించారు. ‘మడిసన్నాక కాస్త కళా పోషణ ఉండాలి’ అనుకునేవాళ్లకి ఈ విలేజ్ కన్నులకు పండుగను తెస్తుంది. ఈ విలేజ్‌లో ఎక్కడ చూసినా జానపద చిత్రాలు కనిపించి మురిపిస్తుం టాయి. ఇక్కడ అంతకంటే అతి పెద్ద ఆకర్షణ... తలకిందుల ఇళ్లు. మొత్తం ఇంటిని తిప్పి పెట్టినట్టుగా కనిపించే ఈ గృహాల వైభవాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవు. నిజానికి తలకిందుల ఇళ్లు కొత్తేమీ కాదు. రష్యా, జర్మనీ, ఆస్ట్రియాల్లో కూడా ఇలాంటి చిత్రమైన నిర్మాణాలు జరిగాయి. అయితే వాటి కంటే ఎక్కువగా ఈ చైనా ఇళ్లకు ప్రాచుర్యం లభించింది. కారణం... ఇళ్లతో పాటు ఇంటీరియర్ డిజైన్ కూడా తలకిందుల థీమ్‌ను ఫాలో కావడం!‘‘మొదటిసారి ఈ తలకిందుల ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు కళ్లకేదో మాయపొర కమ్మినట్లు అనిపించింది. ఒక్కసారిగా భూమి గిర్రున తిరిగినట్టని పించింది. కాళ్లు ఇంటి పై కప్పుపై ఉండి సీలింగ్ ఫ్యాన్ ఫ్లోర్‌పై ఉండడం ఎంత విచిత్రం!’’ అంటున్నాడు ఆస్ట్రేలియాకు చెందిన ఒక టూరిస్టు. ‘‘ప్రపంచం తలకిందులైంది అనే మాట వింటుంటాం. ఇక్కడి ఇండ్లలోకి అడుగు పెట్టినప్పుడు నాకు అలాగే అనిపించింది. మొదట్లో కాస్త కళ్లు తిరిగి నట్లు కూడా అనిపించింది’’ అంటాడు జపాన్ టూరిస్ట్ అచిహిరో. ఈ తలకిందుల ఇండ్లతో పాటు ఆర్ట్ విలేజ్‌లోని కంట్రీ సైడ్ కార్నివాల్, చైనా ఫోక్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ మొదలైనవి పర్యాటకులను బాగా అట్రాక్ట్ చేస్తుంటాయి. అనుకరణ అనే సరికొత్త ఎత్తుగడతో ప్రస్తుత చైనా పాలకులు టూరిజాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. అయితే అనుకరణ మాత్రమే దానికదే ఆకర్షణగా నిలవదు. ఫెన్‌జియింగ్ నగరానికి ఉన్న ప్రాచీన చారిత్రక వైభవం ఈ తలకిందుల ఇండ్లకు ప్రాచుర్యాన్ని కలిగిస్తోంది. ‘పోస్ట్ మోడ్రన్ టెక్నిక్‌తో కట్టిన నిర్మాణాలు ఇవి’ అంటారు ఆర్కిటెక్చర్ గురించి తెలిసినవాళ్లు. ‘రివర్స్ సైకాలజీ ఆధారంగా నిర్మించిన నిర్మాణాలు ఇవి’ అంటారు మానసిక శాస్త్రంతో పరిచయం ఉన్నవాళ్లు. ఏ రంగం వాళ్లు ఎలా విశ్లేషించినా, సామాన్యులు మాత్రం ఈ తలకిందుల ఇళ్లలోకి అడుగు పెట్టినప్పుడు పొందే ఆనందం అంతా ఇంతా కాదు. ఆ ఆనందమే ఈ ఆర్ట్ విలేజ్‌ను చైనాలోని టాప్ టూరిస్ట్ అట్రాక్షన్స లిస్టులోకి చేర్చింది. -
పెట్టా... పుంజూ... మా లాంటి ఫ్యామిలీయే!
ఉత్త(మ)పురుష ఇప్పుడే మా శ్రీవారితో గొడవేసుకొని వచ్చి ఇంటి పెరట్లో నించున్నాను. పొదుపు చేసి ఉంచిన కొద్దిపాటి డబ్బుతో డైనింగ్ టేబుల్ కొందామని నేనన్నాను. కర్వ్ ఎల్ఈడీ అని ఏదో కొత్తగా వచ్చిందట. తిన్నగా ఉండక ఒంపు తిరిగి ఉంటుందట. అచ్చం ఆయన ఆలోచనల్లాగే. ‘ఎలాగూ ఇంట్లో ఏదో టీవీ ఉండనే ఉంది కదా’ అని నేనంటే... ‘మోడ్రన్ టెక్నాలజీని అందిపుచ్చుకునే తెలివితేటలు లేవు. ఎప్పుడూ పాత ఆలోచనలే’ అంటూ వెక్కిరించడంతో మనసు పాడైంది. దాంతో కాసేపు పెరట్లో ఉన్న జీవజాలాన్ని చూస్తూ నిల్చుంటేనైనా ప్రశాంతత ఏర్పడుతుందని అనిపించింది. పెరట్లో మా కోడిపెట్ట చుట్టూ కొన్ని బుజ్జి బుజ్జి కోడిపిల్లలు కీచుకీచుమంటూ తిరుగుతున్నాయి. మా పెట్ట ఏదో బెదురుగా చూస్తున్నట్లు ఉంటుంది. కళ్లన్నీ పిల్లలపైనే పెట్టుకుని ఉంటుంది. వెళ్తూ వెళ్తూ... ఎక్కడో కెక్కరించి కాస్త తవ్వగానే... పిల్లలన్నీ అక్కడికి చేరి తమ చిన్నారి ముక్కుల్తో పొడుస్తూ పొడుస్తూ ఉంటాయి. తిండి వెతకాలంటే కాళ్లతో ఇలా కెక్కరించాల్రా పిచ్చినాన్నల్లారా అంటున్నట్లుగా పెట్ట తిరుగుతూ ఉంటుందా... పుంజు ఇదేమీ పట్టనట్టు ధీమాగా ఉంటుంది. అదెప్పుడూ పిల్లలనేసుకుని తిరగ్గా నేను చూళ్లేదు. పైగా ఒక కాలూ, ఒక రెక్కా బారజాపి ఒళ్లు విరుచుకోవడం... ఏ పెంటకుప్పనో, ఏ గొడ్ల కొట్టం మీదికో ఎక్కి ఓ కూత కూసేసి... ఇక ఆ రోజుకు తన పనైపోయింది అన్నట్టుగా వ్యవహరించడం పుంజు నైజంలా అనిపించింది. దేవుడా... పెరట్లోకి తీసుకొచ్చావు. ఇక్కడా నా ఇంటి దృశ్యాన్నే మళ్లీ పుంజూ-పెట్టల రూపంలో చూపించాలా? మా అత్తగారికీ, మామగారికీ కాళ్లు అంతగా ఒంగవు. వయసైపోతోంది కదా... నేల మీద కూర్చుని తినాలంటే గతంలోలా కుదరడం లేదు. ఎంతో కష్టం మీద కూర్చుని... ఆపైన తినడం పూర్తయ్యాక లేవాలంటే మరెంతగానో కష్టపడుతున్నారు. ఇక మా పిల్లలిద్దరికీ డైనింగ్ టేబుల్ మీద కూర్చోని తినడం సరదా. అందుకే ఉన్న ఆ కాసిన్ని డబ్బుల్నీ డైనింగ్ టేబుల్ అనే లేని ఐటమ్ కోసం వెచ్చిస్తే అందరూ సుఖంగా ఉంటారూ... తింటారు. కానీ కొత్త టీవీ తెచ్చినా పాత దృశ్యమే కదా. అయినా మా ఆయన పిచ్చిగానీ టీవీ మారగానే ప్రోగ్రాములు మారతాయా? చెబితే వినరు కదా. పెరట్లోని పుంజుకూ మా ఆయనకూ అట్టే తేడా లేదు. నోటికి ఏదొస్తే అది కూయడమే. పైగా ఆ కూత జాతినంతా ఉత్తేజపరిచే చైతన్య నినాదమని పోజొకటి. పుంజు కూడా బహుశా... ‘పనీ పాటా లేకుండా పెట్ట ఎప్పుడూ కాళ్లతో కెక్కరించి కిందనున్న మట్టిని కెలుకుతూ ఉంటుంది. అదలా మట్టిని కెలకగానే కోడిపిల్లలన్నీ అలాగే చేస్తాయి. నోటితో అవీ ఇవీ పడతాయి. అంతే... పాపం పెట్టదెప్పుడూ డైనింగ్టేబుల్ బుద్ధే. ఈ పెట్టలంతా ఇంతే!’అనుకుంటూ పెంటకుప్పనెక్కి కూస్తుంటుందేమో పెట్టను వెక్కిరిస్తూ. అందుకే మా శ్రీవారిని ఏమీ అనలేక పుంజును తిట్టుకుంటూ ఓ మాట అనుకున్నా... పెట్ట అంటే పెంపకాలకు... పుంజు అంటే మా ఆయన లాగే చేతలకు ఏ మాత్రం కాదు... అడ్డదిడ్డమైన ఆ పెంటకుప్పలెక్కి గొప్పల కోతలకూ... కారుకూతలకే అని. - వై!