
సాక్షి, కోనసీమ జిల్లా: అతను వృత్తిరీత్యా కార్పెంటర్.. తను నేర్చుకున్న కళకు మరింత పదును పెట్టి సూక్ష్మ వస్తువులను తయారు చేస్తున్నాడు. గతంలో అగ్గిపెట్టెలో పట్టేంత చీరను మన చేనేత కళాకారులు తయారు చేశారని విన్నాం. అయితే కోనసీమ జిల్లా రాయవరం గ్రామానికి చెందిన ఉప్పులూరి శ్రీనివాసరావు మాత్రం అగ్గిపెట్టెలో పట్టేంత సూక్ష్మంగా వస్తువులను తయా రుచేసి.. ఔరా అనిపిస్తున్నాడు.
మడత మంచం, మడత కుర్చీ, నాలుగు కుర్చీలతో కూడిన డైనింగ్ టేబుల్‌ను అగ్గిపెట్టెలో పట్టేంతగా తయారు చేశాడు. మడత మంచం, మడత కుర్చీని ఒక్క రోజులో తయారుచేయగా, నాలుగు కుర్చీలతో కూడిన డైనింగ్ టేబుల్‌ను మూడు రోజుల్లో తయారు చేసినట్టు శ్రీనివాసరావు చెప్పాడు. ఐదేళ్లుగా పలు రకాల సూక్ష్మ వస్తువులను తయారు చేస్తున్నానని, భవిష్యత్తులో సూక్ష్మ కళతో మరిన్ని వస్తువులు తయారు చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు.
చదవండి: లవ్‌చాట్.. మేడ్ ఇన్ ఆంధ్రా
Comments
Please login to add a commentAdd a comment