ఇంటిప్స్
మంచినీటిని, వెల్‌కమ్ డ్రింక్స్‌ని సర్వ్ చేసేటప్పుడు ట్రేలో గ్లాసుల కింద డాలే పేపర్ వేస్తే, అది ఒలికిన ద్రవాలను పీల్చుకుంటుంది. అతిథుల దుస్తుల మీద పడకుండా ఉంటుంది. డైనింగ్ టేబుల్ మీద మంచినీటి గ్లాసును గెస్ట్‌కు కుడివైపుగా ఉంచి నీటిని పోయాలి(తర్వాత అతిథి కావాలంటే తనకు సౌకర్యంగా ఉండడానికి ఎడమవైపుకు మార్చుకుంటారు). నీటిగ్లాసు మూడు వంతుల కంటే నింపకూడదు. భోజనం పూర్తయ్యే వరకు మధ్యలో నీటిగ్లాసును గమనిస్తూ ఖాళీ అయిన వెంటనే నింపుతుండాలి.
నీటిని పోసేటప్పుడు వాటర్ జగ్గు కింద నాప్‌కిన్ ఉంచితే నీళ్లు జగ్గు అంచు నుంచి కిందకు కారవు. ఒకరికి నీటిని సర్వ్ చేసిన తర్వాత మరొకరి కోసం హోస్ట్ వారి కుడి పక్కకు వెళ్లాలి. ముందు ఉన్న చోటనే ఉండి మనిషి మీద నుంచి వంగి సర్వ్ చేయకూడదు.
కోక్, కాఫీ, టీ, హార్లిక్స్ వంటి నాన్‌ఆల్కహాలిక్ బేవరేజ్ అయినా కుడివైపు ఉండి సర్వ్ చేయాలి. ఆల్కహాలిక్ బేవరేజ్‌లను ఎడమవైపు సర్వ్ చేయాలి.