మార్కెట్లోకి చవకైన శానిటరీ నాప్కిన్‌ | Inexpensive sanitary napkin into the market | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి చవకైన శానిటరీ నాప్కిన్‌

Published Tue, Jun 5 2018 1:23 AM | Last Updated on Tue, Jun 5 2018 1:23 AM

Inexpensive sanitary napkin into the market - Sakshi

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియో జన (పీఎంబీజేపీ) పథకంలో భాగంగా రూ. 2.50కే శానిటరీ నాప్కిన్‌లు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం సోమవారం ప్రారంభించింది. దేశంలోని 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 3,600కు పైగా ఉన్న జన ఔషధి కేంద్రాల్లో ఇవి అందుబాటులో ఉంటాయి.

సులువుగా మట్టిలో కలిసిపోయేలా వీటిని రూపొందించారు. మార్కెట్‌లోని ఇతర ప్యాడ్‌లతో పోల్చుకుంటే ఇవి చాలా తక్కువ ధరకు లభ్యమవుతున్నాయని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్సుఖ్‌ ఎల్‌ మాండవీయ చెప్పారు. మిగతా కంపెనీలూ ధరలు తగ్గించే అవకాశముందని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement