
సాక్షి, సిటీబ్యూరో: శిశుర్వేత్తి, పశుర్వేత్తి వేత్తిగాన రసం ఫణిః అనే విశ్వాసాన్ని అనుసరిస్తూ. వంధ్యత్వానికి చికిత్సలో సంగీతాన్ని మిళితం చేస్తూ ‘మ్యూజిక్ ఆఫ్ హోప్’ పేరిట ఓ ట్యూన్‌ను నగరానికి చెందిన ఫెర్టీ–9 ఫెర్టిలిటీ సెంటర్ రూపొందించింది. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవ వేడుకల ముగింపును పురస్కరించుకుని దీనిని విడుదల చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
మానసిక ఆరోగ్యంపై సంగీతం గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని, ఒత్తిడి, ఆందోళనను తగ్గించి ప్రశాంతత, విశ్రాంతి భావాన్ని కలిగిస్తుందని నిరూపితమైన నేపథ్యంలో ఈ ట్యూన్ ప్రత్యేకంగా తయారు చేశామన్నారు. అదే విధంగా ‘టుగెదర్ ఇన్ ఐవీఎఫ్’ పేరిట వంధ్యత్వానికి సంబంధించిన అపోహలను పోగొట్టడం లక్ష్యంగా నిర్వహించిన ప్రచారంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 15 వేర్వేరు ప్రదేశాల్లో వీధి నాటకాలు లేదా నుక్కడ్ నాటకాలను ప్రదర్శించామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment