Hopes alive
-
ఆప్ ఆశలపై ఐటీ దెబ్బ!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ ఆశలకు ఎలాగైనా గండి కొట్టేందుకు కృతనిశ్చయంతో ఉన్న మోదీ సర్కారు ప్రచారం చివరి దశకు చేరిన వేళ తురుపుముక్కను గురి చూసి మరీ వదిలింది. రాజధానిలో మూడొంతుల దాకా ఉన్న వేతన జీవులను ఆకట్టుకునేలా ‘ఐటీ మినహాయింపుల’ అస్త్రాన్ని ప్రయోగించింది! వారికి ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.12 లక్షలకు పెంచింది. శనివారం నాటి కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు చేసిన ప్రకటన ఆప్ శిబిరంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది నిజంగా మోదీ మాస్టర్‌స్ట్రోకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో మూడు రోజుల్లో (బుధవారం) జరగనున్న ఢిల్లీ ఎన్నికల పోలింగ్‌లో ఐటీ మినహాయింపు ప్రభావం గట్టిగానే ఉండగలదని వారంటున్నారు. మాస్టర్ స్ట్రోక్! ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య ప్రతిష్టాత్మక పోరుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వేదికగా మారాయి. పాతికేళ్ల తర్వాత ఎలాగైనా గెలుపు ముఖం చూసేందుకు కాషాయ పార్టీ, వరుసగా మూడో విజయం కోసం ఆప్ ఇప్పటికే ఓటర్లకు లెక్కలేనన్ని వాగ్దానాలు చేశాయి. రాజధాని జనాభాలో 97 శాతం నగర, పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. వారిలోనూ మధ్య తరగతి వర్గం ఏకంగా 67 శాతానికి పైగా ఉంది. దాంతో వాళ్లను ఆకట్టుకోవడానికి రెండు పారీ్టలూ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. పదేళ్లపాటు సామాన్యులు, అల్పాదాయ వర్గాలే లక్ష్యంగా సంక్షేమ, అభవృద్ధి పథకాలు అమలు చేస్తూ వచ్చిన ఆప్ ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత, కేజ్రీవాల్‌పై అవినీతి మచ్చ తదితరాలతో సతమతమవుతోంది. ఈ ప్రతికూలతలను అధిగమించేందుకు మిడిల్‌క్లాస్‌పై గట్టిగా దృష్టి సారించింది. తనమేనిఫెస్టోను కూడా మధ్యతరగతి పేరిటే విడుదల చేసింది. ఆ సందర్భంగా మాట్లాడిన కేజ్రీవాల్, ఐటీ మినహాయింపు పరిధిని రూ.10 లక్షలకు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తద్వారా వేతన జీవులను ఆకట్టుకోవచ్చని భావించారు. కానీ ఆ పరిధిని ఏకంగా రూ.12 లక్షలకు పెంచుతూ మోదీ సర్కారు అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్ కంటే రెండాకులు ఎక్కువే చదివానని నిరూపించుకుంది. ఢిల్లీ ఓటర్లలో వేతన జీవులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వారందరినీ ఇది బాగా ప్రభావితం చేసేలా కనిపిస్తోంది. దీనికి తోడు బీజేపీ వ్యతిరేక ఓటు ఈసారి ఆప్‌కు బదులు కాంగ్రెస్‌కు పడొచ్చన్న విశ్లేషణలు కేజ్రీవాల్ పార్టీని మరింతగా ఆందోళనకు గురి చేస్తున్నాయి. బీజేపీతో హోరాహోరీ పోరు జరిగే నియోజకవర్గాల్లో ఇది తీవ్రంగా దెబ్బ తీయవచ్చని ఆప్ భావిస్తోంది. గత ఎన్నికల్లో 15కు పైగా స్థానాల్లో 10 వేల లోపు మెజారిటీ నమోదవడం గమనార్హం. కేజ్రీవాల్‌కూ ఎదురీతే! ఆప్‌తో పాటు దాని సారథి కేజ్రీవాల్ కూడా కష్టకాలంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆయన కంచుకోట అయిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఈసారి ఎదురీత తప్పేలా లేదు. ఈ స్థానం పరిధిలో ప్రభుత్వోద్యోగులు, గ్రేడ్ ఏ, బీ అధికారులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. తాజా బడ్జెట్లో ప్రకటించిన ఐటీ వరంతో వీరిలో అత్యధికులు లబ్ధి పొందనున్నారు. అవినీతి ఆరోపణలు, అధికార నివాసం కోసం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని మంచినీళ్లలా వెచ్చించారంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఇప్పటికే కేజ్రీవాల్‌కు తల బొప్పి కట్టిస్తున్నాయి. వీటికి తోడు మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తానన్న హామీని నిలబెట్టుకోలేదంటూ ఓటర్లు పెదవి విరుస్తున్నారు. 2013లో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ఏకంగా నాటి సీఎం అయిన కాంగ్రెస్ సీనియర్ షీలా దీక్షిత్‌నే మట్టికరిపించారు. నాటినుంచీ అక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం బీజేపీ నుంచి సాహెబ్‌సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ నుంచి షీలా కుమారుడు సందీప్ దీక్షిత్ రూపంలో ఏకంగా ఇద్దరు మాజీ సీఎంల వారసులు ఆయనకు గట్టి సవాలు విసురుతున్నారు. కేజ్రీ ఓట్లకు సందీప్ భారీగా గండి కొడతారని, ఇది అంతిమంగా పర్వేశ్‌కు లాభిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మానసిక ఆరోగ్యంపై సంగీత ప్రభావం.. ‘మ్యూజిక్ ఆఫ్ హోప్’..!
సాక్షి, సిటీబ్యూరో: శిశుర్వేత్తి, పశుర్వేత్తి వేత్తిగాన రసం ఫణిః అనే విశ్వాసాన్ని అనుసరిస్తూ. వంధ్యత్వానికి చికిత్సలో సంగీతాన్ని మిళితం చేస్తూ ‘మ్యూజిక్ ఆఫ్ హోప్’ పేరిట ఓ ట్యూన్‌ను నగరానికి చెందిన ఫెర్టీ–9 ఫెర్టిలిటీ సెంటర్ రూపొందించింది. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవ వేడుకల ముగింపును పురస్కరించుకుని దీనిని విడుదల చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.మానసిక ఆరోగ్యంపై సంగీతం గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని, ఒత్తిడి, ఆందోళనను తగ్గించి ప్రశాంతత, విశ్రాంతి భావాన్ని కలిగిస్తుందని నిరూపితమైన నేపథ్యంలో ఈ ట్యూన్ ప్రత్యేకంగా తయారు చేశామన్నారు. అదే విధంగా ‘టుగెదర్ ఇన్ ఐవీఎఫ్’ పేరిట వంధ్యత్వానికి సంబంధించిన అపోహలను పోగొట్టడం లక్ష్యంగా నిర్వహించిన ప్రచారంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 15 వేర్వేరు ప్రదేశాల్లో వీధి నాటకాలు లేదా నుక్కడ్ నాటకాలను ప్రదర్శించామని వివరించారు. -
ఆశలకు జీవం
కృష్ణమ్మ పరవళ్లు, శ్రీశైలం కళకళ ఊరిస్తున్న తుంగభద్ర రైతుల్లో చిగురిస్తున్న ఆశలు పాలకులు చిత్తశుద్ధి చూపితేనే ఫలితం అనంతపురం సెంట్రల్ : తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ఆయకట్టుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మొన్నటి వరకూ జలాశయాలు వెలవెలబోవడంతో ఆయకట్టు కింద సాగు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఇటీవల జరిగిన సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో కేవలం తాగునీటికే కేటాయింపులు చేశారు. నీటిలభ్యతను బట్టి ఆయకట్టు ఇవ్వాలని తీర్మానించారు. అయితే.. వారం, పది రోజుల వ్యవధిలో పరిస్థితి తారుమారైంది. శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. తుంగభద్ర డ్యాంకు కూడా ఇన్‌ఫ్లో పెరిగింది. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. ఎగువన ఉన్న ప్రాజెక్టులు పూర్తి నిండిపోయాయి. కిందకు భారీగా నీటిని వదులుతున్నారు. డ్యాంలోకి 1.47 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీనివల్ల జలాశయంలో అమాంతం నీటిమట్టం పెరగడంతో హంద్రీ–నీవా కాలువకు మూడు రోజుల నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. ప్రస్తుతం మూడు పంపుల ద్వారా 1,014 క్యూసెక్కులు పంపింగ్ చేస్తున్నారు. ఈ నెల 15లోగా కృష్ణాజలాలు జిల్లాలోని బెళుగుప్ప మండలంలో ఉన్న జీడిపల్లి జలాశయానికి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది శ్రీశైలానికి నీటిలభ్యత ఆశాజనకంగా ఉంటుందని ఇరిగేషన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువ నీటిని జిల్లాకు తీసుకురావడంపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాల్సి ఉంది. గతేడాది నీటిని తీసుకురావడంలో టీడీపీ ప్రజాప్రతినిధులు ఘోరంగా విఫలమయ్యారు. శ్రీశైలంలో నీటిమట్టం పడిపోతున్నా తెలంగాణప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కొనసాగించడంతో నెల రోజుల ముందే హంద్రీ–నీవాకు నీటిని నిలుపుదల చేశారు. దీనివల్ల ఎనిమిది టీఎంసీలు మాత్రమే జిల్లాకు వచ్చాయి. 2013–14లో మాత్రం దాదాపు 14 టీఎంసీలు వచ్చాయి. శ్రీశైలం నుంచి హంద్రీ–నీవాకు 40 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఇందులో మెజార్టీ శాతం నీటిని దక్కించుకుంటే జిల్లా రైతులు ఇబ్బందుల నుంచి గట్టెక్కే అవకాశాలు ఉంటాయి. హంద్రీ–నీవా మొదటిదశ ఆయకట్టుకు ఈ ఏడాది నుంచి సాగునీరు ఇవ్వాలని వైఎస్సార్సీపీ, రైతుసంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 80 వేల ఎకరాల ఆయకట్టుకు ఈసారి నీరివ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. తుంగభద్ర కళకళ తుంగభద్ర జలాశయానికి వారం రోజులుగా ఇన్‌ఫ్లో పెరడంతో ఆశలు రేకెత్తుతున్నాయి. పదిరోజుల క్రితం కేవలం నాలుగు వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ప్రస్తుతం 9,673 క్యూసెక్కులకు పెరిగింది. అయితే.. గత ఏడాదితో పోలిస్తే నీటిమట్టం మాత్రం దారుణంగా ఉంది. గతేడాది ఇదే సమయంలో 64.724 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. ప్రస్తుతం 39.757 టీఎంసీలు మాత్రమే ఉంది. అయితే.. తుంగభద్రకు ఫిబ్రవరి వరకు కూడా ఇన్‌ఫ్లో ఉంటుందని, ఆలస్యంగానైనా ఎక్కువ నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. 16 నుంచి ఆయకట్టుకు నీరు ! హెచ్చెల్సీ కింద ఉన్న గుంతకల్లు బ్రాంచ్‌కెనాల్ (జీబీసీ), హైలెవల్ మెయిన్ కెనాల్æ(హెచ్‌ఎల్‌ఎంసీ) ఆయకట్టుకు ఈ నెల 16 నుంచి నీటిని విడుదల చేయాలని హెచ్చెల్సీ అధికారులు భావిస్తున్నారు. ఈ రెండు ఉప కాలువలు నేరుగా ప్రధాన కాలువపై ఆధారపడడంతో ముందుగా వీటికి నీటిని విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అలాగే హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు ఈ నెల 15 నాటికి జిల్లాకు చేరుకుంటాయి. జీడిపల్లి జలాశయం నిండిన తర్వాత పీఏబీఆర్‌లోకి వచ్చి పడతాయి. పీఏబీఆర్‌కు రావడానికి మరో 20 రోజులు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుంగభద్రలోకి ఆశాజనకంగా నీరొస్తే మిడ్‌పెన్నార్ సౌత్, నార్త్ కెనాల్, ఇతర కాలువల కింద ఆయకట్టుకు నీరివ్వాలని భావిస్తున్నారు.