మైగ్రేన్ తలనొప్పి.. అశ్రద్ధ చేయొద్దు..
తరచుగా తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు. రక్తపోటు, మెదడులో కణితులు, రక్త ప్రసరణలో మార్పులు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి వల్ల తల నొప్పి వచ్చే అవకాశం ఉంది. మైగ్రేన్ స్త్రీలలో అధికంగా కనిపిస్తుంది. నొప్పి చాలా వరకు తలకు ఓ పక్క భాగంలో ఉంటుంది. మైగ్రేన్ రావడానికి కారణం... తలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనై వాయడం.
పార్శ్వపు తలనొప్పికి కారణాలు:
పార్శ్వపు తలనొప్పి ముఖ్యకారణం మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి.
కొంత మందికి బయటకు వెళ్లినప్పుడు, సూర్యరశ్మి ద్వారా తలనొప్పి వస్తుంది.
అధికంగా ప్రయాణాలు చేయడం.
స్త్రీలలో హార్మోన్ల సమస్యలు ఏర్పడినప్పుడు, రుతుచక్రం ముందుగా గానీ, తరువాత గానీ వచ్చే అవకాశం ఉంటుంది. గర్భధారణ సమయం, రుతుచక్రం ఆగిపోయినప్పుడు ఈ సమస్య తీవ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది.
ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ లాంటి కొన్ని రకాల మందులు వాడటం వల్ల ఎక్కువగా వస్తుంది.
మైగ్రేన్ దశలు - లక్షణాలు: చాలా వరకు మైగ్రేన్ దానంతటదే తగ్గిపోతుంది. సాధారణంగా 24 గంటల నుంచి 72 గంటలు కూడా పట్టవచ్చు.
ఒకవేళ నొప్పి 72 గంటలు ఉంటే స్టేటస్ మైగ్రేన్ అంటారు.
మైగ్రేన్ నొప్పి 4 దశలలో సాగుతుంది.
పోడ్రోమ్ ఫేజ్: ఇది నొప్పికి ముందు 2 గంటల నుంచి 2 రోజుల ముందు వరకు జరిగే ప్రక్రియల సమూహం. ఈ దశలో చిరాకు, మానసిక ఆందోళన, డిప్రేషన్, ఆలోచనలో మార్పులు రావడం, వాసన, వెలుతురు పడకపోవడం, మెడనొప్పి ఉంటాయి.
ఆరాఫేజ్: ఈ దశ నొప్పి మొదలయ్యే కొద్ది నిమిషాల ముందు ఉంటుంది. చూపు కాస్త మందగించినట్లుండటం, జిగ్‌జాగ్ లైన్‌స రావడం, తలలో సూదులతో గుచ్చినట్లు ఉండడం, మాటలు తడబడడం, కాళ్లలో నీరసం ఉంటాయి.
నొప్పి దశ: ఈ నొప్పి దశ 2 గంటల నుంచి 3 రోజుల వరకు ఉండవచ్చు. ఈ దశలో వాంతులు ఉంటాయి.
పోస్ట్‌డ్రోమ్ ఫేజ్: నొప్పి తగ్గిన తరువాత కొద్ది రోజుల వరకు తల భారంగా ఉండటం, నీరసంగా ఉండటం, శ్రద్ధ లేకుండా ఉండటం
జరుగుతుంది.
వ్యాధి నిర్ధారణ:
రక్త పరీక్షలు - సీబీపీ, ఈఎస్‌ఆర్
రక్తపోటును గమనించడం
ఈఈజీ పరీక్ష
సీటీ స్కాన్ (మెదడు)
ఎంఆర్‌ఐ మెదడు పరీక్షలు ఉపకరిస్తాయి
మైగ్రేన్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
మానసిక ఆందోళనలు తగ్గించుకోవాలి.
మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. దీనికోసం యోగా, ప్రాణాయామం చేయాలి. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది.
తలకు నూనెతో మసాజ్ చేసుకోవాలి. తలలోని నరాలు రిలాక్సవుతాయి.
తలనొప్పి వచ్చినప్పుడు ప్రశాంత వాతావరణంలో, లైటు తీసేసి, నిశ్శబ్దంగా ఉన్నచోట పడుకోబెట్టాలి.
హోమియో వైద్యం:
మైగ్రేన్ తలనొప్పికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. ఘాటైన వాసనలు పీల్చినప్పుడు తలనొప్పి వస్తే బెల్లడోనా, లైకోపోడియం, ఇగ్నీషియా ఇవ్వాలి. తరుచూ అధికంగా తలనొప్పి వస్తుంటే నేట్రంమూర్, సాంగ్యునేరియా, చైనా, సెపియా ఇవ్వాలి. గర్భవతుల్లో తలనొప్పి వస్తే బెల్లడోనా, నక్స్‌వామికా, సెపియా ఇవ్వాలి. ఎక్కువగా చదవడం వల్ల నొప్పి వస్తే ఇగ్నీషియా, సెపియా, కాక్యులస్, కాలికార్‌భ ఇవ్వాలి. స్కూల్‌కు వెళ్ళే ఆడపిల్లల్లో వస్తే కాల్కేరియా ఫాస్, నేట్రంమూర్, పల్సటిల్లా ఇవ్వాలి. ఈ మందులు అవగాహనకు మాత్రమే. మందులను నిష్ణాతులైన హోమియో వైద్యుని సంప్రదించి మాత్రమే తీసుకోవాలి.
డాక్టర్ మురళీ అంకిరెడ్డి, ఎం.డి హోమియో, స్టార్ హోమియోపతి
సికింద్రాబాద్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, నేరేడ్‌మెట్, వైజాగ్, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి,
హన్మకొండ మరియు కర్ణాటక అంతటా... ఫోన్: 7416 102 102, www.starhomeo.com