Laughter Decreases Stress Hormones And Increases Immune Cells And Infection-fighting Antibodies: నవ్వితే మానసిక ఉత్తేజం కలుగుతుంది. నవ్వినప్పుడు ఎండార్ఫిన్ హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ హాయిని కలిస్తుంది. ఎండార్ఫిన్ విడుదలయ్యే స్థాయి నవ్వు అంటే ఏ లాఫింగ్ క్లబ్‌లోనో చేరి నవ్వాల్సిన పనిలేదు. అలాగని వికటాట్టహాసం చేయాల్సిన పని కూడా లేదు, ఓ చిరుదరహాసం చాలు.
సైంటిఫిక్ అమెరికన్ స్టడీ ప్రకారం చిరునవ్వుతో ముఖ కవళికలు మారుతాయి, చూసేవారికే కాదు నవ్విన వారికి కూడా అసంకల్పితంగా మనోల్లాసం కలుగుతుంది. మతికి సానుకులమైన ఆలోచనలు కలుగుతాయి.
నొప్పి నివారణకు కూడా నవ్వు ఉపయోగపడుతుందంటే నమ్ముతారా! నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. చక్కగా హాయిగా నవ్వినట్లయితే ఒంటినొప్పులు తగ్గుతాయి. నొప్పి బాధపెడుతుంటే నవ్వు ఎలా వస్తుంది? అనే సందేహం అక్కర్లేదు. ఒళ్లు నొప్పులు, తలనొప్పితో బాధపడేటప్పుడు కామెడీ షోలు చూడండి. ఒకరు పక్కన ఉండి గిలిగింతలు పెట్టే పని లేకుండా మీకై మీరే హాయిగా నవ్వేస్తారు. నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు.
హాయిగా నవ్వడం రక్తప్రసరణ మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ద కాలేజ్ ఆఫ్ ఫ్యామిలీ ఫిజీషియన్స్‌లో ప్రచురించిన కథనం ప్రకారం నవ్వేటప్పుడు ఊపిరితిత్తుల నిండుగా గాలి పీల్చుకుంటాం. దాంతో ఆక్సిజన్ ఎక్కువ మోతాదులో దేహంలోకి వెళ్తుంది. దాంతో కండరాలు సాంత్వన పొందుతాయి. గుండె లయ కూడా క్రమబద్ధమవుతుంది.
చదవండి: Men's Day 2021: పక్కా జెంటిల్‌మన్ ఎలా ఉండాలో తెలుసా!.. అదే జెంటిల్‌నెస్..
నవ్వడం వల్ల దేహంలో విడుదలయ్యే ఫీల్‌గుడ్ హార్మోన్‌ల ప్రభావంతో దేహంలోని వ్యాధి నిరోధక శక్తి మెరుగవుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అందుకే రోజూ పది నిమిషాల సేపు హాయిగా నవ్వడానికి కేటాయించండి. మనసు బాగుంటే నవ్వమా? అని ప్రశ్నించే వారికో సూచన. మనకు నిజంగా హాయిగా నవ్వాలనే ఆలోచన ఉంటే... నవ్వించడానికి సాధనాలెన్నో ఉన్నాయిప్పుడు. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. ఒక హ్యూమరస్ వీడియో చూస్తే చాలు. హాయిగా నవ్వుకుంటాం. మనసు తేలికపడుతుంది.
ఇప్పటి వరకు నవ్వడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యానికి కలిగే మేలు గురించి చెప్పుకున్నాం.
ఇక సామాజిక ఆరోగ్యం విషయానికి వస్తే... చిరునవ్వు పెట్టని ఆభరణంలా ముఖానికి అందాన్ని తెస్తుంది. ఎదుటి వ్యక్తిని చిరునవ్వుతో పలకరిస్తే అవతలి వాళ్లు కూడా పలకరింపుగా ఓ చిరునవ్వు నవ్వుతారు. నవ్వులేని ముఖంలో ఆత్మీయతను, స్నేహితులను వెతుక్కోవడం ఎవరికైనా కష్టమే. సామాజిక బంధాలు మెరుగవ్వాలన్నా కూడా చక్కటి చిరునవ్వే సాధనం. అందుకే స్టైలిష్‌గా లేకపోయినా ఫర్వాలేదు, కానీ స్మైలిష్‌గా ఉండడానికి మాత్రం తప్పకుండా ప్రయత్నించండి.
చదవండి: Covid Taste Test: తెలుసా..! కాఫీతో కోవిడ్ టెస్ట్ చేయొచ్చు... ఎలాగంటే..
Comments
Please login to add a commentAdd a comment