ఒత్తిడిని గుర్తించే టీషర్ట్ | Hexoskin T-shirt to measure stress levels, sleep | Sakshi
Sakshi News home page

ఒత్తిడిని గుర్తించే టీషర్ట్

Published Wed, Sep 25 2013 12:11 AM | Last Updated on Fri, Sep 1 2017 11:00 PM

ఒత్తిడిని గుర్తించే టీషర్ట్

ఒత్తిడిని గుర్తించే టీషర్ట్

వాషింగ్టన్: పోటీ యుగంలో ప్రపంచంతో పాటు పరుగులు పెట్టక తప్పదు. దీంతో మనకు తెలియకుండానే ఒత్తిడి, నిద్రలేమి కబళించేస్తున్నాయి. ఒత్తిడి, నిద్రకు సంబంధించిన సమస్యలను గుర్తించగలిగే ఓ సరికొత్త ‘టీ షర్ట్’ త్వరలో అందుబాటులోకి రానుంది. ‘హెక్సోస్కిన్’ టీషర్ట్‌గా పేర్కొంటున్న దీనిని కెనడాకు చెందిన ఓ సంస్థ రూపొందించింది. ఇందులో ఉండే సెన్సార్లు ఎప్పటికప్పుడు మనం శ్వాసించే స్థాయి, శరీరం కదలికలు, గుండె కొట్టుకునే తీరు వంటి అంశాలను పరిశీలిస్తాయి.

ఈ అంశాల ఆధారంగా.. నిద్ర స్థాయి (కలత నిద్ర, గాఢ నిద్ర)ని, ఒత్తిడిని అంచనా వేస్తాయి. ఈ వివరాలను స్మార్ట్ ఫోన్ సహాయంతో వైద్యులకు, మన ఆన్‌లైన్ అకౌంట్‌కు పంపుతాయి. ఒత్తిడి స్థాయిని గుర్తించి, తదనుగుణంగా జీవన విధానంలో మార్పులు చేసుకొనేందుకు ఈ టీషర్ట్ తోడ్పడుతుందని ‘హెక్సోస్కిన్’ సంస్థ సీఈవో అలెగ్జాండ్రె తెలిపారు. ముఖ్యంగా క్రీడాకారులకు, క్రీడా శిక్షకులకు ఉపయోగపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement