ఒత్తిడిలో 9కిలోలు తగ్గిన హీరోయిన్! | Amber Heard lost weight due to 'stress' | Sakshi
Sakshi News home page

ఒత్తిడిలో 9కిలోలు తగ్గిన హీరోయిన్!

Jun 18 2016 8:47 AM | Updated on Sep 4 2017 2:49 AM

ఒత్తిడిలో 9కిలోలు తగ్గిన హీరోయిన్!

ఒత్తిడిలో 9కిలోలు తగ్గిన హీరోయిన్!

అంబర్ హర్డ్ తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటుంది.

లాస్ ఏంజెల్స్: జానీ డెప్తొ తెగదెంపులు చేసుకోవడానికి కోర్టుకెక్కిన హాలీవుడ్ నటి అంబర్ హర్డ్.. తీవ్ర మానసిక ఒత్తిడి అనుభవిస్తోంది. ఈ వ్యవహారంతో ఏర్పడిన స్ట్రెస్ మూలంగా ఇటీవల ఆమె 9 కిలోల వరకూ బరువు తగ్గినట్లు వెల్లడించింది. దీంతో అంబర్ తదుపరి చిత్రం 'జస్టీస్ లీగ్'కు సంబంధించిన కాస్ట్యూమ్స్ పనులు ఆగిపోయాయి. వెయిట్ లాస్ మూలంగా అంబర్ మరీ సన్నగా కనిపిస్తుండటం పట్ల చిత్ర నిర్మాతలు కలవరపడుతుండటమే దీనికి కారణమట.

52 ఏళ్ల డెప్‌ నుంచి తనకు విడాకులు ఇవ్వాలంటూ గత నెల 23న అంబర్‌ (30) కోర్టులో విడాకుల పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. పైరేట్స్ ఆఫ్ కరేబియన్ స్టార్ తనను మానసికంగా, శారీరకంగా హింసించాడని అంబర్ ఆరోపించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement