బాలీవుడ్ నటి, కాబోయే తల్లి దీపికా పదుకొణె యోగాసనాలు వేస్తూ కనిపించింది. దీపికా బేబీ బంప్‌తో విపరీత కరణి యోగాసనం వేసింది. ఎప్పటికప్పుడూ తన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటుంది. తాను ఫిట్‌గా ఉండటానికే ఇలా యోగాసనాలు వేస్తున్నట్లు చెబుతుండే దీపికా ఈ టైంలో కూడా యోగాసనాలు వేస్తున్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. మరీ ఇలా ఇలా ఆసనాలు వేయడం కాబోయే తల్లులకు మంచిదేనా? ఆ టైంలో వేయడం ఎంత వరకు మంచిది వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!
38 ఏళ్ల దీపికా పదుకొణే వేసిన విపరీత కరణి యోగాసనం కాబోయే తల్లులకు ఎంతో ఉపయోగకరం. ఇలా ఐదు నిమిషాల పాటు వేస్తే ఎంతో మంచిది. సంస్కృతంలో దీన్ని తలకిందులుగా వేసే యోగాసనంగా చెప్పుకుంటారు. ఈ యోగా భంగిమలో మీ కాళ్ళను పైకెత్తి గోడకు ఆనించి పడుకోవడం జరుగుతుంది. ఈ పునరుజ్జీవన యోగసనం నాడీ వ్యవస్థను శాంతపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
దీపికా పడుకుణే లాంటి కాబోయే తల్లులు ఈ యోగాను వేయాలనుకుంటే.. కుషన్ లేదా దిండు వంటివి వేసుకుని చేయడం మంచిది. ఈ వ్యాయామం కండరాలు, కీళ్ళలో నొప్పిని తగ్గిస్తుంది. గర్భం ధరించిన వారిలో కండరాలు, కీళ్ల నొప్పులు కనిపిస్తూ ఉంటాయి. వీపు కింద తలగడ పెట్టుకోవడంవల్ల తక్కువ ఒత్తిడి పడుతుంది. ఈ వ్యాయామం కాబోయే తల్లులకు సురక్షితంగా ఉంటుంది. ఈ వ్యాయామం కోసం కాళ్ళను ఎత్తినప్పుడు, ఇది వారి చీలమండలో వాపును తగ్గిస్తుంది. అయితే గ్లాకోమా, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉన్న వారు ఈ యోగా భంగిమను ప్రయత్నించకూడదు.
ప్రయోజనాలు
ఈ ఆసనం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. గర్భం ధరించిన వారే కాదు, సాధారణ వ్యక్తులు కూడా ఈ యోగా చేయడం ఎంతో మంచిది.
మేల్కొన్న వెంటనేవిపరీత కరణి వ్యాయామంతో రోజును ప్రారంభిస్తే ఎంతో మంచిది. ఇది శోషరస, గ్లింఫాటిక్ వ్యవస్థలను ఉత్తేజపరుస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇది ఎగువ అవయవాల వైపు ఆక్సిజన్ రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది శరీరంలో డిటాక్సిఫికేషన్‌కు సహాయపడుతుంది. శరీరంలోని వ్యర్థాలను, విషాలను బయటకు పంపిస్తుంది. ఈ వ్యాయామం తుంటి, తొడ కండరాలను సాగదీయడానికి సహాయపడుతుంది.
ఈ యోగాను నిద్రపోయే ముందు చేయడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఈ వ్యాయామం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ఎందుకంటే ఇది శరీరాన్ని శాంతపరుస్తుంది. ఇది పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది నిద్ర నాణ్యతను పెంచుతుంది. విపరీత కరణి యోగాసనం చేయడం వల్ల కాళ్లలోని బిగువును తగ్గించడానికి సహాయపడుతుంది.
దీన్ని లెగ్-అప్-ది-వాల్ భంగిమ అని కూడా అంటారు. ఇది ఒక ఆల్ రౌండర్ యోగాసనం. ఇది మానసికంగా, శారీరకంగా మిమ్మల్ని శాంతపరిచే యోగాసనం. మెరుగైన నిద్ర నాణ్యత, మంచి ఉదర ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పెంచడం, ఒత్తిడి తగ్గించడం వంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు.
(చదవండి: బేబీ క్యారెట్స్ సీక్రెట్ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!)
Comments
Please login to add a commentAdd a comment