గోవాలో 'సారా అలీ ఖాన్' వెల్‌నెస్ అండ్ యోగా రిట్రీట్‌ | Sara Ali Khan Curates and Hosts an Exclusive Wellness and Yoga Retreat on Airbnb | Sakshi
Sakshi News home page

గోవాలో 'సారా అలీ ఖాన్' వెల్‌నెస్ అండ్ యోగా రిట్రీట్‌

Published Tue, Nov 19 2024 7:59 PM | Last Updated on Tue, Nov 19 2024 8:10 PM

Sara Ali Khan Curates and Hosts an Exclusive Wellness and Yoga Retreat on Airbnb

ఫిట్‌నెస్, ట్రావెలింగ్ పట్ల అమితాసక్తి చూపించే ప్రముఖ నటి.. 'సారా అలీ ఖాన్' మొదటి సారి గోవాలోని ఎయిర్‌బీఎన్‌బీలో స్పెషల్ వెల్‌నెస్ అండ్ యోగా రిట్రీట్‌ను నిర్వహించనున్నారు. దీనికోసం సూర్యరశ్మి, పచ్చటి ప్రకృతి మధ్య ఒక సెటప్ సెట్ చేసుకున్నారు.

సినిమా రంగంలో ఫిట్‌నెస్ పట్ల అమితమైన అభిరుచి కలిగిన సారా అలీ ఖాన్.. ఇప్పుడు ఆరోగ్యం, యోగా పట్ల తనకున్న అభిరుచిని వెల్లడిస్తుంది. అద్భుతమైన ప్రదేశంలో పచ్చని ప్రకృతి మధ్య సారాతో నలుగురు వ్యక్తులు యోగా చేసే అవకాశం పొందవచ్చు.

ఇక్కడ సారా వ్యక్తిగత వెల్నెస్ ఆచారాలు, ఇతర ఆరోగ్య రహస్యాలను గురించి కూడా తెలుసుకోవచ్చు. గోవాలో ఈ వెల్‌నెస్ మరియు యోగా రిట్రీట్ కోసం బుకింగ్‌లు నవంబర్ 27న ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి.

గోవాలో ఎయిర్‌బిఎన్‌బిలో మాత్రమే జరిగే ఈ ప్రత్యేక వెల్‌నెస్ అండ్ యోగా రిట్రీట్‌కు అతిథులను స్వాగతించడానికి నేను నిజంగా సంతోషిస్తున్నాను. ఇక్కడ ప్రకృతి అందాల నడుమ.. మనస్సు, శరీరం, ఆత్మను పోషించడంపై దృష్టి పెట్టవచ్చు. జీవితంలో మరచిపోలేని సాధారణ ఆనందాలను స్వీకరించడానికి ఇది ఒక మంచి అవకాశం అని సారా అలీ ఖాన్ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement