శరీర బలాన్ని బ్యాలెన్స్ చేసే ఈ ఆసనాన్ని బోట్ ఆసన అని కూడా అంటారు. ఈ ఆసనం శక్తిని పెంచుతుంది. అలసటను పోగొడుతుంది. తొడలను బలోపేతం చేయడం ద్వారా ఎక్కువసేపు కూర్చొని చేసే పనుల వల్ల కలిగే సమస్యలను నిరోధిస్తుంది. నౌకాసనాన్ని సాధన చేయాలనుకునేవారు..
ముందుగా మ్యాట్ పైన కాళ్లను ముందుకు చాపి విశ్రాంతిగా కూర్చోవాలి.
తుంటి భాగానికి ఇరువైపులా చేతులను నిటారుగా ఉంచాలి.
తల నుంచి వెన్నుభాగాన్ని కొద్దిగా వెనక్కి వంచాలి. ఇలాంటప్పుడు హిప్ భాగంపై బరువును బ్యాలన్స్ చేసుకునేలా చూసుకోవాలి.
శ్వాస వదులుతూ మోకాళ్లను, పాదాలను నేల నుండి పైకి ఎత్తాలి. ముందు మోకాళ్లు వంగి ఉంటాయి. నెమ్మదిగా నిటారుగా ఉంచే స్థాయికి తీసుకురావాలి.
కంటి చూపు స్థాయికి పాదాలను పైకి లేపాలి. సాధ్యం కాక΄ోతే కొద్దిగా మోకాళ్లను వంచి, పిక్కలు, మడమల భాగాన్ని నేలకి సమాంతరంగా ఉంచాలి.
భుజాలను కొద్దిగా వెనక్కి లాగి, రెండు చేతులను మోకాళ్లకు సమాంతరంగా ఉంచాలి. నాభి భాగాన్ని దృఢంగా ఉంచడానికి ప్రయత్నించాలి
పాదం, వేళ్లను కొద్దిగా వంచి, ఈ భంగిమలో శ్వాస తీసుకొని, వదలాలి. 10 నుండి 20 సెకన్ల ΄ాటు భంగిమలో ఉండటానికి ప్రయత్నించాలి.
తర్వాత సాధారణ స్థితికి చేరుకోవడానికి ముందుగా పాదాలను, చేతులను నేలపై ఉంచాలి. తర్వాత తల, వెన్నుభాగాన్ని యథాస్థితికి చేర్చాలి. ∙సాధనలో నెమ్మదిగా సమయాన్ని పెంచాలి.
– జి.అనూష, యోగా గురు
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment