ఆ సినిమా.. తలైవా గౌరవాన్ని పెంచేదే: ఆదిత్యమీనన్ | 'Main Hoon Rajinikanth' a tribute to thalaivar: Adithya Menon | Sakshi
Sakshi News home page

ఆ సినిమా.. తలైవా గౌరవాన్ని పెంచేదే: ఆదిత్యమీనన్

Published Thu, Sep 18 2014 11:14 AM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM

ఆ సినిమా.. తలైవా గౌరవాన్ని పెంచేదే: ఆదిత్యమీనన్

ఆ సినిమా.. తలైవా గౌరవాన్ని పెంచేదే: ఆదిత్యమీనన్

హిందీలో తాను తీయబోతున్న 'మై హూ రజనీకాంత్' సినిమా.. తమిళ సూపర్స్టార్ తలైవా గౌరవాన్ని మరింత పెంచేలాగే ఉంటుంది తప్ప.. ఆయనను కించపరిచేలా ఏమాత్రం ఉండబోదని దక్షిణాది నటుడు ఆదిత్య మీనన్ చెప్పాడు. ఇంతకుముందు విల్లువా, ఈగ లాంటి సినిమాలకు పనిచేసిన ఆదిత్య.. ఇప్పుడు హిందీలో తీస్తున్న 'మై హూ రజనీకాంత్' సినిమా విషయంలో అసలు తనను సంప్రదించకుండా తనపేరు వాడుకోవడంపై రజనీ ఆగ్రహానికి గురయ్యారు. దీనిపై మద్రాసు హైకోర్టులో ఆయన పిటిషన్ కూడా దాఖలు చేశారు.

ఇది కామెడీ సెటైర్ చిత్రమని, దీన్ని ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని ఆదిత్య మీనన్ అన్నాడు. అసలు రజనీకాంత్ను సినిమాల్లో తప్పుగా చూపించే ధైర్యం ఎవరూ చేయలేరని, అలాంటిది తాను ఎలా చేయగలనని అన్నాడు. పేరుతో సహా తమ సినిమాలో రజనీ సార్ గురించి ఎక్కడా తప్పుగా ఉండదన్నాడు. ఈ సినిమాలో ఆదిత్య మీనన్ సీబీఐ అధికారిగాను, కాంట్రాక్టు కిల్లర్గా కూడా ఉంటాడు. అందులో ఆ పాత్ర పేరు రజనీకాంత్ రావు. ఇందులో కవితా రాధేశ్యాం, స్మితా గోండ్కర్, రీమా లాగూ, సునీల్ పాల్, గణేశ్ యాదవ్, శక్తికపూర్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement