
మృతిచెందిన అనిత
శ్రీకాకుళం సిటీ: నగరంలో పెద్దరెల్లి వీధికి చెందిన బొమ్మాలి అనిత(19) బుధవారం నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండోపట్టణ ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. దమ్మలరెల్లి వీధికి చెందిన నల్లపిల్ల గౌరీశంకర్, అనితకు మధ్య ప్రేమ వ్యవహారం ఉండేది. మూడు రోజులుగా వీరిద్దరూ ఫోన్‌లో ఘర్షణ పడుతున్నారు. ఈ క్రమంలో ఇంటికి బుధవారం ఉదయం గౌరీశంకర్ రావడం, అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. రిమ్స్‌లో చేర్పించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అనిత మృతికి గౌరీశంకర్ కారణమని మృతురాలి తండ్రి దొరబాబు ఫిర్యాదు చేశారని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment