
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల సమీపిస్తున్న వేళ టీడీపీలో విభేదాలు రోడ్డునపడుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు అధికార పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరగా.. స్థానిక ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. తాజాగా పాకయరావుపేట అధికార పార్టీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు వ్యతిరేకంగా నిరసన సెగ తగిలింది. ఎన్నికల్లో ఆమెకు టికెట్ కేటాయించవద్దని సొంతపార్టీ మహిళలే భారీ ర్యాలీని చేపట్టారు.
నియోజకవర్గంలోని మహిళా సర్పంచులు, మండల అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీల సమక్షంలో మహిళలు ర్యాలీని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అనితకు టీడీపీ టికెట్ కేటాయించవద్దని వారు డిమాండ్ చేశారు. గతంలో కూడా అనిత ప్రజల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు విషయం పెద్ద దుమారమే చలరేగింది.