సాప్ట్వేర్ ఇంజినీర్‌పై సామూహిక అత్యాచారం | software engineer gang-raped in Bangalore | Sakshi
Sakshi News home page

సాప్ట్వేర్ ఇంజినీర్‌పై సామూహిక అత్యాచారం

Published Fri, Jun 13 2014 8:29 AM | Last Updated on Mon, Oct 22 2018 7:50 PM

సాప్ట్వేర్ ఇంజినీర్‌పై సామూహిక అత్యాచారం - Sakshi

సాప్ట్వేర్ ఇంజినీర్‌పై సామూహిక అత్యాచారం

ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓ.. అతని సోదరుడు, మరో స్నేహితుడితో కలిసి తన సంస్థలో పని చేస్తున్న మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

 *అవమానం భరించలేక ఆత్మహత్య
* సీఈఓనే ప్రధాన నిందితుడు
 * సోదరుడు, స్నేహితుడితో కలిసి కిరాతకం

 
 బెంగళూరు   :  ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓ.. అతని సోదరుడు, మరో స్నేహితుడితో కలిసి తన సంస్థలో పని చేస్తున్న మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ అవమానాన్ని భరించలేక బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, బాధితురాలి సోదరుడి వివరాల మేరకు.. చిక్కమగళూరు జిల్లా అజ్జంపుర సమీపంలోని హెబ్బూరుకు చెందిన అనిత (25) బెంగళూరులోని ఎట్రియా కాలేజ్‌లో విద్యాభ్యాసం చేసింది. తనను ప్రేమించాలంటూ తోటి విద్యార్థి గిరీష్ ...అనితను ఐదేళ్ల పాటు వేధించాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. అనంతరం అనితకు కేబీ ఫౌండేషన్  సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది.

తనను ప్రేమించాలంటూ ఆ కంపెనీ సీఈఓ శ్రీకాంత్‌కు సోదరుడు, గిరీష్‌కు స్నేహితుడైన మదన్ ఆమెను ఒత్తిడి చేశాడు. ఇందుకు ఆమె అంగీకరించలేదు. తమ్ముడి కోరికను తెలుసుకున్న శ్రీకాంత్.. ఈ నెల 10వ తేదీ (మంగళవారం) రాత్రి అత్యవసర పని అంటూ అనితను తన ఇంటికి రప్పించుకున్నాడు. ఆమె వెళ్లిన సమయానికి ఆ ఇంట్లో మదన్, గిరీష్ కూడా ఉన్నారు. వారు అనితను నిర్బంధించి.. సామూహిక అత్యాచారం చేశారు. ఎవరికైనా చెబితే చంపుతామంటూ ఆమెను హెచ్చరించి బుధవారం ఉదయం  వదిలిపెట్టారు.

ఈ అవమానాన్ని భరించలేని అనిత.. తన సోదరుడు వినయ్‌కు మొబైల్ ద్వారా ఓ మెసేజ్ ఇచ్చింది. నేరుగా తను ఉంటున్న హుళిమావు సమీపంలోని బృందావన లేఔట్‌లోని ఒక పీజీ హాస్టల్‌కు వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనితకు పలుమార్లు కాల్ చేసినా స్పందన లేకపోవడంతో వినయ్ గురువారం హాస్టల్‌కు చేరుకోవడంతో ఆత్మహత్య విషయం వెలుగు చూసింది. పోలీసులు అనిత మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. వినయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న శ్రీకాంత్, మదన్, గిరీష్ కోసం గాలిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement