మా కాలంలో మరీ అన్యాయం | Anitha Reveals How Her Escape From Casting Couch | Sakshi
Sakshi News home page

మా కాలంలో మరీ అన్యాయం

Published Thu, Apr 26 2018 8:40 AM | Last Updated on Thu, Apr 26 2018 9:03 AM

Anitha Reveals How Her Escape From Casting Couch - Sakshi

తమిళసినిమా: ఇప్పుడు కాస్త నయం. మా కాలంలో అయితే అంటూ చెప్పుకొచ్చింది నటి అనిత. ఈ పేరు దక్షిణాదికి సుపరిచితమే. తెలుగులో నువ్వు నేను లాంటి కొన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించిన అనిత తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. ఇక్కడ మనోజ్‌ భారతీరాజాకు జంటగా వరుసమెల్లా వసంతం చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. విక్రమ్‌కు జంటగా సాయిరాయ్, విజయ్‌తో సుక్రన్‌ చిత్రాల్లో నటించిన అనిత ఆ తరువాత అడపాదడపా కొన్ని చిత్రాల్లో మెరిసినా, హీరోయిన్‌గా కనిపించలేదు.అదే విధంగా మలయాళం, కన్నడం చిత్రాల్లోనూ నటించింది. కొన్ని చిత్రాల్లో ఐటమ్‌ సాంగ్‌లకు చిందేలేసిన ఈ అమ్మడు ప్రస్తుతం హిందీ టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది.

బాలీవుడ్‌ నుంచి, కోలీవుడ్, టాలీవుడ్‌లలో కలకలం సృష్టిస్తున్న కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఈ అమ్మడు కూడా గొంతు కలిపింది. వనిత ఏం చెప్పిందో చూద్దాం. సినీరంగంలో కాస్టింగ్‌ కౌచ్‌ విధానం ఉంది. ఇక్కడో విషయం చెప్పాలి. మంచి ప్రారంభం ఉంటే పయనం బాగుంటుంది. అయినా నేనూ పోరాటం చేశాను. కాస్టింగ్‌ కౌచ్‌ అనుభవం నాకు ఎదురైంది. ఈ వ్యవహారంలో మనం చాకచక్యంతో బయట పడాలి. ఏం చేద్దాం. ఈ రంగం అలా తయారైంది అంటూ నిట్టూర్చింది.అదృష్టవశాత్తు నాకు ఏక్తాకపూర్‌ లాంటి నిర్మాత లభించారు. ఇంకా చెప్పాలంటే కాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారంలో ఇప్పుడు కాస్త నయం. మా కాలంలో అయితే ఇంకా అన్యాయం. ఒకవేళ  నేను చెప్పేది తప్పు కూడా కావచ్చు అని పేర్కొంది.ప్రస్తుతం ఈ అమ్మడు నాగిని పార్టు–3 సీరియల్‌లో నటిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement