ధర్మవరం అర్బన్ : పట్టణంలోని పీఆర్‌టీ వీధిలో నివశిస్తున్న విద్యుత్‌శాఖ ఉద్యోగిని అనిత(35) ఆత్మహత్య చేసుకున్నారు. కొద్ది సంవత్సరాల క్రితం ఆమె భర్త శివయ్య చనిపోవడంతో ఆయన స్థానంలో ఉద్యోగం చేస్తూ వచ్చిన ఆమె శనివారం ఇంట్లో పిల్లలు లేని సమయం చూసి చీరతో ఉరేసుకున్నారు. తన కుమార్తె కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతూ ఉండేదని, ఆ నొప్పి తాళలేకే ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.