నిర్మాత దిల్‌ రాజుకు సతీ వియోగం | telugu film producer Dil raju wife anitha dies of cardiac arrest | Sakshi
Sakshi News home page

నిర్మాత దిల్‌ రాజుకు సతీ వియోగం

Published Sat, Mar 11 2017 6:48 PM | Last Updated on Tue, Sep 5 2017 5:49 AM

నిర్మాత దిల్‌ రాజుకు సతీ వియోగం

నిర్మాత దిల్‌ రాజుకు సతీ వియోగం

హైదరాబాద్‌ : ప్రముఖ తెలుగు నిర్మాత, పంపిణీదారుడు దిల్‌ రాజు అలియాస్ వి.వెంకట రమణారెడ్డికి సతీ వియోగం జరిగింది. దిల్‌ రాజు భార్య అనిత (46) శనివారం గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఇవాళ తుది శ్వాస విడిచారు. కాగా వరుణ్‌ తేజ్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'ఫిదా'  చిత్రం షూటింగ్‌ నిమిత్తం దిల్‌ రాజు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.

ఈ దుర్వార్త విన్న దిల్‌ రాజు... అమెరికా నుంచి హైదరాబాద్‌ బయల్దేరారు. ఆయన వచ్చేవరకు అనిత మృతదేహాన్ని ఆసుపత్రిలోనే ఉంచుతారని తెలిసింది.  విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు దిల్‌రాజు కుటుంబానికి సంతాపం ప్రకటించారు. ఇటీవల దిల్‌ రాజు తమ కుమార్తె హన్హిత రెడ్డి పెళ్లిని గోవాలో గ్రాండ్‌గా జరిపించిన విషయం తెలిసిందే.

దిల్‌ రాజు... శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఆయన నిర్మించిన తొలి చిత్రం దిల్‌ విజయవంతం కావడంతో ఆ పేరే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement