
హైదరాబాద్, సాక్షి: నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కాగా.. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.
ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్.. మొత్తం 12 జిల్లాలతో కూడిన ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులంతా నల్లగొండ కలెక్టరేట్‌లోనే తమ నామినేషన్లను సమర్పించాల్సి ఉంది. ఈ నెల 9వ నామినేషన్ల సమర్పణకు ఆఖరి తేదీ.
నామినేషన్ల పరిశీలన 10వ తేదీన ఉంటుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరుగుతుంది. జూన్ 5వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment