
సాక్షి,విజయవాడ: శాసనమండలిలో మంత్రి నారా లోకేష్ అడ్డంగా బుక్కయ్యారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల దెబ్బకి నిజాలు ఒప్పుకున్నారు. నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించలేదని అంగీకరించారు. గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పించారు. ఇదే అంశంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు నిలదీయడంతో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని లోకేష్ ఒప్పుకున్నారు. దీంతో పాటు మెగా డీఎస్సీ, జాబ్ క్యాలండర్‌పై నిలదీస్తే సమాధానం దాటవేశారు.
రాష్ట్రంలో భారీ ఎత్తున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల రాజీనామాలపై విచారణకు ఆదేశించాలని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆధారాలు చూపించండంటూ విచారణకు చేపట్టేందుకు ఆయన ముందుకు రాలేదు. అదే సమయంలో కేంద్రం ప్రభుత్వం టీడీపీ, జనసేన మీద ఆధారపడిలేదన్న లోకేష్.. ప్రత్యేక హోదా డిమాండ్ చేసేసరికి బేషరతుగా మద్దతిచ్చామన్నారు. టీడీపీ ఎంపీలపై ఆధారపడ్డ కేంద్రం ప్రభుత్వం నుండి హోదా సాధించమని పరోక్షంగా లోకేష్ అంగీకరించారు. అయితే, ఇలా మంత్రి లోకేష్ తీరుతో ఇరకాటంలో పడ్డామని టీడీపీ ఎమ్మెల్సీలు పెదవి విరుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment