ఐపీఎల్ మాజీ స్టార్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మాజీ బ్యాటర్ పాల్ వాల్తాటీ ఎంఎల్‌సీలోని (మైనర్ లీగ్ క్రికెట్) ఓ ఫ్రాంచైజీకి (సియాటిల్ థండర్‌బోల్ట్స్) హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని సదరు ఫ్రాంచైజీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. మైనర్ లీగ్ క్రికెట్ అనేది అమెరికా వేదికగా జరిగే ఓ క్రికెట్ టోర్నీ. ఇందులో దేశ విదేశాలకు చెందిన చాలామంది క్రికెటర్లు పాల్గొంటారు.
40 ఏళ్ల వాల్తాటీ 2011 ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ తరఫున సంచలన ఇన్నింగ్స్‌లు ఆడి రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. ఆ సీజన్‌లో అతను 14 మ్యాచ్‌ల్లో 463 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో వాల్తాటీ శివాలెత్తిపోయాడు. కేవలం 63 బంతుల్లో 120 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చాలాకాలం వరకు ఈ స్కోర్ ఓ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌చే చేయబడిన అత్యధిక స్కోర్‌గా ఉండింది. 2023లో ఈ రికార్డును రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వి జైస్వాల్ బద్దలు కొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment