వాషింగ్టన్: గత రెండున్నరేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రెండు దేశాల మధ్య పోరులో ఇప్పటికే వేల సంఖ్యలో సామన్య పౌరులు మృతిచెందారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్ మొదటిసారిగా మార్-ఎ-లాగో బహిరంగ కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ..‘రష్యా-ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధంపై వచ్చిన నివేదికను పరిశీలించాను. గత రెండున్నరేళ్లలో వేలాదిమంది మరణించారు. నేను అధికారంలోకి వచ్చిన అనంతరం రష్యా-ఉక్రెయిన్‌ల యుద్ధాన్ని ఆపేస్తాను. అలాగే, పశ్చిమాసియాలోనూ శాంతిస్థాపనకు కృషి చేస్తాను అంటూ హామీ ఇచ్చారు. ఇదే సమయంలో అమెరికా సైన్యాన్ని బలోపేతం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇదిలా ఉండగా.. అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, తాను అధికారంలోకి వస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ ఇదివరకే పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఇక, ఇటీవల ఈవిషయంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడి.. యుద్ధాన్ని విస్తరించొద్దని కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికైనా రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు నిలిచిపోవాలని దేశాలు కోరుతున్నాయి.
This is what POTUS TRUMP wants for ending RUSSIA UKRAINE war , he wants this 800 miles line to be declared LAC with buffer zones on both sides pic.twitter.com/FJEpf4nCXk
— VINAY. KUMAR DELHI (@wadhawan2011) November 15, 2024
Comments
Please login to add a commentAdd a comment