పనిమంతుడు పందిరేస్తే.. కుక్క తోక తగిలి కూలిపోయిందట: కేటీఆర్‌ సెటైర్లు | BRS MLA KTR Satirical Comments On Congress Party | Sakshi
Sakshi News home page

పనిమంతుడు పందిరేస్తే.. కుక్క తోక తగిలి కూలిపోయిందట: కేటీఆర్‌ సెటైర్లు

Published Fri, Nov 15 2024 10:37 AM | Last Updated on Sat, Nov 16 2024 5:15 AM

BRS MLA KTR Satirical Comments On Congress Party

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని కాంగ్రెస్‌ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. మా భూములు మాకేనని ఎదిరించిన వారిని అక్రమ కేసులతో జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు. అలాగే, 11 నెలల పాలనలో సంక్షేమం మాయమైంది.. అభివృద్ధి దూరమైందని చెప్పారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..

  • పనిమంతుడు పందిరేస్తే-కుక్క తోక తగిలి కూలిపోయిందట

  • సంక్షేమ గురుకుల పాఠాశాలల ఆహార బిల్లులు, అద్దెలు చెల్లించకపోవడంతో వాటికి తాళాలు వేస్తే గానీ 9 నెలలకు 3 నెలల బిల్లులు చెల్లించారు

  • కానీ వేదికల మీద మాత్రం నాణ్యత లేకుంటే జైలుకే అని కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు

  • 11 నెలల పాలనలో సంక్షేమ గురుకుల పాఠశాలల నిర్వహణ గాలికి వదిలేశారు

  • 36 మంది విద్యార్థులు వివిధ కారణాలతో చనిపోయారు

  • వందలాది గురుకుల పాఠశాలలు, వసతిగృహాల విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు

  • పత్తి, వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టక ఆందోళన చేసినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో రైతన్నలు అడ్డికి పావుశేరు కింద తమ ఆరుగాలం కష్టాన్ని అమ్ముకుంటున్నారు

  • హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో హైదరాబాద్ పేదల బతుకుల్లో నిప్పులుపోసి కంటికి కునుకు లేకుండా చేశారు

  • ఫార్మాసిటీకి సేకరించిన భూమిని పక్కన పెట్టి ఫార్మా క్లస్టర్ల పేరుతో గిరిజనుల జీవితాల్లో భయాన్ని నింపారు

  • మా భూములు మాకేనని ఎదిరించిన వారిని అక్రమ కేసులతో జైళ్లకు పంపుతున్నారు

  • 11 నెలల పాలనలో సంక్షేమం మాయమయింది అభివృద్ధి దూరమయింది

  • కాంగ్రెస్ తెచ్చిన మార్పు చూసి తెలంగాణ నివ్వెరపోతుంది

  • కాలంబు రాగానే కాటేసి తీరాలని ఎదురుచూస్తుంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement