సాక్షి, హైదరాబాద్: లగచర్ల ఘటన కేసులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు.. నరేందర్ రెడ్డిని స్పెషల్ బ్యారక్‌లో ఉంచాలని కోరుతూ బీఆర్‌ఎస్ లీగల్ టీమ్ కోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.
తెలంగాణ హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు రిమాండ్ విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయాలని ఆయన కోరారు. నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పట్నం నరేందర్ రెడ్డి. అయితే, ఈరోజు హైకోర్టుకు సెలవు కావటంతో సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు.. నరేందర్ రెడ్డిని స్పెషల్ బ్యారక్‌లో ఉంచాలని కోరుతూ బీఆర్‌ఎస్ లీగల్ టీమ్ నేడు హౌజ్ మోషన్ పిటిషన్ వేయనున్నారు. నరేందర్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. జైలులో ఐదుగురు నేరస్థులతో కలిపి మాజీ ఎమ్మెల్యేను ఉంచారని బీఆర్‌ఎస్ లీగల్ టీమ్ చెబుతోంది. ఈ క్రమంలోనే ఆయనను స్పెషల్ బ్యారక్‌లో ఉంచాలని కోర్టును కోరనుంది.
ఇదిలా ఉండగా.. లగచర్ల ఘటనలో మరో పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్యంగా ఓ ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు పోలీసులు. నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. మరో కొంత మంది నిందితుల కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment