బాబును నమ్మడమంటే పులినోట్లో తలపెట్టడమే: సీఎం జగన్‌ | CM Jagan Speech Highlights At Memantha Siddham Kavali Public Meeting, Photos And Video Inside - Sakshi
Sakshi News home page

CM Jagan Kavali Meeting Speech: బాబును నమ్మడమంటే పులినోట్లో తలపెట్టడమే

Published Sat, Apr 6 2024 5:33 PM | Last Updated on Sat, Apr 6 2024 7:51 PM

Memantha Siddham: CM Jagan Speech At Kavali Public Meeting - Sakshi

కావలిలో దద్దరిల్లిన సిద్ధం సభ

చేసిన మంచి, చేయబోయే సంక్షేమాన్ని వివరించిన సీఎం జగన్‌

చంద్రబాబు & కో కుట్రలపై ప్రజలను హెచ్చరించిన సీఎం జగన్‌

సాక్షి, నెల్లూరు జిల్లా: అబద్ధాలు, మోసం, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా 9వ రోజు శనివారం సాయంత్రం నెల్లూరు జిల్లా కావలి నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య యుద్ధం అని, పెత్తందార్ల పక్షాన చంద్రబాబు ఉంటే, పేదల పక్షాన  మీ బిడ్డ జగన్‌ ఉన్నాడని తెలిపారు.

ఈ యుద్ధంలో నేను ఎప్పుడూ పేదల పక్షమే..
‘‘అందరి ప్రయోజనాలు రక్షించుకునేందుకు, మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా?. ఈ యుద్ధంలో నేను ఎప్పుడూ పేదల పక్షమే. మోసగాళ్లంతా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. మంచి చేసిన మనకు మద్దతిచ్చేందుకు మీరంతా సిద్ధమా?. మరో 5 వారాల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. పేదల భవిష్యత్‌ను నిర్ణయించేది ఈ ఎన్నికలే. మీ బిడ్డ హయాంలో ప్రతి ఇంటికి మంచి జరిగింది. జరిగిన మంచి కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా?’’ అంటూ  ప్రజలను ఉద్దేశించి అన్నారు.

మ్యానిఫెస్టో కాపీలు  చూపించే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా?.
‘‘చంద్రబాబు పేరు చెప్తే ఒక పథకం కూడా గుర్తుకురాదు. బాబు పేరు చెప్తే పేదలకు చేసిన మంచి ఒక్కటి లేదు. మ్యానిఫెస్టో కాపీలు  చూపించే దమ్ము, దైర్యం చంద్రబాబుకు ఉందా?. 30 ఏళ్ల క్రితమే సీఎంగా చేసిన చంద్రబాబు.. నా గతాన్ని చూసి ఓటేయండి అని అడగలేరు. మ్యానిఫెస్టోలోని 10 శాతం హామీలైనా అమలు చేశానని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా?’’ అంటూ సీఎం జగన్‌ ప్రశ్నించారు.

నా ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడు..
‘‘ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదు. చంద్రబాబు అభివృద్ధి చేసి ఉంటే పొత్తు ఎందుకు?. ఎన్నికలొస్తే  ప్రజలను మభ్యపెడుతూ ముందుకొస్తాడు. బెంజ్‌ కారు, బంగారం ఇస్తానంటూ మభ్య పెడతాడు. పేదవాడికి మంచిచేసానని ఏరోజైనా చంద్రబాబు చెప్పగలిగాడా?. నా ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడు. రూ.2 లక్షల 70వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. ఒక్కసారి ఆశీర్వదించినందుకే 58 నెలల పాటు సంక్షేమం అందించా. 99 శాతం హామీలు నెరవేర్చి మళ్లీ ఆశీస్సులు కోరుతున్నా. మీ జగన్‌ ఇంటించికి పౌరసేవలు డోర్‌ డెలివరీ చేయిస్తున్నాడు. చంద్రబాబును నమ్మడమంటే పులినోట్లో తలపెట్టడమే’’ అని సీఎం జగన్‌ ధ్వజమెత్తారు.

మళ్లీ మోసం చేసేందుకు బాబు కొత్త మేనిఫెస్టోతో వస్తున్నాడు..
‘‘2014లో ఇదే కూటమి ఇంటింటికీ పంపించిన పాంప్లెట్‌ గుర్తుందా?. ముఖ్యమైన హామీలు అంటూ మోసపు మాటలు గుర్తున్నాయా?. రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా?. ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు డిపాజిట్‌ చేస్తానన్నాడు చేశాడా?. ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ అన్నాడు.. నిర్మించాడా?. ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించాం. 99 శాతం హామీలు నెరవేర్చి మళ్లీ మీ ముందుకు వచ్చా. మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి. మరో ఐదేళ్ల పాటు మంచి కొనసాగాలంటే మీరు తోడుగా ఉండాలి. ఫ్యాన్‌ గుర్తుకు రెండు  ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి జరుగుతుంది. ఇంటింటికి వెళ్లీ చంద్రబాబు చేసిన మోసాలు చెప్పండి. మళ్లీ మోసం చేసేందుకు బాబు కొత్త మేనిఫెస్టోతో వస్తున్నాడు. సూపర్‌ సిక్స్‌, సెవెన్‌ అంటున్నాడు.. నమ్మొద్దు’’  సీఎం జగన్‌ చెప్పారు.


సీఎం జగన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

  • కావలి లో జన ప్రభంజనం కనిపిస్తోంది
  • మంచి చేసిన మనకు మద్దతిచ్చేందుకు మీరంతా సిద్ధమా.?
  • మరో 5 వారాల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి
  • ఇది జగన్, చంద్రబాబు మధ్య యుద్ధం కాదు
  • పేదల పక్షాన ఉన్న మీ బిడ్డ జగన్ ఉన్నాడు
  • పెత్తందార్ల పక్షాన ఉన్న చంద్రబాబు ఉన్నాడు
  • మీ బిడ్డ హయాంలో ప్రతి ఇంటికి మంచి జరిగింది
  • జరిగిన మంచి కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా?
  • అబద్దాలు, మోసాలు, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు.!
  • చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు
  • బాబు పేరు చెప్తే పేదలకు చేసిన మంచి ఒక్కటీ లేదు
  • ఎన్నికల ముందు మాత్రమే బాబుకు మేనిఫెస్టో గుర్తుకొస్తుంది
  • బాబు తన మేనిఫెస్టోలో  ప్రకటించిన వాటిలో కనీసం ఒక్క హామీనైనా నెరవేర్చలేదు
  • మేనిఫెస్టో చూపించే దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉందా ?
  • చంద్రబాబు మంచి చేసి ఉంటే మూడు పార్టీలతో పొత్తు ఎందుకు ?
  • మోసాలు, వెన్నుపోట్లతో బాబు 14 ఏళ్లు సీఎం గా ఉన్నారు.!
  • ఒక్కసారి ఆశీర్వదించినందుకే 58 నెలల పాటు సంక్షేమం అందించా
  • రూ. 2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం
  • మేనిఫెస్టో లోని 99 శాతం హామీలు నెరవేర్చాం
  • ఇంటింటికి  పౌర సేవలను డోర్ డెలివరీ చేయిస్తున్నాం
  • లంచాలు, వివక్ష లేని వ్యవస్థను తీసుకొచ్చాం
  • నాడు నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చాం
  • వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం
  • నేను చేసిన మంచిలో కనీసం 10 శాతమైన బాబు చేశాడా ?
  • చంద్రబాబును 4 నెలలుగా ప్రశ్నలు అడుగుతూ వచ్చా
  • ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు
  • బెంజ్ కారు, బంగారం ఇస్తానంటూ మభ్యపెడతాడు
  • పేదవాడికి మంచి చేశానని ఏరోజైనా చంద్రబాబు చెప్పగలిగాడా?
  • నా ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడు
  • సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం
  • ప్రతి గ్రామంలో ఆర్బీకే, విలేజ్ క్లినిక్స్ పెట్టాం
  • మహిళల రక్షణ కోసం దిశా యాప్ తీసుకొచ్చాం
  • అవ్వాతాతల సంక్షేమం, మహిళా సాధికారత చేసి చూపించాం
  • ఎన్నికల మేనిఫెస్టో ను పవిత్ర గ్రంధంగా భావించాం
  • 99 శాతం హామీలు నెరవేర్చి మళ్లీ మీ ముందుకు వచ్చా
  • మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి
  • పేదలకు ఈ మంచి కొనసాగాలంటే మన ప్రభుత్వమే రావాలి
  • మరో ఐదేళ్ల పాటు మంచి కొనసాగాలంటే మీరు తోడుగా ఉండాలి
  • ఫ్యాన్ కు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి జరుగుతుంది
  • ఇంటింటికి వెళ్లి చంద్రబాబు చేసిన మోసాలు చెప్పండి
  • 2014 లో ముగ్గురి ఫొటోలతో ముఖ్యమైన హామీలు ఇచ్చారు
  • చంద్రబాబును పొరపాటున కూడా నమ్మొద్దు
  • చంద్రబాబును నమ్మితే బంగారు కడియం ఇస్తానన్న పులిని నమ్మినట్లే
  • రైతు రుణమాఫీ చేస్తానన్నాడు .. చేశాడా ?
  • పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు .. చేశాడా ?
  • ఆడబిడ్డ పుడితే రూ . 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు .. చేశాడా?
  • ఇంటికో ఉద్యోగం అన్నాడు .. ఇచ్చాడా ?
  • ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు .. ఇచ్చాడా ?
  • రూ. 10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు .. వేశాడా ?
  • సింగపూర్ ని మించి అభివృద్ధి చేస్తానన్నాడు .. చేశాడా ?
  • ప్రతి నగరంలో హైటెక్ సిటీ అన్నాడు ... నిర్మించాడా ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement