సాక్షి, పల్నాడు జిల్లా: జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మండుటెండను లెక్క చేయకుండా అభిమాన నేత చూసేందుకు రోడ్లపైకి వస్తూ గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. తమ నేతను చూసి, అయ్యా నువ్వే మళ్లీ సీఎం కావాలయ్యా అంటూ దీవెనలు అందిస్తున్నారు. బుధవారం 12వ రోజు.. పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం గంటావారిపాలెం నుంచి బయలుదేరి బస్సు యాత్ర పిడుగురాళ్ల వరకు అక్కడ నుంచి ధూళిపాళ్ల వరకు దిగ్విజయంగా కొనసాగింది.
మేమంతా సిద్ధం’ 13వ రోజు శుక్రవారం (ఏప్రిల్ 12) షెడ్యూల్
‘మేమంతా సిద్ధం’ 13వ రోజు శుక్రవారం (ఏప్రిల్ 12) షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం గురువారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 9 గంటలకు ధూళిపాళ్ల రాత్రి బస నుంచి బయలుదేరుతారు. సత్తెనపల్లి, కోర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు.
అనంతరం చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్ మీదుగా సాయంత్రం 3.30 గంటలకు ఏటుకూరు బైపాస్ సభ ప్రాంగణంకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం తక్కెలపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళ్ రావు నగర్, నంబూరు క్రాస్ మీదుగా నంబూరు బైపాస్ దగ్గర రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment