సాక్షి, విజయనగరం: టీడీపీ అధినేత చంద్రబాబు వెనక బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఒకరు ప్రత్యక్షంగా మరొకరు పరోక్షంగా మద్దతిస్తున్నాయని విమర్శించారు. ఒక్క జగన్ మీదకు బాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ ఎగబడుతున్నారని మండిపడ్డారు. ఇంత మంది తోడేళ్లు ఏకమై తన మీద యుద్ధానికి వస్తున్నారని తెలిపారు. పెత్తందార్లకు, నారా కౌరవ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
ప్రజలకు మంచి చేసిన జగన్‌పై తోడేళ్ల దాడి
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 21వ రోజు మంగళవారం విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా చెల్లూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష కూటమిపై నిప్పులు చెరిగారు. ప్రజలను మోసాలతో వంచించడమే చంద్రబాబు పని అంటూ ధ్వజమెత్తారు. ప్రజలకు మంచి చేసిన జగన్‌పై తోడేళ్లు దాడికి దిగుతున్నాయని దుయ్యబట్టారు. మీ బిడ్డకు తోడుగా దేవుడి దయ, కోట్ల ప్రజల హృదయాలు ఉన్నాయన్నారు.
మోసాల బాబుకు బుద్ది చెప్పేందుకు సిద్ధమా?
ఎన్నికలప్పుడు కూటమి నమ్మించి మోసం చేస్తుందని మండిపడ్డారు సీఎం జగన్. నమ్మించి మోసం చేసిన కూటమి నేతల్ని 420 అంటారని అన్నారు. చంద్రబాబు వెనక దత్తపుత్రుడు ఉన్నాడని అన్నారు. ఓవైపు జగన్ ఒక్కడే అయితే మరోవైపు తోడేళ్లు ఏకమయ్యాయని విమర్శించారు. మోసాల బాబుకు బుద్ది చెప్పేందుకు మీరంతా సిద్ధమా?..చంద్రబాబుబు కూటమికి బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమా? అంటూ చెల్లూరు సభకు హాజరైన జనవాహినిని ఉద్ధేశించి సీఎం జగన్ ప్రసంగించారు.
సీఎం జగన్ ఇంకా మాట్లాడుతూ.
- విజయ నగరం జిల్లాలో మహాసముద్రం కనిపిస్తోంది.
- శత్రు సైన్యాన్ని చిత్తుగా ఓడించేందుకు మీరంతా సిద్ధమా?
- ఈ ఎన్నికలు.. రాబోయే అయిదేళ్ల భవిష్యత్తు.
- 58 నెలల్లో 130సార్లు బటన్ నొక్కి సంక్షేమం అందించాం.
- దాదాపు 40 పథకాలను పేదలకు, మధ్యతరగతి ప్రజలకు అందించాం.
- 2 లక్షల 70 వేల కోట్లు నేరుగా ప్రజలకు అందించాం.
- నాన్‌డీబీటీ ద్వారా మరో లక్ష కోట్లకు పైగా ఇచ్చాం.
- మొత్తం రూ. 3 లక్షల 75 వేల కోట్లకు పైగా అందించాం.
- ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా బటన్ నొక్కి నేరుగా ప్రజల ఖాతాలకు నగదు వేశాం.
మీ డ్రీమ్స్‌ను నా స్కీమ్స్‌తో నెరవేర్చాను.
- పిల్లలను చదివించేందుకు అమ్మఒడి పథకం తీసుకొచ్చాం.
- ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన.
- పిల్లల ఉన్నత చదువుల కోసం విద్యా దీవెన, వసతి దీవెన.
- డ్రీమ్స్ పేదింటి అమ్మది.. స్కీమ్స్ మీ బిడ్డవి.
- అక్కాచెల్లెమ్మల సాధికారత కోసం వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ.
- అక్కాచెల్లెమ్మల కోసం వైఎస్సార్ చేయూత తీసుకొచ్చాం.
- వైఎస్సార్ కాపునేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం తీసుకొచ్చాం.
- చంద్రబాబుకు ఎప్పుడైనా ఇంతమంచి ఆలోచన వచ్చిందా?
- పేద ప్రజల గురించి ఏ ఒక్కరోజు కూడా చంద్రబాబు ఆలోచన చేయలేదు.
- చంద్రబాబు అంటే చంద్రముఖి కాబట్టి ఆ ఆలోచన రాలేదు.
- చంద్రబాబు హయాంలో చంద్రముఖి పాలన చూశాం.
డ్రీమ్స్ అవ్వాతాతలవి.. స్కీమ్స్ మీ బిడ్డవి
- అవ్వాతాతల డ్రీమ్స్ నెరవేరుస్తూ ప్రతినెలా రూ.3 వేల పెన్షన్.
- వాలంటీర్ల ద్వారా ఒకటో తేదీనే ఇంటి వద్దకే రూ. 3 వేల పెన్షన్.
- డ్రీమ్స్ యువతది.. స్కీమ్స్ మీ జగనన్నది.
- దేశంలో ఎప్పుడూ జరగని విధంగా ఉద్యోగాలిచ్చాం.
- 58 నెలల్లోనే 2 లక్షల 31 వేల ఉద్యోగాలిచ్చాం.
- 31 లక్ష ఇళ్ల పట్టాలను పేదింటి మహిళలకు ఇచ్చింది మన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
- ఇంత మంచి చేసిన మీ అన్నకు రాఖీ కడతారా?.
- స్టార్ క్యాంపెయిన్లుగా మీరంతా మీ అన్నకు తోడుగా ఉంటారా?
చంద్రబాబు హయాం అంతా.. మోసం,మోసం, మోసం
- బాబు పాలనలో స్కీంలు ఉండవు.. స్కాంలు మాత్రమే ఉంటాయి.
- జన్మభూమి కమిటీలతో చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకున్నారు.
- విజయవాడలో కాల్ మనీ, సెక్స్ రాకెట్ నడపడం తప్ప చంద్రబాబు చేసింది ఏంటి?
- ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు చేసిన మోసాలు చెప్పండి.
డ్రీమ్స్ రైతులవి.. స్కీమ్స్ మీ జగన్‌వి
- ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రం, పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్.
- పెట్టుబడి సాయంగా రైతు భరోసా రూ. 13,500 ఇచ్చాం.
- సకాలంలో ఇన్‌పుట్ సబ్సిడీ, రూ. 65 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు.
- దోచుకోవడం.. పంచుకోవడమే చంద్రబాబు డ్రీమ్.
- పొలాల్లో పెట్టే దిష్టిబొమ్మనైనా నమొచ్చేమోకానీ చంద్రబాబును నమ్మలేం.
- ప్రతి ఎన్నికల సమయంలో రంగరంగుల మేనిఫెస్టో తెస్తారు.
- ఎన్నికల అయిపోయాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తాడు చంద్రబాబు.
- నారా కౌరవ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు.
గ్రామాల కోసం 7 స్కీమ్‌లు తీసుకొచ్చాం
- సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, ఆర్‌బీకే, విలేజ్‌క్లినిక్
- స్కూళ్ల రూపురేఖలు, మహిళా పోలీస్, డిజిటల్ లైబ్రరీలు
- 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి
- మాట ఇస్తే నిలబడే పాలన మీ జగన్‌ది
- చంద్రబాబు మోసాలను గుర్తు చేసుకోండి
- ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచన చేయండి
Comments
Please login to add a commentAdd a comment