
సాక్షి, ప్రకాశం జిల్లా: మేమంతా సిద్ధం 11వ రోజు సోమవారం (ఏప్రిల్ 8) షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఆదివారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 9 గంటలకు వెంకటా చలంపల్లి రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు.
ఉదయం 9:30 గంటలకి వెంకటాచలంపల్లి దగ్గర సామజిక పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చీకటిగల పాలెం మీదుగా వినుకొండ 3 గంటలకు చేరుకుని రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటారు. తరువాత కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెం రాత్రి బసకు చేరుకుంటారు.
ఇదీ చదవండి: చంద్రబాబు దారి అడ్డదారి: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment