‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేప‌టి షెడ్యూల్‌ | Memantha Siddham: Cm Jagan Bus Yatra April 7th Schedule | Sakshi
Sakshi News home page

‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేప‌టి షెడ్యూల్

Published Sat, Apr 6 2024 7:25 PM | Last Updated on Sat, Apr 6 2024 7:53 PM

Memantha Siddham: Cm Jagan Bus Yatra April 7th Schedule - Sakshi

సాక్షి, ప్రకాశం జిల్లా: మేమంతా సిద్ధం 10వ రోజు ఆదివారం (ఏప్రిల్ 7) షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శనివారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 9 గంటలకు జువ్విగుంట క్రాస్ రాత్రి బస చేసిన ప్రాంతం  నుంచి బయలుదేరుతారు.

పెద్ద అలవలపాడు, కనిగిరి మీదగా పెద్ద అరికట్ల తరువాత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చిన్న అరికట్ల, మూగచింతల మీదుగా కొనకనమెట్ల క్రాస్  చేరుకుని సాయంత్రం 3:30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం బత్తువారిపల్లి, సలకనూతల క్రాస్, పొదిలి, రాజంపల్లి, దర్శి మీదుగా  వెంకటాచలంపల్లి రాత్రి బసకు చేరుకుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement