ఉదయం 9 గంటలకు ప్రారంభం
దేవరంపాడు క్రాస్ వద్ద భోజన విరామం
అయ్యప్పనగర్ బైపాస్ వద్ద బహిరంగ సభ
ధూళిపాళ్ల దగ్గర రాత్రి బస
సాక్షి, అమరావతి: మేమంతా సిద్ధం 12వ రోజు బుధవారం (ఏప్రిల్ 10) షెడ్యూల్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మంగళవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రి బస చేసిన గంటావారిపాలెం వద్ద నుంచి బుధవారం ఉదయం 9 గంటలకు యాత్ర ప్రారంభిస్తారు.
పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్, రొంపిచర్ల క్రాస్, విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా సాయంత్రం 3.30 గంటలకు అయ్యప్పనగర్ బైపాస్ వద్దకు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం కొండమోడు జంక్షన్, అనుపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం మీదుగా ధూళిపాళ్ల దగ్గర రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.
12న గుంటూరులో మేమంతా సిద్ధం సభ
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు నగరంలో ఈనెల 12న ‘మేమంతా సిద్ధం’ సభ జరుగుతుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం తెలిపారు. మంగళవారం ఆయన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో కలిసి సభ జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 12వ తేదీ ఉదయం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర సత్తెనపల్లి, మేడికొండూరు, పేరేచర్ల, నల్లపాడు, చుట్టుగుంట సెంటర్, వీఐపీ రోడ్ మీదుగా ఏటుకూరు చేరుకుంటుందని చెప్పారు. అక్కడ జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతారని తెలిపారు. రాత్రికి గుంటూరు జిల్లాలోనే సీఎం జగన్ బస చేస్తారని వెల్లడించారు. 13వ తేదీ ఉదయం ఎన్టీఆర్ జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశిస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment